Zodiac Signs: సాధారణంగా మనం ఏ పని చేసినా దానికి విమర్శలు వస్తూనే ఉంటాయి. ఒకరితో ఒకరు కలిసి ఉన్నపుడు.. అందరి అభిప్రాయాలు ఒకేలా ఉండే అవకాశం ఉండదు. అటువంటి సందర్భంలో అందరికీ మనం చేసే పని నచ్చాలనే రూలూ లేదు. అందుకే తరుచు మనం చేసే పనుల్లో విమర్శలు కచ్చితంగా ఎదురవుతూ ఉంటాయి. ఆ విమర్శలలో మంచివిమర్శ ఉంటె దానిని తీసుకుని మన ప్రవర్తన మార్చుకోవడం ఆచరించాల్సిన పధ్ధతి. ఒకవేళ కువిమర్శలు వస్తే వాటిని అలానే వదిలి వేసేయాలి. కానీ, కొందరు అసలు విమర్శ అంటేనే తట్టుకోలేరు. తమను ఎవరైనా విమర్శిస్తే విపరీతంగా బాధపడిపోతారు. ఆ విమర్శ మంచిదా.. చెడ్డదా అనేది వారు ఆలోచించారు. తమను విమర్శించారు అనేదే వారు జీర్ణించుకోలేరు. వీరికి ఆత్మవిత్వాశం తక్కువగా ఉంటుంది. విమర్శలు విన్నవెంటనే తాము వెనుకబడిపోయినట్టు బాధపడిపోతారు. ఈ రకమైన ప్రవర్తనకి వారి రాశి చక్రాలే కారణమని చెబుతుంది జ్యోతిష శాస్త్రం. కొన్ని రాశుల వారిలో ఈ లక్షణం అధికంగా ఉంటుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతారు. ఆ రాశులేమిటి అనేది తెలుసుకుందాం.
సింహరాశి:
సింహ రాశి వారు ప్రతి విషయంలోనూ తామే అత్యుత్తమమని భావిస్తారు. వారు ఎప్పుడూ తప్పు చేయడం జరగదని విశ్వాసంలో ఉంటారు. వారికీ విమర్శలు ఎదుర్కోవడం తెలీదు. విమర్శను వింటే వారికి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. విమర్శలను వ్యక్తిగతంగా.. పరువుకు సంబంధించిన విషయంలా తీసుకుంటారు. విమర్శ నుంచి తీసుకోవడానికి అసలు ప్రయత్నించరు.
కన్య రాశి:
కన్యారాశి ప్రజలు తమను తాము పరిపూర్ణులుగా భావిస్తారు. వారు చాలా మంది వ్యక్తుల కంటే మెరుగైన నైపుణ్యాలు, సామర్థ్యాలను కలిగి ఉన్నారనిఅనుకుంటారు. అదేవిదంగా వారు అందరికంటే ఉత్తమమైనవారని వారికీ వారు భావిస్తారు. ఎవరైనా తమ పనిని విమర్శించినప్పుడు, వారు బాధపడతారు. వారి అభిప్రాయం తప్పు అని అవతలి వ్యక్తికి చెప్పడం చేస్తారు. వారితో వాదనకు దిగుతారు. నేను చేసింది సరైనదే అని అవతల వారికి స్పష్టం చేయాలని ప్రయత్నిస్తారు.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వ్యక్తులు చాలా సున్నితంగా ఉంటారు. వీరు విమర్శలను నిర్మాణాత్మకంగా తీసుకోలేరు. వారు తమ సామర్ధ్యాలను ప్రశ్నించే అలవాటును కలిగి ఉంటారు. ఆవిధంగా, వేరొకరు వారిని విమర్శించినప్పుడు లేదా వారిపై వేళ్లు చూపినప్పుడు వారు బాధపడకుండా ఉండలేరు. దానిని చాలా అవమానంగా భావిస్తారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఇది సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి: PM Modi: వారణాసి పర్యటనకు నరేంద్ర మోడీ.. 64 కోట్లతో ప్రజారోగ్యం కోసం ఆత్మనిర్భర్ స్వస్త్ భారత్‌కు శ్రీకారం చుట్టనున్న ప్రధాని!
Snow Fall: మూడు అడుగుల మేర కురిసిన మంచు..అటల్ టన్నెల్ వద్ద నిలిచిపోయిన రాకపోకలు!