
Telugu Astrology
వైశాఖ మాసమంటే విష్ణుమూర్తికి, కుబేరుడికి అత్యంత ప్రీతి. తమకు ఇష్టమైన రాశులకు ఏదో ఒక మేలు చేయడానికి, ఏదో ఒక విధంగా అదృష్టం కలగజేయడానికి ఈ ఇద్దరు దేవతలు ప్రయత్నిస్తారని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. వైశాఖ మాసమంతా విష్ణు సహస్ర నామ స్తోత్రం పఠించడం వల్ల విష్ణుమూర్తే కాక కుబేరుడు కూడా ఎంతగానో సంతృప్తి చెంది, తమకు ఇష్టమైన రాశులకు వరాలు అనుగ్రహిస్తారని కూడా చెబుతారు. ఏప్రిల్ 28 నుంచి మే 27 వరకూ కొనసాగే వైశాఖ మాసంలో ఈ ఇద్దరు దేవతలు తమకు ఇష్టమైన మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీన రాశులకు ధన రాశులు అందించే అవకాశం ఉంది.
- మేషం: ఈ రాశికి ఈ మాసమంతా గురువు, రాశ్యధిపతి కుజుడు బాగా అనుకూలంగా ఉన్నాయంటే అందుకు కారణం విష్ణువు అనుగ్రహమేనని భావించాలి. ఈ రాశివారు నిత్యం విష్ణు సహస్ర నామ స్తోత్రం పఠించడం వల్ల తప్పకుండా ఈ సంపద దేవతల అనుగ్రహం పొందుతారు. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనేక కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. సగటు వ్యక్తి సైతం సంపన్నుడయ్యే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశి అన్నా, రాశ్యధిపతి చంద్రుడన్నా విష్ణువుకు, కుబేరుడికి ఎంతో ఇష్టం. ఈ రాశికి ప్రస్తుతం కుజ, శుక్రులు అనుకూలంగా ఉండడాన్ని బట్టి ఈ రాశిని ఈ దేవతలు అనుగ్రహించినట్టే భావించ వచ్చు. కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారికి వీరి అనుగ్రహం లభిస్తుంది. వీరిని విష్ణు సహస్ర నామ స్తోత్రం తప్పకుండా అనేక కష్టనష్టాల నుంచి గట్టెక్కించడంతో పాటు సంపన్నుడిగా మార్చే అవ కాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది.
- సింహం: ఈ రాశికి ఈ మాసమంతా విష్ణువు అనుగ్రహం కలగబోతోంది. రాశ్యధిపతి రవి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల కొద్దిపాటి విష్ణు ప్రార్థనతో కుబేర యోగం పట్టే అవకాశం ఉంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒకటి రెండుసార్లు తప్పకుండా లక్ష్మీయోగాలు పట్టే సూచనలున్నాయి. రావలసిన సొమ్మంతా చేతికి అందడంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావా దేవీల వల్ల అంచనాలకు మించిన ధన లాభం కలుగుతుంది. ఆరోగ్య భాగ్యానికి కూడా అవకాశం ఉంది.
- వృశ్చికం: విష్ణుమూర్తి, కుబేరుల అనుగ్రహం వల్ల ఈ రాశివారికి అనేక మార్గాల్లో సంపద పెరిగే అవకాశం ఉంది. రోజూ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణ వల్ల అతి తక్కువ ప్రయత్నంతో అత్యధిక ధన లాభాలు పొందే అవకాశం ఉంది. రాశ్యధిపతి కుజుడి భాగ్య స్థాన సంచారం వల్ల ఆస్తి లాభం, అనేక విధాలైన అదృష్టాలు, సిరిసంపదలు సంప్రాప్తించే అవకాశం ఉంది. ఆర్థికంగా గట్టి పునాదులు ఏర్ప డతాయి. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది.
- ధనుస్సు: దేవతల గురువైన బృహస్పతి ఈ రాశికి అధిపతి అయినందువల్ల ఈ రాశివారికి విష్ణు సహస్ర నామ స్తోత్రం పఠనం అనేక రెట్లు ఎక్కువగా అదృష్టాలు కలిగిస్తుంది. ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం చేపట్టినా అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. గురు గ్రహం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆదాయం బాగా పెరగడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. ఆస్తి లాభం, గృహ లాభం కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి.
- మీనం: ఈ రాశి అధిపతి కూడా దేవతల గురువైన బృహస్పతి అయినందువల్ల విష్ణువు, కుబేరులు కొద్ది పాటి విష్ణు ప్రార్థనతో సంతృప్తి చెంది, సిరిసంపదలను అనుగ్రహించే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది. సగటు వ్యక్తి కూడా సంపన్నుడయ్యే అవకాశం ఉంది.