
అధికారానికి, అధికారులకు, ప్రభుత్వానికి, రాజకీయాలకు, పురోగతికి, తండ్రికి కారకుడైన గ్రహ రాజు రవి ఈ నెల(జూన్) 16 నుంచి జూలై 16 వరకు సందేశాలు, కమ్యూనికేషన్, ప్రయత్నాలు, ప్రయాణాలకు సంబంధించిన మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. దీనివల్ల కొన్ని రాశుల వారు ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం లభిస్తుంది. అధికార యోగానికి, ఉన్నత పదవులకు, ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం ఉంది. ఈ నెల రోజుల కాలంలో మేషం, వృషభం, సింహం, కన్య, తుల, ధనూ రాశుల వారు ఆర్థికంగా, కెరీర్ పరంగా, కుటుంబపరంగా శుభ యోగాలను అనుభవించే అవకాశం ఉంది.
ఈ రాశికి పంచమాధిపతిగా అత్యంత శుభుడైన రవి తృతీయ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో తమకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రభుత్వపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది.
ఈ రాశికి చతుర్ధాధిపతిగా అత్యంత శుభుడైన రవి ధన స్థానంలో ప్రవేశించడం వల్ల వారసత్వపు ఆస్తి సంక్రమిస్తుంది. పిత్రార్జితం లభించే అవకాశం కూడా ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలు వైన ఆస్తి లభిస్తుంది. సొంత ఇంటి కల నెరవేరే అవకాశం ఉంది. వాహన యోగం కూడా పడుతుంది. కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. కుటుంబ సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది.
రాశ్యధిపతి రవి లాభ స్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవు తుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విశేషంగా లాభిస్తాయి. తండ్రి వైపు నుంచి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో భారీ జీత భత్యాలతో కూడిన పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను దాటుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు.
ఈ రాశికి దశమ స్థానంలో రవి ప్రవేశం వల్ల ఈ రాశివారికి దిగ్బల రాజయోగం కలిగింది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి, ఆర్థిక సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి.
ఈ రాశికి లాభాధిపతి అయిన రవి భాగ్యస్థానంలోకి రావడం వల్ల అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
ఈ రాశికి భాగ్యాధిపతిగా అత్యంత శుభుడైన రవి సప్తమ స్థానంలో ప్రవేశించడం వల్ల ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో పాటు పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడానికి లేదా పెళ్లి జరగడానికి అవకాశం ఉంది. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.