Venus Transit 2024: బృహస్పతి, శుక్రుని సంచారంతో ఈ రాశుల విధి మారుతుంది.. ధన వర్షం కురుస్తుంది

|

May 18, 2024 | 2:23 PM

జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు ప్రేమ, అందం, లగ్జరీ, సృజనాత్మకత, సంపద, శ్రేయస్సు, వైవాహిక ఆనందానికి కారకంగా పరిగణించబడుతున్నాడు. శుక్ర గ్రహం  రాక్షసుల గురువుగా కూడా పరిగణించబడుతున్నాడు. మే 19 ఉదయం 08:51 గంటలకు శుక్రగ్రహం తన రాశిని మార్చుకోనున్నాడు. మేషరాశిని వీడి శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. అంతేకాదు ఈ నెలాఖరున బుధుడు కూడా వృషభరాశిలోకి ప్రవేశిస్తుండగా 12 ఏళ్ల తర్వాత గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది.

Venus Transit 2024: బృహస్పతి, శుక్రుని సంచారంతో ఈ రాశుల విధి మారుతుంది.. ధన వర్షం కురుస్తుంది
Venus Transit 2024
Follow us on

గ్రహాల కదలిక మన జీవితాలపై ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాలు కాలానుగుణంగా అన్ని రాశులలోకి సంచరిస్తూ ఉంటారు. ఈ సంచార సమయంలో ప్రజల జీవితంలో అనేక రకాల ప్రభావాలను చూపిస్తాయి.  జ్యోతిషశాస్త్రంలో శుక్రుడు ప్రేమ, అందం, లగ్జరీ, సృజనాత్మకత, సంపద, శ్రేయస్సు, వైవాహిక ఆనందానికి కారకంగా పరిగణించబడుతున్నాడు. శుక్ర గ్రహం  రాక్షసుల గురువుగా కూడా పరిగణించబడుతున్నాడు. మే 19 ఉదయం 08:51 గంటలకు శుక్రగ్రహం తన రాశిని మార్చుకోనున్నాడు. మేషరాశిని వీడి శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. అంతేకాదు ఈ నెలాఖరున బుధుడు కూడా వృషభరాశిలోకి ప్రవేశిస్తుండగా 12 ఏళ్ల తర్వాత గజలక్ష్మి రాజయోగం ఏర్పడింది.

శుక్ర సంచార ప్రభావం

ఎవరి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటాడో ఆ వ్యక్తులు ప్రేమలో విజయం సాధిస్తారు.

ఇవి కూడా చదవండి

వృషభ రాశి : వృషభరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల ఈ రాశి వారికి విశేష లాభం చేకూరుతుంది. ఈ రాశుల వారికి శుక్రుని సంచారము లాటరీ లాగా పరిగణించబడుతోంది. వృషభ రాశి వారికి సంపద అనేక రెట్లు పెరుగుతుంది. అనేక కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి రానున్నాయి. కెరీర్‌లో ఎన్నో కొత్త అవకాశాలు వస్తాయి.

కర్కాటక రాశి : ఈ రాశికి చెందిన వ్యక్తులకు శుక్ర గ్రహం విజయానికి కొత్త ఆశను తీసుకొస్తుంది. ఎందుకంటే శుక్రుడు కర్కాట రాశికి అధినేత అయినందున లాభస్థానంలో సంచరించనున్నాడు. దీని వల్ల కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొని పెద్దల అభిమానాన్ని పొందుతారు. వ్యాపారంలో కూడా గొప్ప విజయం సాధించవచ్చు.

కన్య రాశి : శుక్రుని సంచారం కన్యా రాశికి చెందిన వ్యక్తుల ప్రేమ సంబంధాలను మెరుగుపరుస్తుంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఆనందం, నమ్మకం పెరుగుతుంది. పాత అప్పులు, ఎప్పటి నుంచో రాకుండా ఇబ్బంది పెడుతున్న డబ్బు తిరిగి పొందడం ఆనందంగా ఉంటుంది. వ్యాపారం మెరుగుపడుతుంది.

తుల రాశి: తులారాశికి ఎనిమిదవ రాశిలో శుక్రుడు సంచరించడం వల్ల వైవాహిక జీవితంలో ఎదురయ్యే  వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలలో సామరస్యం, సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఆదాయం ఊహించిన దాని కంటే పెరుగుతుంది.  కుటుంబంతో సెలవులకు ఎక్కడికైనా వెళ్లే ప్రయత్నం చేస్తారు.

వృశ్చిక రాశి : ఈ రాశికి సప్తమంలో శుక్రుడు సంచరించడం వల్ల వైవాహిక జీవితంలో కొంత విషాదం నెలకొనే అవకాశం ఉంది. అక్రమ సంబంధాల సంకేతాలు ఉన్నాయి. అయితే వృత్తి, వ్యాపారాలలో చాలా అద్భుతమైన అవకాశాలు ఉంటాయి.

మీన రాశి: మీనరాశికి శుక్రుని సంచారం కొంత మిశ్రమ ఫలితాలను తెస్తుంది. మీన రాశికి చెందిన వ్యక్తులు తమ మాటను నియంత్రించుకోవాల్సి ఉంటుంది, లేకపోతే వివాదాలు ఏర్పడవచ్చు. ప్రేమ సంబంధాలలో విజయం పొందుతారు. పనికి సంబంధించిన రాబడి ఉంటుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు