నేనేంటో నిరూపించుకోవాల్సిన పనిలేదు.. దటీజ్ సమంత

TV9 Telugu

09 May 2024

గతేడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది టాలీవుడ్ నటి సమంత. ఇందులో ఖుషి సూపర్ హిట్ గా నిలిచింది.

అయితే ఖుషి తర్వాత అమెరికాకు వెళ్లిపోయింది సమంత. మయోసైటీస్‌ అనే  వ్యాధితో బాధ పడుతున్న ఆమె అక్కడే చికిత్స తీసుకుంది.

సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సమంత త్వరలోనే సిటాడెల్ అనే యాక్షన్ ఓరియంటెడ్ వెబ్ సిరీస్ తో త్వరలోనే మన ముందుకు రానుంది.

నటిగానే కాకుండా ఇప్పుడు తనే నిర్మాతగా మారి తెలుగులో మా ఇంటి బంగారం అనే హీరోయిన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రాన్ని చేయడానికి సిద్ధమైందీ అందాల తార.

ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే సమంత.. ఇటీవల షేర్ చేసిన కొన్ని ఫొటోలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

సమంత అర్ధనగ్నంగా స్నానం చేస్తున్న ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో నెటిజన్లు ఆమెపై నెటిజన్లు విరుచుకు పడ్డారు.

తీరా చూస్తే అది సమంత ఫొటో కాదని, ఫేక్‌ అని తేలింది. తాజాగా ఈ  వ్యవహారంపై నోరు విప్పన సమంత తనపై విమర్శలు చేసిన వారికి కౌంటర్ ఇచ్చింది.

ఇప్పుడు తాను ఎవరికీ, ఏ విషయంలోనూ కొత్తగా నిరూపించుకోవలసిన అవసరం లేదని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది సమంత.