వార ఫలాలు (అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 14, 2023 వరకు): మేష రాశి వారు ఒకట్రెండు శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి. వృషభ రాశి వారికి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. గృహ, వాహన సౌకర్యాలు అమరడానికి లేదా మెరుగుపడడానికి అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు ఈ వారం వారఫలాలు ఎలా ఉంటాయో చూద్దాం..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
గురు, శుక్ర, శని గ్రహాల సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో చక్కబెడతారు. ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సోదరులతో వివాదాలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికంగా సాగిపోతాయి. ప్రేమ వ్యవహారాల్లో సుఖ సంతోషాలను అనుభవిస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
రాశ్యధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో, రవి, బుధులు పంచమ స్థానంలో ఉండడం వల్ల మీ ప్రయత్నాలు, మీ ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. గృహ, వాహన సౌకర్యాలు అమరడానికి లేదా మెరుగుపడడానికి అవకాశం ఉంది. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు చురుకుగా ముందుకు సాగుతాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగంలో మీకు విలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. విద్యా ర్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపో తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
గురు, శుక్ర, బుధ గ్రహాల సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి వివాదాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహా రాల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసి లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబసమేతంగా ఆలయాలను దర్శిస్తారు. ఆరోగ్యం అను కూలంగా ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఈ రాశికి ధన స్థానంలో శుక్రుడి సంచారం, మూడవ స్థానంలో రవి, బుధుల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. జీత భత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్త అందుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అష్టమ శని కారణంగా ఇంటా బయటా బాగా ఒత్తిడి, శ్రమ ఉంటాయి. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం విషయంలో కొద్దిగా ఆందోళన కలుగుతుంది. పిల్లల మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితం సాఫీగా, ప్రశాంతంగా సాగిపోతుంది. సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు కొద్ది కష్టంతో ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందులు కలిగిస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
గురు, శుక్ర, బుధ గ్రహాల బలం వల్ల సమాజంలో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో స్నేహాలు పెరు గుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచ నలు, వ్యూహాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఆస్తి వివాదాలు, పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందు తాయి. నిరుద్యోగులు పోటీ పరీ క్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవలు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి, బంధువుల నుంచి శుభ వార్తలు వింటారు. ఇంట్లో శుభ కార్యాన్ని తలపెడతారు. రావలసిన డబ్బు చేతికి అందుబ తుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఈ రాశిలో ఏర్పడిన బుధాదిత్య యోగం వల్ల అనేక ముఖ్య వ్యవహారాలు సానుకూలపడతాయి. వ్యక్తిగత సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదం ఒకటి పరిష్కార దిశగా సాగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు అందుకుంటారు. పెళ్లి సంబంధానికి సంబం ధించి బంధువుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. పిల్లల విద్యా విషయాలు సాను కూలంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గించుకుంటారు. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. చదువుల విషయంలో విద్యార్థులు మరింతగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
గురు, శుక్ర, శని గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ప్రతి పనీ సునాయాసంగా పూర్తవు తుంది. సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. చేపట్టిన వ్యవహారాల్లో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. పెండింగు పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దీర్ఘ కాలిక అనారోగ్యం నుంచి చాలావరకు బయటపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల భంగపడ తారు. సొంత పనులు మీద శ్రద్ధ పెంచడం మంచిది. సతీమణికి వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
రవి, బుధ, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ, వ్యయ స్థానంలో ఉన్న రాశినాథుడు కుజుడు కారణంగా ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. అర్ధాష్టమి శని, షష్టంలో గురువు కారణంగా వ్యయ ప్రయాసలతో గానీ ఏ ముఖ్యమైన వ్యవహారమూ పూర్తి కాదు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో చాకిరీ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి నిల కడగా ముందుకు సాగుతుంది. కొందరు మిత్రులకు సహాయం చేయడం కూడా జరుగుతుంది. బంధువులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. సతీమణికి ఆశించిన శుభవార్త అందు తుంది. విద్యార్థులలో ఏకాగ్రత, శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు రొటీన్ గా సాగిపో తాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
గురు, శని, రవి, బుధ, కుజ గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా సఫలం అవుతుంది. ఈ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది. కొత్త కార్యక్రమాలు, ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మీ ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. అధికారుల నుంచి ఆశించినంతగా ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాలు ఆశా జనకంగా ముందుకు సాగుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
శని, బుధ, శుక్రుల బలం బాగా అనుకూలంగా ఉంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగు తాయి. సత్కారాలు జరిగే అవకాశం కూడా ఉంది. విలువైన బహుమతులు అందుతాయి. మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలను, అవరోధాలను తేలికగా అధిగమిస్తారు. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఏలిన్నాటి శని కారణంగా చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. శుక్రుడు సప్తమంలో బాగా అనుకూలంగా ఉన్నందు వల్ల సతీమణి నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం పెరిగినప్పటికీ ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగి పోతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్ట పోయే సూచనలున్నాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శించే అవకాశం ఉంది. విద్యార్థులు ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు రొటీన్ గా సాగిపోతాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ధన స్థానంలో ఉన్న గురువు కారణంగా ఆర్థిక పరిస్థితి క్రమంగా అనుకూలంగా మారుతూ ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడడం, కుటుంబ సమస్యలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. ఇతరులు మేలు చేసే స్థితిలో ఉంటారు. సమాజంలోనే కాక, వృత్తి, ఉద్యోగాల్లో కూడా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. బంధుమిత్రులు మీ సలహాలు, సూచనలతో ప్రయోజనం పొందుతారు. వ్యాపారాల్లో లాభాల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సతీమణికి వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు, ఆఫర్లు అంది వస్తాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు తేలికగా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో హాయిగా సాగిపోతాయి.