Numerology: ఈ తేదీల్లో పుట్టినవారి ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసా..?

సంఖ్యా శాస్త్రం ప్రకారం.. మీ పుట్టిన తేదీ ఆధారంగా మీ లక్కీ నంబర్ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మూల సంఖ్య 9 ఉన్నవాళ్లకు ప్రేమ, రిలేషన్‌షిప్స్‌ లో ఎలాంటి అనుభవాలు ఉంటాయో.. అలాగే వీళ్లకు సరిపడే లైఫ్ పార్ట్‌నర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

Numerology: ఈ తేదీల్లో పుట్టినవారి ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసా..?
Numerology Secrets

Updated on: Jul 16, 2025 | 8:43 PM

మీ పుట్టిన తేదీ ఆధారంగా మీ లక్కీ నంబర్ ని తెలుసుకోవడం.. దాని ద్వారా మీ వ్యక్తిత్వం, జీవిత గమనాన్ని అర్థం చేసుకోవడం ఈ రోజుల్లో చాలా ప్రాచుర్యం పొందింది. ఈసారి మనం మూలసంఖ్య 9 ఉన్నవారికి ప్రేమ, సంబంధాల విషయంలో ఎలాంటి అనుభవాలు ఉంటాయో.. వారికి బెస్ట్ పార్ట్‌నర్స్ ఎవరు అనేది వివరంగా తెలుసుకుందాం.

మూలసంఖ్య ఎలా తెలుసుకోవాలి..?

మీరు పుట్టిన తేదీలోని అంకెలను కలిపితే మీ మూలసంఖ్య వస్తుంది. సింపుల్‌ గా చెప్పాలంటే.. మీరు నెలలో 15వ తేదీన పుట్టారనుకోండి 1+5 = 6 అవుతుంది. అంటే మీ మూలసంఖ్య 6.

మూలసంఖ్య 9కి అధిపతి ఎవరు..?

మూలసంఖ్య 9కి మంగళ గ్రహం (కుజుడు) అధిపతి. ఈ నంబర్ ఉన్నవాళ్లు చాలా ఎనర్జిటిక్‌ గా, ధైర్యంగా ఉంటారు. కానీ అప్పుడప్పుడూ కొంచెం టెంపర్ ఎక్కువ ఉండొచ్చు. 9, 18, లేదా 27వ తేదీల్లో పుట్టినవాళ్లు మూలసంఖ్య 9 కిందకు వస్తారు.

ఈ సంఖ్య 9 వారికి పర్ఫెక్ట్ మ్యాచ్ ఎవరు..?

మూలసంఖ్య 3 ఉన్నవాళ్లు, మూలసంఖ్య 9 ఉన్నవాళ్లకు పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్‌నర్స్ అవుతారు. 3, 12, 21 లేదా 30వ తేదీల్లో పుట్టినవాళ్లు మూలసంఖ్య 3కి చెందుతారు. వీళ్లపై గురు గ్రహం (బృహస్పతి) ప్రభావం ఉంటుంది. వీళ్ల తెలివి, పాజిటివ్ మైండ్‌సెట్ వల్ల మూలసంఖ్య 9 వాళ్లతో సూపర్ బాండింగ్ ఉంటుంది.

మూలసంఖ్య 6తో కూడా సూపర్ కాంబినేషన్

మూలసంఖ్య 6 ఉన్నవాళ్లతో కూడా 9కి మంచి జోడీ కుదురుతుంది. వీళ్లపై శుక్ర గ్రహం (శుక్రుడు) ప్రభావం ఉంటుంది. ఇది ప్రేమ, శాంతి, అందం వంటి వాటికి సింబల్. 6, 15, 24వ తేదీల్లో పుట్టినవాళ్లు మూలసంఖ్య 6కి చెందుతారు. వీళ్ల కూల్ అండ్ సాఫ్ట్ నేచర్ 9 వాళ్లలోని ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తుంది.

9-9 కాంబినేషన్ ఎలా ఉంటుంది..?

మూలసంఖ్య 9 ఉన్నవాళ్లు మరో 9 మూలసంఖ్య ఉన్నవాళ్లతో కూడా ఈజీగా జీవించగలరు. ఇది ఒక పవర్ఫుల్ కాంబినేషన్.. ఎందుకంటే ఇద్దరిలోనూ అదే ధైర్యం, ఎగ్జైట్‌మెంట్ ఉంటాయి. మంచి అండర్‌స్టాండింగ్‌ తో ఈ రిలేషన్‌షిప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.

ఈ వివరాలు సంఖ్యాశాస్త్రం ఆధారంగా ఇవ్వబడ్డాయి. అయితే మీ పర్సనల్ జాతకం కూడా మీ లైఫ్‌పై ప్రభావం చూపొచ్చు. అందుకే ఏదైనా పెద్ద డెసిషన్ తీసుకునే ముందు ఎక్స్‌పర్ట్స్ సలహా తీసుకోవడం బెటర్.