ఉగాది రాశిఫలాలు.. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉండబోతోందంటే.?

| Edited By: Ravi Kiran

Apr 08, 2024 | 8:33 PM

దశమ స్థానంలో దశమాధిసపతి శనీశ్వరుడు, లాభస్థానంలో రాహువు, వృషభ రాశిలో గురువు సంచారం చేస్తున్నందువల్ల అనేక విధాలుగా శుభ యోగాలు అనుభవానికి వస్తాయి. ఈ రాశిలో ఏప్రిల్ 30 తర్వాత నుంచి గురువు సంచారం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. వ్యాపారాలు వృద్ధి చెందడం, విస్తరించడం జరుగుతుంది.

ఉగాది రాశిఫలాలు.. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఏ రాశివారికి ఎలా ఉండబోతోందంటే.?
Horoscope Today
Follow us on

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3

ఈ రాశికి లాభస్థానంలో లాభాధిపతి శని, వ్యయంలో రాహువు, ఏప్రిల్ 30 నుంచి ధన స్థానంలో గురువు సంచారం బాగా అనుకూలంగా ఉంది. కొన్ని శుభ యోగాలు అనుభవానికి వస్తాయి. ముఖ్యంగా ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అంచనాలకు మించి అభివృద్ధి చెందుతాయి. ఈ సంవత్సరమంతా ఈ రాశివారికి గురు, శనులు బలంగా ఉన్నందువల్ల అన్ని రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరించే అవకాశముంది. ఆర్థికంగా బాగా నిలదొక్కుకుంటారు. రుణ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యయ స్థానంలోని రాహువు కారణంగా కొందరితో అకారణ కలహాలకు అవకాశముంటుంది. కుటుంబంలో మధ్య మధ్య అపార్థాలు తలెత్తవచ్చు. కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకావం కూడా ఉంది. ఏప్రిల్ 30 తర్వాత ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఎటువంటి ఆలోచనలు చేసినా అవి తప్పకుండా ఫలిస్తాయి. భవిష్యత్తుకు ఉపయోగపడే మంచి పరిచయాలు ఏర్పడ తాయి. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3

దశమ స్థానంలో దశమాధిసపతి శనీశ్వరుడు, లాభస్థానంలో రాహువు, వృషభ రాశిలో గురువు సంచారం చేస్తున్నందువల్ల అనేక విధాలుగా శుభ యోగాలు అనుభవానికి వస్తాయి. ఈ రాశిలో ఏప్రిల్ 30 తర్వాత నుంచి గురువు సంచారం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది. వ్యాపారాలు వృద్ధి చెందడం, విస్తరించడం జరుగుతుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు విశేషంగా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ప్రాభవం పెరుగుతుంది. సంతాన యోగం ఉంటుంది. సంతానానికి వివాహ యోగం, ఉద్యోగ యోగం పడతాయి. ఈ రాశివారికి ఈ ఏడాదంతా వృత్తి స్థానంలో శని సంచారం వల్ల బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. అనుకోని విధంగా సంపద పెరుగుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొన్ని కష్టనష్టాలు, అధిక వ్యయం కూడా తప్పక పోవచ్చు. కుటుంబ వ్యవహారాలు, సమస్యల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. విద్యార్థులు శ్రమ మీద విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు పెరుగుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6

ఈ నెల 30 తర్వాత గురువు లాభస్థానం నుంచి వ్యయస్థానానికి మారడం జరుగుతుంది. శని, రాహు గ్రహాలు కూడా పూర్తి స్థాయిలో అనుకూలంగా లేనందువల్ల ఈ రాశివారికి సంవత్సర మంతా శుభాశుభ మిశ్రమంగానే ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా, లాభదాయకంగా సాగిపోతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు సమ స్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యో గాల రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఒకటి రెండు ముఖ్యమైన శుభ వార్తలు వింటారు. కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు కొద్దిగా ఆందోళన కలిగిస్తాయి. ఆదాయానికి లోటుండదు. రావల సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యో గులు శుభవార్తలు వినే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఆశాభంగం కలిగిస్తాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు ఫలి స్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6

