షార్ట్ స్కర్ట్ లో సెగలు రేపుతున్న శ్రీముఖి

Phani.ch

10 May 2024

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా కనపడుతూ ఉంటుంది శ్రీముఖి. సినిమాల్లో అడపాదడపా వస్తున్న ఆఫర్స్ ని ఉపయోగించుకుంటోంది.

నటి కావాలని శ్రీముఖి పరిశ్రమలో అడుగు పెట్టారు. హీరోయిన్ గా ప్రయత్నాలు చేశారు. అది అంత ఈజీ కాదని తెలుసుకుని బుల్లితెరకు షిఫ్ట్ అయ్యారు.

పటాస్ షో శ్రీముఖికి ఫేమ్ తెచ్చిపెట్టింది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా రాహుల్ సిప్లిగంజ్ కి గట్టి పోటీ ఇచ్చి  తన సత్తా చాటి శ్రీముఖి.

తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే మాటలు కూడా వినిపించాయి. కానీ రన్నరప్ తో సరిపెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

యాంకర్ గా అవకాశాలు వస్తున్నప్పటికీ వెండితెరపై కూడా రాణించాలని ఆమె కోరుకుంటుంది. దానిలో భాగంగా క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది ఈ చిన్నది.

క్రేజీ అంకుల్స్ మూవీలో శ్రీముఖి హీరోయిన్ గా నటించింది.  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన హాట్ ఫోటోస్ తో కుర్రాళ్ళని ఆకట్టుకుంటుంది.

అతి తక్కువ కాలం లోనే ఎదిగిన శ్రీముఖి తనతో పాటు పరిశ్రమకు వచ్చిన పలువురు యాంకర్స్ ని దాటుకుంటూ వెళ్ళిపోతుంది.