
దిన ఫలాలు (నవంబర్ 3, 2026): మేష రాశి వారి వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. వృషభ రాశికి చెందిన ఉద్యోగుల ప్రతిభా పాటవాలకు అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. కొన్ని సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారుల్లో సరికొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. చేపట్టిన పనులు, ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. బంధుమిత్రులతో ఒకటి రెండు సమస్యల్ని పరిష్కరించుకుంటారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
ఉద్యోగుల ప్రతిభా పాటవాలకు అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో శుభ ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు. దైవ కార్యాలకు హాజరవుతారు. ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. వస్తు వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యవహారాలను వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలు, సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగంలో అధికారులు మీకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. కొన్ని సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా పురోగతి చెందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకోకుండా ఒక శుభ వార్త వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలమవుతుంది. కుటుంబ జీవితం సుఖసంతోషాలతో సాగిపోతుంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు.
ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆర్థి కంగా చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి వివాదంలో రాజీమార్గం అనుసరిస్తారు. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం, ఆరోగ్యం మెరుగ్గా ఉంటాయి.
ఉద్యోగంలో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు యథావిధిగా సాగుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది. పెండింగ్ పనులన్నిటినీ కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఇంతవరకూ వసూలు కాని బాకీలు ఇప్పుడు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది.
ఉద్యోగంలో కొద్దిపాటి మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. అధికారుల నుంచి వేధింపులు ఉండే అవ కాశం కూడా ఉంది. సహోద్యోగుల సహాయంతో లక్ష్యాల్ని పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. మిత్రుల వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది.
వృత్తి, ఉద్యోగాలు చాలావరకు అనుకూలంగా సాగిపోతాయి. కొద్దిగా పని ఒత్తిడి ఉన్నా అధికారుల ఆదరణ ఉంటుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా చక్కబడతాయి. వ్యాపారాలులాభాల బాటపడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవు తాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కుటుంబ జీవితం బాగా సరదాగా సాగిపోతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. అనుకోకుండా కొన్ని శుభవార్తలు వింటారు. ధన యోగం పట్టే అవకాశం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు బాగా లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది.
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. పట్టుదలగా కొన్ని వ్యవహారాలు చక్కబెడతారు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. వస్తు వాహన లాభాలు పొందుతారు.
ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదని పిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. పిల్లలకు సంబంధించిన విద్య, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబంలో ఒకటి రెండు చిన్నపాటి సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. ఆర్థికంగా ఆచితూచి వ్యవహరించడం మంచిది.
ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా నెరవేరుస్తారు. వృత్తి, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం బాగా కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలామంచిది. నిరుద్యోగులకు ఒకటి రెండు శుభవార్తలు అందే అవకాశం ఉంది.
వ్యయ ప్రయాసలున్నప్పటికీ ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తి చేస్తారు. పిల్లల చదువులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడతారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం అవసరం. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.