ఈ రాశివారికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ, లాభ స్థానంలోకి మగురువు ప్రవేశిస్తున్నందు వల్ల సంవత్సరమంతా హ్యాపీగా, సాఫీగా సాగిపోయే అవకాశముంది. అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొద్ది కాలంలో తప్పకుండా ఆర్థికంగా అదృష్టం పట్టడానికి అవకాశం ఉంది.
గురు, రాహువులు బాగా బలంగా ఉన్నందువల్ల ఆరోగ్య వృద్ధి, ధన లాభం, కార్యసిద్ధి వంటివి తప్పకుండా చోటు చేసుకుంటాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది కానీ, ఒక పట్టాన సంతృప్తి చెందకపోవచ్చు. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. కోర్టు వ్యవహారాలు, ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ఉద్యోగ సంబంధమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ప్రముఖు లతో లాభదాయక పరిచయాలు విస్తరిస్తాయి. దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2

సప్తమ శని, అష్టమ రాహువు, ఏప్రిల్ 30 నుంచి దశమ గురువు వల్ల సంవత్సరమంతా శుభా శుభ మిశ్రమంగా గడిచిపోతుంది. ఇతర గ్రహాల అనుకూలతల వల్ల అప్పుడప్పుడూ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. అవసరానికి డబ్బు అందకపోవడం జరుగుతుంది. ధన సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఒక్కోసారి రుణ దాతల ఒత్తిళ్లు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఇతర గ్రహాల కారణంగా ఆదాయం పెరగడం కూడా జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులకు సన్నిహితం అవుతారు. వృత్తి, వ్యాపారాల్లో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. దైవ కార్యాల్లో లేదా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రేమ వ్యవహారాలు పరవాలేదనిపిస్తాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం, 5అవమానం 2

షష్ట స్థానంలో శనీశ్వరుడు, ఏప్రిల్ 30 నుంచి భాగ్య స్థానంలో గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు, ప్రయాణాలు బాగా సాను కూలపడతాయి. మానసికంగా, శారీరకంగా మరింత మెరుగైన స్థితి ఉంటుంది. ఆర్థిక కష్టనష్టాల నుంచి పూర్తిగా బయటపడతారు. జీవిత భాగస్వామికి కూడా అదృష్ట యోగం పడుతుంది. సంకల్ప సిద్ధి, వ్యవహార జయం కలుగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు బాగా రాణిస్తాయి. ఉద్యోగులకు డిమాండు పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సామాజికంగా మంచి గుర్తింపు లభి స్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. విద్యా ర్థులు కొద్ది శ్రమతో పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపో తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5

గురువు, శని గ్రహాల సంచారం ఏమంత అనుకూలంగా లేదు. రాహువు మాత్రం ఆరవ స్థానంలో అనుకూలంగా ఉండడం వల్ల సంవత్సరమంతా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. హోదా పెరగడం, పదోన్నతి లభించడం వంటివి జరగ వచ్చు. ఆదాయం పెరిగినప్పటికీ ఎక్కువ భాగం వృథా అయ్యే అవకాశముంటుంది. వృత్తి, వ్యాపా రాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి బాగా లబ్ధి పొందుతారు. వృత్తి జీవితం బాగా బిజీగా, లాభ సాటిగా సాగిపోతుంది. ఉద్యోగంలో మంచి ప్రోత్సాహం ఉంటుంది. అనుకున్న పనులు అనుకు న్నట్టు పూర్తవుతాయి. ఇష్టమైన ప్రాంతానికి బదిలీ అయ్యే సూచనలున్నాయి. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలోనూ, దాంపత్య జీవితంలోనూ సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహా రాలు సాఫీగా సాగిపోతాయి. విలాస జీవితం అలవాటవుతుంది. మిత్రుల వల్ల నష్ట పోయే అవకాశముంది. ఆస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి. తల్లితండ్రుల నుంచి సంపద కలిసి వస్తుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5

నాలుగవ స్థానంలో శనీశ్వరుడు (అర్ధాష్టమ శని), పంచమంలో రాహువు ఏమంత అనుకూలంగా లేవు. అయితే, ఏప్రిల్ 30 తర్వాత గురువు సప్తమంలోకి మారుతున్నందువల్ల మీ గ్రహాల చెడు ఫలితాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగంలోనూ, ఆర్థికంగానూ స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థికంగా అన్ని విధాలుగానూ కలసి వస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సంవత్సరమంతా ఆశాజనకంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. అనవసర పరిచయాల కారణంగా ఇబ్బందులు పడతారు. గృహ నిర్మాణాలు చేపడతారు. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతా వరణం ఉంటుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. పిల్లలు చదువుల్లో విజ యాలు సాధిస్తారు. విద్యార్థులకు బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయం 11, వ్యయం5, రాజపూజ్యం 7, అవమానం 5

