రెండు లారీల మధ్యలో చిక్కుకుని.. నుజ్జునుజ్జు అయ్యాడు..

Autonagar Transport Employee Died In Freek Accident

విజయవాడ ఆటో నగర్ ట్రాన్స్ పోర్టు కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆటోనగర్ ట్రాన్స్ పోర్టులో అసిస్టెంట్ సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న మనోజ్‌కుమార్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో రెండు లారీల మధ్యలో ఇరుక్కుని మనోజ్ కుమార్ దుర్మరణం చెందాడు. అయితే బాధితుడు మరణించిన రెండు గంటల వరకు కూడా నవతా యాజమాన్యం స్పందించలేదు. గుట్టుచప్పుడు కాకుండా తెల్లవారుజామున 4 గంటలకు మృతదేహాన్ని సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే మనోజ్ కుమార్ మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మనోజ్ కుమార్ చనిపోయిన సంఘటనను కుటుంబసభ్యులకు చెప్పకుండా మృతదేహాన్ని గోప్యంగా ఆసుపత్రికి తరలించడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం తీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *