Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు..

| Edited By: Narender Vaitla

Sep 03, 2023 | 8:03 AM

వారఫలాలు: భవిష్యత్తులో ఏం జరుగుతుందో గ్రహ, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని జ్యోతిష్య పండితులు ముందే లెక్కిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం (03 సెప్టెంబరు) నుంచి శనివారం (09 సెప్టెంబరు) వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉండనున్నాయి..? మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది..? ఇక్కడ రాశుల వారీగా తెలుసుకోండి.

Weekly Horoscope: వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు..
Weekly Horoscope 03 Sep 09 Sep 2023
Follow us on

వారఫలాలు: భవిష్యత్తులో ఏం జరుగుతుందో గ్రహ, నక్షత్రాల గమనాన్ని పరిగణలోకి తీసుకుని జ్యోతిష్య పండితులు ముందే లెక్కిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం (03 సెప్టెంబరు) నుంచి శనివారం (09 సెప్టెంబరు) వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉండనున్నాయి..? మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది..? ఇక్కడ రాశుల వారీగా తెలుసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ వారం అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. దీర్ఘకాలిక అనా రోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. తలపెట్టిన ప్రతి పనినీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. సన్నిహితులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తండ్రి వైపు వారి నుంచి స్థిరాస్తి సంబంధమైన లాభాలు పొందే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో మంచి ఫలితాలు గడిస్తారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. భరణి నక్షత్రం వారికి మరింతగా బాగుంటుంది. తరచూ సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఈ రాశివారికి ఈ వారం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపా రాల్లో విశేషంగా రాణిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు సునాయాసంగా పూర్తవుతాయి. ఆదాయా నికి, ఆరోగ్యానికి లోటుండదు. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కొన్ని వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో మంచి గుర్తింపుతో పాటు కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాకుండా ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు వచ్చే సూచనలున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి బాగా లాభాలు అందుతాయి. కృత్తిక నక్షత్రం వారికి అనేక విధాలుగా మేలు జరుగుతుంది. లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఈ రాశివారికి గురువు, శుక్రుడు, రవి, బుధ గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. దాదాపు అన్ని రంగాలవారు ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. చిన్న తరహా పరిశ్రమల పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్య మైన వ్యవహారాలు, పనుల్లో బంధుమిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలను అనుసరిస్తారు. దాయాదుల మీద విజయాలు సాధిస్తారు. సమాజంలో మీ పలుకుబడి మరింతగా పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులు శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో మాట ఇవ్వడం మంచిది కాదు. పునర్వసు నక్షత్రం వారికి అదృష్టం పడుతుంది. దేవీ ఖడ్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందుతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): శుక్ర, బుధ, రవి గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల గృహ, వాహన సౌకర్యాలకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంట్లో శుభ కార్యం మీద బాగా ఖర్చవుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు వ్యాపారంలోకి మారే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. తలపెట్టిన ప్రతి పనిలో ధైర్యంగా ముందుకు పోగలుగుతారు. వృత్తి, ఉద్యోగాలలో సహోద్యోగుల సహకారంతో బాధ్యతలను పూర్తి చేస్తారు. పిల్లలు చదువులో పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ కార్యాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖులతో మరింతగా పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు చిన్న ప్రయత్నంతో మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్వల్ప అనారోగ్యాలు ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. పుష్యమి నక్షత్రం వారికి సమయం అనుకూలంగా ఉంది. వెంకటేశ్వర స్తోత్రం పఠించడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): గురు, రవి, బుధ గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ, శని, కుజ, శుక్ర గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగానే ఉన్నప్పటికీ, ఇతరులకు సహాయం చేయడం వల్ల ఇబ్బంది పడతారు. ముఖ్య మైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ, ఆహార విహారాల్లో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం కూడా ఉంటుంది. వ్యాపార పరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తకుండా చూసుకోవాలి. పిల్లల చదువులు, ఉద్యోగాలు నిదానంగా అభివృద్ధి చెందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పుబ్బ నక్షత్రం వారికి శుభ పరిణామాలు అనుభవానికి వస్తాయి. తరచూ శివార్చన చేయించడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఒక్క శనీశ్వరుడు తప్ప మరే గ్రహమూ అనుకూలంగా లేనందువల్ల ప్రతి వ్యవహారంలోనూ ఆచి తూచి అడుగువేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో అనుభవజ్ఞుల సలహాలు కూడా తీసుకోవల సిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. అయితే, వృథా ఖర్చుల విష యంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెర గడం వల్ల కొద్దిగా విశ్రాంతి లోపిస్తుంది. గతంలో మీ నుంచి ఆర్థిక సహాయం పొందినవారు ముఖం చాటేయడం జరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. దీర్ఘకాలిక రుణాల విషయంలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. బంధుమిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో పండుగ వాతావ రణం నెలకొంటుంది. కనకధారా స్తోత్రం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల ఈ వారం కొన్ని శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. పెండింగ్ పను లన్నీ సునాయాసంగా పూర్తవుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు ఉపశమనం పొందుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. బంధు వులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది కష్టంతో అధిక లాభాలు పొందు తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతారు. స్వాతి నక్షత్రం వారికి మరింత
బాగుంటుంది. దుర్గాస్తోత్రం పారాయణం చేయడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఈ రాశివారికి ఈ వారమంతా భాగ్య, దశమ, లాభ స్థానాలు బలంగా, శుభంగా ఉన్నందువల్ల అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో కార్యసిద్ధి, వ్యవహార జయం ఉంటాయి. ఇంటా బయటా చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపా రాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి సాధిస్తారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అను కూలంగా పరిష్కారం అవుతాయి. రియల్ ఎస్టేట్ వారు లాభాల బాట పడతారు. కుటుంబంలో శుభ కార్యం జరిగే సూచనలున్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. జ్యేష్టా నక్షత్రం వారికి చాలా బాగుంటుంది. గణపతి స్తోత్రం కలిసి వస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): రాశ్యధిపతి అయిన గురువు, శనీశ్వరుడు, రవి, బుధులు బాగా అనుకూలంగా ఉండడం వల్ల అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. దీర్ఘకాలిక సమస్యల నుంచి తెలివితేటలతో బయటపడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగ స్వామితో అన్యోన్యత పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపా రాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. అధికా రుల సహాయ సహకారాలు ఉంటాయి. ఎప్పుడో రావలసిన బాకీలు ఇప్పుడు అందుతాయి. ఇతరుల వ్యవహా రాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. పూర్వాషాఢ వారికి ఆకస్మిక ధన లాభం ఉంది. రామరక్షా స్తోత్రం పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఈ వారం మిశ్రమ ఫలితాలు తప్పకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో, తలపెట్టిన పనుల్లో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రయాణాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలం ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి పెరిగి, నిద్రాహారాలకు కూడా సమయం ఉండదు. ఉద్యోగులకు సాఫీగా సాగిపోతుంది. అధికారుల సహాయ సహకారాలుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి. వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది కానీ, ఒక పట్టాన చేతిలో డబ్బు నిలవదు. వారాంతంలో మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రాజకీయ వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. విష్ణు సహస్ర నామ స్తోత్రం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం తలెత్తే అవకాశం ఉంది. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. బంధువులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తపడాలి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో ఇతరులకు మాట ఇవ్వకపోవడం చాలా మంచిది. నిరుద్యోగులకు సానుకూల సమాచారం అందు తుంది. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. పూర్వాభాద్ర నక్షత్రం వారికి సమా జంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం వల్ల శుభ ఫలితాలుంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): శుభ గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి, వ్యాపారాలే కాకుండా ఉద్యోగాలు కూడా ఆశా జనకంగా సాగిపోతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి సాధిస్తారు. విలువైన వస్తు వులు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి శుభ కార్యాలఆహ్వానాలు అందు తాయి. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. సోదర వర్గంతో ఆస్తికి సంబంధించి రాజీ మార్గం అనుసరిస్తారు. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పిల్లల చదువు లకు సంబంధించి ఆశించిన సమాచారం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. రేవతి నక్షత్రం వారికి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆరోగ్యం అను కూలంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలుంటాయి.

Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.