రష్మికకు భారీ ఆఫర్.. ఆ స్టార్ హీరోతో రొమాన్స్

TV9 Telugu

09 May 2024

అల్లు అర్జున్ తో కలిసి నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్ గా మారిపోయింది కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్నా.

ఆ తర్వాత రణ్ బీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ప్రస్తుతం దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజిబిజీగా ఉంటోందీ అందాల తార.

అలాగే ఓవైపు స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటిస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా సై అంటోంది రష్మిక మందన్నా.

తాజాగా ఈ అమ్మడికి మరో క్రేజీ ఆఫర్ వచ్చింది.  బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు‌ సల్మాన్ ఖాన్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కించుకుంది.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ ఏఆర్ మురుగదాస్- సల్మాన్  కాంబినేషన్‌లో ‘సికందర్’ పేరుతో ఓ భారీ ప్రాజెక్టు రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రాన్ని నదియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సాజిద్ నదియాద్వాలా అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్ గా రష్మిక మందన్నాను తీసుకోనున్నారని, త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.