Astrology: రాసిపెట్టుకోండి.. త్వరలో వారి ఆర్థిక, ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్..!

జాతకం ప్రకారం లేదా గ్రహ సంచారం ప్రకారం కొందరికి అప్రయత్న ధన లాభాలు.. మరికొందరికి ప్రయత్నపూర్వక ధనలాభాలకు అవకాశం ఉంటుంది. ప్రస్తుత గ్రహ సంచారం ప్రభావంతో మేషం, వృషభం, మిథునం, ధనుస్సు, మకరం, మీన రాశుల వారికి తృతీయ స్థానం బలపడింది. దీంతో ఆ రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, వివాహ, విదేశీ ప్రయత్నాల్లో ఆగస్టు 10లోపు విజయాలు, పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Astrology: రాసిపెట్టుకోండి.. త్వరలో వారి ఆర్థిక, ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్..!
Success Astrology

Edited By:

Updated on: Jul 18, 2026 | 5:21 PM

జాతకం ప్రకారం లేదా గ్రహ సంచారం ప్రకారం కొందరికి అప్రయత్న ధన లాభాలు కలిగితే.. మరికొందరికి ప్రయత్నపూర్వక ధనలాభాలు కలుగుతాయి. ఏ విధంగా లాభం కలుగుతుంది, ఈ విధంగా పురోగతి చెందడం జరుగుతుందన్నది తృతీయ స్థానాన్ని బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది. ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం కొద్ది ప్రయత్నంతో ఉన్నత స్థాయికి ఎదగడానికి, మనసులోని కోరికలు తీరడానికి ఆరు రాశులకు అవకాశం కలుగుతోంది. ప్రస్తుతం మేషం, వృషభం, మిథునం, ధనుస్సు, మకరం, మీన రాశులకు తృతీయ స్థానం బాగా బలంగా ఉన్నందువల్ల వీరి ఆర్థిక, ఉద్యోగ, పెళ్లి, విదేశీయాన ప్రయత్నాలు ఆగస్టు 10 లోగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి ప్రస్తుతం తృతీయ స్థానంలో సహజ శుభ గ్రహమైన బుధుడు సంచారం చేస్తు న్నందు వల్ల ఈ రాశివారు కొద్ది ప్రయత్నంతో అనేక విధాలుగా పురోగతి చెందడానికి అవకాశం ఉంది. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. త్వరలో వీరి మనసులోని ముఖ్యమైన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కూడా ఊహించని ఫలితాలు సాధిస్తారు.
  2. వృషభం: ఈ రాశికి తృతీయ స్థానంలో ధన కారకుడు గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారు ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం ప్రయత్నాలన్నీ సత్ఫలితాలనిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు విశేష లాభాలనిస్తాయి. ఆర్థిక సమస్యలు, వివాదాలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. అనారోగ్యానికి తగ్గ సరైన చికిత్స లభిస్తుంది.
  3. మిథునం: ఈ రాశికి తృతీయ స్థానంలో శుక్ర, కేతువులు సంచరిస్తున్నందువల్ల కొద్ది ప్రయత్నంతో ఉద్యో గంలో ఉన్నత పదవులు లభించడానికి అవకాశం ఉంది. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా నెల రోజులలోగా నూరు శాతం శుభ ఫలితాలనిస్తుంది. వృత్తి, వ్యాపారాలు కూడా కొత్త పుంతలు తొక్కు తాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల తప్పకుండా ఫలిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారం అవుతుంది. సొంత ఇంటి కల కూడా నెరవేరుతుంది.
  4. ధనుస్సు: ఈ రాశివారికి ప్రస్తుతం తృతీయ స్థానంలో రాహువు సంచారం చేయడం అత్యంత శుభప్రదం. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా నూరు శాతం విజయం సిద్ధించే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. తప్పకుండా ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో నెగ్గే అవకాశం కూడా ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ప్రయాణాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో రాశ్యధిపతి శనీశ్వరుడి సంచారం వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందడంతో పాటు, స్వల్ప ప్రయత్నంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. సాధారణంగా ఈ రాశివారు ప్రయత్నం చేస్తే తప్ప ఏ పనీ సక్సెస్ కాదు. సంపన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. విదేశీయానానికి మార్గం సుగమమవుతుంది. గృహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి కలుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది.
  7. మీనం: ఈ రాశికి తృతీయ స్థానంలో కుజ సంచారం వల్ల ఉద్యోగ ప్రయత్నాల్లో ఘన విజయాలు కలుగు తాయి. ఆదాయంలో బాగా అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. విదేశీయా నానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలకు, విదేశాల్లో స్థిరపడడానికి సంబంధించిన ఎటు వంటి ప్రయత్నం అయినా తప్పకుండా నెరవేరుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారమై లాభం కలుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
Follow Us