Surya Gochar 2024: మకర సంక్రాంతిన రాశిని మార్చుకోనున్న సూర్యుడు.. ఈ రెండు రాశులకు లక్కే లక్కు..

|

Dec 31, 2023 | 12:49 PM

కొత్త ఏడాదిలో కొన్ని గ్రహాల గమనంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా గ్రహాలకు అధినేత సూర్యుడు కొత్త సంవత్సరం 2024 జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి రోజున మధ్యాహ్నం 2.32 గంటలకు మకర రాశిలో ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు విజయానికి, గౌరవానికి కారకుడిగా భావిస్తారు. మకరరాశిలో సూర్యుడి సంచారంతో కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది. సూర్యుడు వెలుగులు నింపే ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..   

Surya Gochar 2024: మకర సంక్రాంతిన రాశిని మార్చుకోనున్న సూర్యుడు.. ఈ రెండు రాశులకు లక్కే లక్కు..
Surya Gochar 2024
Follow us on

మానవ జీవితంపై గ్రహాల ప్రభావం ఉండనుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. నవ గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను మార్చుకుంటూ గమనాన్ని మార్చుకుంటాయి. నవ గ్రహాల అధినేత సూర్యుడు నెలకు ఒక సారి తన రాశులను మార్చుకుంటాడు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో కొన్ని గ్రహాల గమనంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా గ్రహాలకు అధినేత సూర్యుడు కొత్త సంవత్సరం 2024 జనవరి 15వ తేదీ మకర సంక్రాంతి రోజున మధ్యాహ్నం 2.32 గంటలకు మకర రాశిలో ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు విజయానికి, గౌరవానికి కారకుడిగా భావిస్తారు. మకరరాశిలో సూర్యుడి సంచారంతో కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది. సూర్యుడు వెలుగులు నింపే ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశికి చెందిన వారికి సూర్యుడి గమనం శుభాలను తెస్తుంది. ముఖ్యంగా జనవరి 15 వ తేదీ తర్వాత ఈ రాశి వారి సంపద పెరుగుతుంది. కెరీర్ లో ఉన్నత స్థితి ఉంటుంది. ముఖ్యంగా స్టూడెంట్స్ కు శుభాలను తెస్తుంది విదేశీ యానం చేసే అవకాశం ఉంది. గవర్నమెంట్ జాబ్స్ కోసం రెడీ అవుతున్న వారు సక్సెస్ అందుకుంటారు. అదృష్టం కలిసి వస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.

చేయాల్సిన నివారణ చర్యలు

మేష రాశి వారు సూర్యుడి అనుగ్రహం కోసం ప్రతి రోజూ 19 సార్లు ‘ఓం సూర్యాయ నమః’ అని మంత్రాన్ని పఠించండి. దీంతో ఆరోగ్యంగా ఆర్ధికంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

వృషభ రాశి: ఈ రాశికి చెందిన వారికి సూర్యుడి సంచారం లాభాలను అందిస్తుంది. అంతేకాదు పెట్టిన పెట్టుబడులు ఆదాయాన్ని ఇస్తాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. బిజినెస్ కలిసి వస్తుంది. లాభాలను పొందుతారు. కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. చిన్న చిన్న వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.  ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నవారి ప్రయత్నాలు లాభించే అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టిన వారు లాభాలను అందుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఎప్పటి నుంచో రాని రుణాలు వసూలు అయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయి.

చేయాల్సిన నివారణ చర్యలు

ఆరోగ్యం కోసం ఈ రాశికి చెందిన వారు రోజూ సూర్యోదయ, సూర్యాస్తమయ సమయంలో కనుక సూర్యుడి అనుగ్రహం కోసం అర్ఘ్యం ఇవ్వండి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు