హిందూ మతంలో లయకారుడైన మహాదేవుడి పూజలకు ప్రత్యేక స్థానం ఉంది. భక్తి శ్రద్దలతో శంభోశంకర అంటూ జలంతో పూజించినా చాలు.. కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడు. పూజలతో సంతోషించే దేవదేవుడు. శివయ్యను ప్రతి రోజూ ఆరాధించవచ్చు.. అయితే శివయ్యకు అంకితం చేయబడిన సోమవారం అత్యంత ఫలవంతం అయితే.. శ్రావణ కార్తీక మాసాల్లోని సోమవారం మరింత విశిష్టమని హిందువుల నమ్మకం శ్రావణ మాసంలోని సోమవారం ఆయనను పూజిస్తే ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారు. ఈరోజు శ్రావణ సోమవారం. ఈ రోజు ఉపవాసం ఉండటం, మహాదేవుని పూజించడం చాలా ఫలవంతంగా పరిగణించబడుతుంది. సోమవారాలలో శివుడిని పూజిస్తే, మహాదేవుడు సంతోషిస్తాడు. తన భక్తులపై ఆశీర్వాదాలను కురిపిస్తాడు. అంతేకాదు శివుని అనుగ్రహంతో, భక్తుల అన్ని పనులు కూడా పూర్తవుతాయి.
ఎవరైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ.. కష్టాలను ఎదుర్కోనే శక్తి లేకుంటే.. వారు సోమవారం నాడు శివుడిని పూజించాలి. సనాతన సంప్రదాయం ప్రకారం సోమవారం నాడు శివలింగాన్ని భక్తి , విశ్వాసంతో పూజిస్తే. మహాదేవుడు ఆ భక్తుని కోరికలన్నింటినీ తీర్చి జీవితానికి సంబంధించిన అన్ని కష్టాలను తొలగిస్తాడని నమ్ముతారు. అంతేకాదు సుఖ సంపదలకు ధన ధాన్యాలకు లోటు ఉండదని విశ్వాసం.
ఈ రోజు శుభ యోగం ఏర్పడుతోంది. ఈ రోజున రవియోగం, శూలయోగం ఏర్పడుతున్నాయి. రవియోగంలో శుభ కార్యాలు, పూజలు మొదలైనవి చేయడం వల్ల గౌరవం పెరిగి సంపద కూడా పెరుగుతుంది. రవి యోగం ఉదయం 05:46 నుండి మరుసటి రోజు (అంటే మంగళవారం) తెల్లవారుజామున .. 01:16 వరకు ఉంటుంది. అయితే శూల యోగా ఆగస్టు 06, 2023న రాత్రి 08:27 నుండి ఆగస్టు 07, సాయంత్రం 06:17 వరకు ఉంటుంది. రవి , శూల యోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)