మూడవ స్థానంలో శని ఒక్కడే అనుకూలంగా ఉన్నాడు. నాలుగింట రాహువు, ఏప్రిల్ 30 తర్వాత ఆరవ స్థానంలో గురువు మిశ్రమ ఫలితాలను మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు బాగానే సాగిపోతాయి. అందలాలు ఎక్కే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. అయితే, తరచూ డబ్బు నష్టపోవడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు తలకిందుల వుతాయి. శని కారణంగా అనేక రంగాలలో పురోగతికి అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఆలోచనలు ఫలిస్తాయి. వృత్తి జీవితానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరుగు తుంది. ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ తగిన ప్రతిఫలం ఉంటుంది. చేపట్టిన పనులు, ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు పరి ష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపో తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతాలలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇష్టమైన వారితో పెళ్లి నిశ్చయం అయ్యే సూచనలున్నాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1

గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది. ధన స్థానాధిపతి శనీశ్వరుడు ధన స్థానంలోనే ఉండడం, రాహువు తృతీయంలో, ఈ నెలాఖరు నుంచి గురువు పంచమంలో సంచారం చేయడం బాగా అనుకూల ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. ఏ ప్రయత్నమైనా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టి ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగా నిలదొక్కుకుంటారు. ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. బంధువులతో సంబంధాలు బలపడతాయి. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఏ రంగానికి చెందినవారై నప్పటికి కొన్ని అనుకూల పరిస్థితులుంటాయి. చాలా కాలంగా పెండింగు పనులను స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. కొద్దిగా ఆరోగ్య సమస్యలుం టాయి. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1

ఏలిన్నాటి శని ప్రభావం కొంత, దన స్థానంలో రాహువు సంచారం మరికొంత ఇబ్బందులకు గురి చేసే అవకాశముంది. ఈ నెలాఖరు నుంచి నాలుగవ స్థానంలో గురువు సంచారం కూడా ఏమంత అనుకూలంగా లేదు. ఆదాయం బాగున్నప్పటికీ ఊహించని ఖర్చులతో ఇబ్బంది పడతారు. బంధుమిత్రుల వల్ల కూడా ఆర్థిక నష్టం కలగడానికి అవకాశముంది. చేతిలో ఒక పట్టాన ధనం నిలవకపోవచ్చు. ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి అడుగువేయాలి. కుటుంబంలో కొన్ని చిక్కులు తలెత్తే అవకాశం కూడా ఉంది. సోదరులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. గృహ, వాహనాల కొనుగోలు కోసం చేసే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుల్లో బాగా కష్టపడాల్సి ఉంటుంది. కొద్ది కాలం పాటు డబ్బు ఇవ్వడం కానీ, డబ్బు తీసుకోవడం గానీ చేయకపోవడం మంచిది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం శ్రేయస్కరం. నిరుద్యోగులు చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు ఉద్యోగం మారడానికి అవకాశముంది. ఎక్కువగా దైవ కార్యాల్లో పాల్గొం టారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4

ఏలిన్నాటి శని ప్రభావంతో పాటు ఈ రాశిలో రాహువు సంచారం ఫలం కూడా బాగా ప్రతికూలంగా ఉంటుంది. ఇంతకాలం మేష రాశిలో ఉండి ఈ రాశికి అండగా ఉన్న గురువు కూడా వృషభ రాశి లోకి మారుతుండడంతో ఈ రాశివారికి శుభ ఫలితాలు బాగా తగ్గే అవకాశం ఉంది. అయితే, ఈ రాశివారికి ఆదాయానికి లోటుండదు. ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు దిగ్విజయంగా పూర్తవుతాయి. గృహ, వాహన సౌకర్యాల మీద మాత్రం ఖర్చు తప్పకపోవచ్చు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఎక్కువ సంఖ్యలో అందివస్తాయి. స్నేహితుల ద్వారా అప్పుడప్పుడూ దన నష్టానికి అవకాశముంది. అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. బంధుమిత్రులతో మనస్పర్థలు తలెత్తే సూచన లున్నాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలను, ఇతర ఆర్థిక సమస్యలను అధిగమించి లాభాల బాట పడతాయి. ఉద్యోగ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కొన్ని శుభవార్తలు వింటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.