Breaking News
  • అమరావతి: చంద్రబాబును నమ్మి భూములిచ్చి దళిత రైతులు మోసపోయారు. మా ప్రభుత్వ నిర్ణయంతో దళిత రైతులకు న్యాయంజరిగింది-ఎమ్మెల్యే ఆర్కే. దళిత రైతుల భూములను చంద్రబాబు తనవారికి కారుచౌకగా ఇప్పించారు. రాజధాని ప్రాంతంలో బినామీలుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల చిట్టాను త్వరలో బయటపెడతాం-ఎమ్మెల్యే ఆర్కే.
  • ప్రకాశం జిల్లా: సింగరాయకొండ మండలం పాకల దగ్గర సముద్రంలో నలుగురు యువకుల గల్లంతు. ముగ్గురిని కాపాడిన మెరైన్‌ పోలీసులు. మరో యువకుడి కోసం కొనసాగుతున్న గాలింపు.
  • యానాంలో ప్రేమజంట అనుమానాస్పద మృతి. మృతులు కాట్రేనిపాడుకు చెందిన రమేష్‌. మలికిపురం మండలానికి చెందిన యువతిగా గుర్తింపు. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ఈ నెల 9న ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమజంట. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత. దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 14 కిలోల బంగారం స్వాధీనం. అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.5.46 కోట్లు ఉంటుందని అంచనా.
  • అమరావతి: అసెంబ్లీకి వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకున్నారు-చంద్రబాబు. అమాయకులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ పెట్టి దాడులు చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఇంగ్లీష్‌ మీడియాన్ని వైసీపీ నేతలు వ్యతిరేకించారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తెచ్చి రెండు నాలుకలధోరణి అవలంబిస్తున్నారు కొత్త చీఫ్‌ మార్షల్‌ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు-చంద్రబాబు.
  • గుంటూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసీపీ నెరవేర్చలేదు. ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు-యరపతినేని. ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి-మాజీ ఎమ్మెల్యే యరపతినేని. నియోజకవర్గ పరిధిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వైసీపీ కార్యకర్తలే ఇసుకను బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్నారు-మాజీ ఎమ్మెల్యే యరపతినేని.

ఫ్రీ వైఫై ఉపయోగిస్తున్నారా..? అయితే మీ డబ్బులు పోయినట్లే.!

Bank Account Holders Beware Of Using Public WiFi, ఫ్రీ వైఫై ఉపయోగిస్తున్నారా..? అయితే మీ డబ్బులు పోయినట్లే.!

మీరు పబ్లిక్ వైఫైను వాడుతున్నారా.? జర భద్రం గురూ.! మీ వ్యక్తిగత వివరాలు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంది. యువత తరచుగా ఫ్రీ వైఫైను విరివిగా వాడుతున్నారు. మూవీలు, వీడియోలు అంటూ తెగ డౌన్లోడ్‌లు చేసేస్తున్నారు. అయితే ఆ పబ్లిక్ వైఫైను సాధారణ బ్రౌజింగ్ కోసం వాడితే ఫర్వాలేదు గానీ.. బ్యాంకింగ్ లావాదేవీల కోసం ఉపయోగిస్తే మాత్రం అకౌంట్లలో డబ్బులు మాయమవుతాయి.

పబ్లిక్ వైఫైతో మీరు బ్యాంక్ అకౌంట్‌లోకి లాగిన్ అయితే.. ఆ వివరాలన్నీ వైఫై ప్రొవైడ్ చేసేవారికి ఈజీగా తెలిసిపోతుంది. వెబ్ ఇంటర్ ఫేస్ నుంచి సెర్చ్ చేసినవారి వివరాలు వారికి ఈజీగా చేరిపోతాయి. ఒకవేళ మనకు తెలియని వెబ్‌సైట్లను ఓపెన్ చేస్తే.. బ్రౌజింగ్ సమయంలో వచ్చే లింకులు క్లిక్ చేసినప్పుడు వాటి ద్వారా మాల్‌వేర్ మన డివైజ్‌లోకి చేరి మన పర్సనల్ డేటాను క్యాప్చర్ చేసే ముప్పు ఉంది.

అందుకే ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్లను ఫ్రీ వైఫైలతో బ్యాంకు అకౌంట్లలోకి లాగిన్ కావొద్దని గట్టిగా హెచ్చరిస్తుంది. అంతేకాకుండా ఫోన్ల ద్వారా బ్యాంక్ అధికారులమంటూ మీ అకౌంట్ డీటెయిల్స్ అడిగినా కూడా.. చెప్పవద్దని సూచిస్తారు. సో బీ ఎలర్ట్.. మీ వ్యక్తిగత వివరాలు బయటకి తెలియకూడదంటే.. పబ్లిక్ వైఫైలకు దూరంగా ఉండండి.