
మార్చి 29న సూర్య గ్రహణం ఏర్పడనుంది. అంతే కాకుండా ఆరోజే ఉగాది పండుగ కూడా. అయితే ఈరోజు శని గ్రహం తన రాశిని మార్చుకోనుంది. దీంతో దీని ప్రభావం రెండు రాశులపై నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అంటున్నారు పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

మేష రాశి వారు కూడా సూర్యగ్రహణం సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంట. మార్చి 29 ఏర్పడే ఈ సూర్యగ్రహణం ఈ రాశిలో చాలాదృష్ప్రభావాలను తీసుకొస్తుందంట. ఆరోగ్యం విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

శని మీన రాశిలోకి ప్రవేశించడం, సూర్య గ్రహణం ఈ రెండింటి వలన మేష రాశి వారిలో అనేక సమస్యలు ఎదురు అవుతాయంట. వీరు ఏ పని చేసినా అందులోవిజయం సాధించలేరంట. అంతే కాకుండా అప్పులు ఎక్కువ అవ్వడం, కుంటుంబంలో సమస్యలు ఇలా చాలా ఇబ్బందులు ఎదర్కోవాల్సి ఉంటుదని చెబుతున్నారు పండితులు.

కుంభరాశి వారిపై సూర్యగ్రహణం ప్రభావం చాలా పడనున్నదంట. ఈ సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు పండితులు. ఎందుకంటే? శని దేవుడు దాదాపు 30 సంవత్సరాల తర్వాత మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

ఇది కుంభరాశి వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అంతే కాకుండా సూర్య గ్రహణం కూడా దీనిపై చెడు ప్రభావం చూపిస్తుంది. అందువలన వీరు ఉద్యోగం చేసే వారు తమ కార్యాలయాల్లో చాలా జాగ్రత్తగా మెలగాలి. అంతే కాకుండా, ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంట.