Weekly Horoscope: వారికి ఆకస్మిక ధనలాభం.. 12 రాశులకు వారికి వార ఫలాలు (డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 9 వరకు)

| Edited By: Janardhan Veluru

Dec 03, 2023 | 4:30 AM

వార ఫలాలు (డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు): మేష రాశి వారికి శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి వారికి మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Weekly Horoscope: వారికి ఆకస్మిక ధనలాభం.. 12 రాశులకు వారికి వార ఫలాలు (డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 9 వరకు)
Weekly Horoscope 3 9 December 2023
Follow us on

వార ఫలాలు (డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 9, 2023 వరకు): మేష రాశి వారికి శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశి వారికి మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ వారమంతా ప్రశాంతంగా, సానుకూలంగా జరిగిపోతుంది. శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం వల్ల మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పిల్లలు చదువుల్లో దూసుకు పోతారు. ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ ప్రోత్సాహకం లేదా ప్రతిఫలం ఉంటుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఉత్సాహంగా దూసుకుపోతారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన ప్రయోజనాలుంటాయి. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. ఉద్యోగానికి సంబంధించి మెరుగైన అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు సమయం అనుకూ లంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలను కొద్ది ప్రయ త్నంతో పరిష్కరించుకుంటారు. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, డాక్టర్లు, ఇంజనీర్లకు ఒక్క క్షణం కూడా తీరిక దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. విద్యార్థులలో శ్రద్ధాసక్తులు కొద్దిగా తగ్గే సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయాలు వరిస్తాయి. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు కూడా చాలావరకు పరిష్కారం అవు తాయి. మొత్తం మీద వారమంతా అనుకూలంగా గడిచిపోతుంది. ఈ సమయాన్ని వీలైనంతగా సద్వినియోగం చేసుకోవడం మంచిది. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకుంటారు. అంతేకాక, ఆర్థిక వ్యవహారాలన్నీ సానుకూలపడతాయి. మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యో గులు ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. తలపెట్టిన పనులు కొద్దిగా నిదానంగా పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికార యోగం పట్టడానికి అవకాశం ఉంది. అధికా రులతో సమానంగా అధికారాలను అనుభవిస్తారు. మొత్తానికి వృత్తి, ఉద్యోగాలపరంగా సమయం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపారాలు కూడా లాభాల పరంగా ఊపందుకుంటాయి. సొంత ఆలోచనలు, నిర్ణయాలతో కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. ఒక శుభ పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. మంచి పరి చయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం పట్ల అప్ర మత్తంగా ఉండాలి. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగు తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. బంధుమిత్రులు బాగా కలిసి వస్తారు. ముఖ్య మైన వ్యవహారాలు, ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. బాగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లు తగ్గుతారు. ప్రణాళికా బద్ధంగా వ్యవహరించి వ్యక్తిగత, కుటుంబ సమస్యలను పరిష్కరించుకుం టారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు, శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. హామీలు ఉండవద్దు. సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు పరవాలేదనిపిస్తాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉన్నప్పటికీ మొత్తం మీద వారమంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. ముఖ్యమైన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేస్తారు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కొద్దిగా పట్టు విడుపులతో వ్యవహరిం చడం మంచిది. బంధుమిత్రుల నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందుతాయి. ఆదా యానికి ఏమాత్రం లోటుండదు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి. వ్యాపా రాల్లో కొత్త వ్యూహాలు అమలు చేస్తారు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి ప్రయత్నమైనా ఆశించిన ఫలితాలనిస్తుంది. మీ మాటకు, చేతకు ఎక్కడా ఎదురుండదు. ముఖ్య మైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూ లంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. నిరుద్యోగులకు అను కూల వాతావరణం ఉంది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో సామాన్య లాభా లందుకుంటారు. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు అందుతాయి. కొందరు సన్నిహితుల వల్ల డబ్బు నష్టపోతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు విం టారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయం, ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటాయి కానీ, అనవసర ఖర్చుల కారణంగా ఇబ్బందుల్లో పడతారు. బంధుమిత్రులతో పాటు అధికారులు కూడా మిమ్మల్ని ఎక్కువగా ఉపయోగించుకో వడం జరుగుతుంది. ఒకటి రెండు శుభ పరిణామాలకు అవకాశం ఉంది. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ పెద్దల సలహాలను తీసు కోవడం మంచిది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం పరవాలేదు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపో తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఏ పని తలపెట్టినా సునాయాసంగా పూర్తవుతుంది. బంధుమిత్రుల నుంచే కాక, కుటుంబ సభ్యుల నుంచి కూడా సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు కూడా సానుకూలంగా పూర్తవుతాయి. శుభ వార్తలు వింటారు. శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో సాను కూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. సోదరులతో ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. కొన్ని వ్యక్తిగత పనులు నిదానంగా పూర్తి అవుతాయి. స్వల్ప అనారోగ్యానికి అవ కాశం ఉంది. ఇంటా బయటా పని ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా మార తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తారు. ఇష్టమైన వ్యక్తులను కలుసుకుని ఎంజాయ్ చేస్తారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగానే ఉంటుంది. ఇతరు లకు ఇతోధికంగా సహాయం చేయడం కూడా జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి సంపాదన పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, ప్రమోషన్లకు సంబంధించి శుభ వార్తలు అందుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవు తాయి. కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఇష్టమైన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా అపార్థాలు చోటుచేసు కోవచ్చు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తి చేయడానికి కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. మిమ్మల్ని స్వార్థానికి వాడుకునే వారు ఎక్కువవుతారు. కొద్దిగా గ్రహ బలం బాగున్నందువల్ల వారమంతా చాలావరకు సాను కూ లంగానే గడిచిపోతుంది. ఆర్థికపరంగా కొంత మేలు జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. తలపెట్టిన పనులు చాలా వరకు పూర్తవుతాయి. కుటుంబ సమస్యల విషయంలో జీవిత భాగస్వామిని సంప్రదించడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలలో ఆశించిన స్పందన కనిపి స్తుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపో తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

అనుకోకుండా కొన్ని మంచి విషయాలు సంభవిస్తాయి. కొన్ని శుభవార్తలు వినడం, శుభ పరిణా మాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. స్థిరాస్తికి సంబంధించిన వివాదం ఒకటి పెద్దల జోక్యంతో సానుకూలపడుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించి వ్యక్తిగత సమస్యల నుంచి కొంత వరకు బయటపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగు తాయి. వృత్తి జీవితం వేగం పుంజుకుంటుంది. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందు తారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ప్రయాణాల్లో మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆరోగ్యం అను కూలంగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి.