అందాలతో హడలెత్తిస్తున్న నాగిని

Phani.ch

09 May 2024

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అంత సులువుగా దొరకవని తెలిసిందే.. అక్కడ ఎన్నో అవమానాలు భరించాలి, అడ్డంకులను అధిగమించాలి.

అవమానాలు, అడ్డంకులను దాటుకుని వచ్చిన ఒక సెలబ్రిటీ.. ఇప్పుడు క్రేజీ యాక్ట్రెస్‌గా ఒక రేంజ్ పాపులారిటీ సంపాదించింది. ఆమె పేరు మౌని రాయ్.

 భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న సెలబ్రిటీల్లో మౌని రాయ్ ఒకరు. ఆమె టీవీ నటి మాత్రమే కాదు, రియాలిటీ షోలను హోస్ట్ చేస్తుంటుంది.

కెరీర్ ప్రారంభంలో ఎదురైన అవమానాలు, కష్టాల గురించి మౌనీ రాయ్ మాట్లాడింది. తనకు యాక్టింగ్ రాదన్నారని, సినిమాలకు పనికిరావని అవమానించారని చెప్పింది.

ఇది ఫెయిర్‌ ఇండస్ట్రీ కావచ్చు. కానీ  ఇక్కడ హార్డ్‌ వర్క్‌ ఒక్కటే సరిపోదు, చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా సార్లు కింద పడేస్తుంది. 

తనకు వస్తుందనకుని ఆశలు పెంచుకుని, చివరకు చేజారిన పాత్రల గురించి కూడా మౌని రాయ్ షేర్‌ చేసుకుంది.

మౌనీ రాయ్ దుబాయ్‌కి చెందిన బిజినెస్‌మెన్‌ సూరజ్ నంబియార్‌ను పెళ్లి చేసుకుంది. అంతకు ముందు వీరు మూడు సంవత్సరాలు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు.

2022 జనవరి 27న గోవాలోని పనాజీలో వీరి పెళ్లి జరిగింది. ఈ జంట బెంగాలీ, మలయాళీ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు.