Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

| Edited By: Janardhan Veluru

Mar 15, 2025 | 5:01 AM

మార్చి 15, 2025 నాటి తెలుగు రాశిఫలాల ప్రకారం మేష రాశివారికి ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృషభ రాశివారికి ఆదాయం పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. మిథున రాశివారు ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి రాబడిని పొందుతారు. మిగిలిన రాశుల వారికి కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సంపూర్ణ వివరాలకు ఈ కథనాలు చదవండి.

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 15th March 2025
Follow us on

దిన ఫలాలు (మార్చి 15, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభిస్తుంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటుండదు. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితం చాలావరకు ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభ సాటిగా సాగుతాయి. ఆదాయం బాగానే పెరిగే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభిస్తుంది. తలపెట్టిన పనులు, వ్యవహారాలన్నీ కొద్ది వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సకాలంలో నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ పని తీరుతో సంతృప్తి చెందుతారు. వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలు గడిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి లోటుండదు. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ జీవితం సాఫీగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలను అనుసరిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో మాట ఇవ్వడం మంచిది కాదు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల సహకారంతో కొన్ని బాధ్యతలను, లక్ష్యాలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా నెరవేరుతుంది. ముఖ్యంగా గృహ, వాహన ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. నిరుద్యోగులకు చిన్న ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఈ రాశివారికి ఈ వారం చాలావరకు మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగిపోతుంది. ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. వ్యాపారపరంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. కొందరు సన్నిహితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా, సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతో అధిక లాభాలు పొందుతారు. ఆదాయం సానుకూలంగా, సంతృప్తికరంగా ఉంటుంది. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. పోటీదార్లు, ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువ రాబడి ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ద పెరుగుతుంది. ఆర్థికంగా అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సవ్యంగా పూర్తవుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపా రాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. రావలసిన సొమ్ము, బాకీలు, బకాయిలు వసూలవుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆరోగ్యం విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారుల సహాయ సహకారాలుంటాయి. వృత్తి, వ్యాపా రాల్లో శ్రమకు తగ్గ ఫలం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత అప్రమత్తంగా ఉండడం మంచిది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలకు అవకాశముంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ధన పరంగా ఇతరులకు మాట ఇవ్వకపోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్త అందుతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా, ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పిల్లలు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.