Zodiac Signs
ఈ నెల 30 తర్వాత నుంచి మీన రాశిలో, ఉచ్ఛ స్థితిలో సంచారం చేయబోతున్న శుక్రుడికి ఇదే రాశిలో ఉన్న రాహువుతో యుతి ఏర్పడుతోంది. శుక్రుడికి రాహువు శిష్యుడని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో శుక్రుడితో రాహువు కలవడం వల్ల ఈ గ్రహం తాలూకు పాపత్వం తొలగిపోయి, ఎక్కువగా శుభ ఫలితానివ్వడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాల యుతి ఏప్రిల్ 23 వరకూ కొనసాగుతుంది. ఈ 24 రోజుల కాలంలో వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, కుంభ రాశుల వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. శుక్ర, రాహువుల కలయిక సాధారణంగా కనకవర్షం కురిపిస్తుంది. మనసులోని కొన్ని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి.
- వృషభం: ఈ రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో రాహువుతో యుతి చెందుతున్నందువల్ల వృత్తి, ఉద్యో గాల్లో జీతభత్యాలు పెరగడం, వ్యాపారంలో లాభాలు వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. అయితే, ఏదో విధంగా రాబడి సంపాదించడం వంటివి కూడా జరుగుతుంది. విలాస జీవితం అల వాటవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగానికి, అంచనాలకు మించిన పురోగతికి అవకాశముంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. సంపద క్రమంగా వృద్ధి చెందుతుంది.
- మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో, అంటే కెరీర్ స్థానంలో శుక్ర, రాహువుల కలయిక రాజయోగాన్ని కలుగజేస్తుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతికి అవకాశముంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అంచనాలకు మించి ఆదాయం పెరుగుతుంది. సంపన్న కుటుంబంలోని వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి సంబంధం కుదరడం గానీ జరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ప్రతి ప్రయత్నమూ త్వరగా నెరవేరుతుంది.
- కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉచ్ఛ శుక్రుడు రాహవుతో కలవడం వల్ల ఆదాయ మార్గాలు విస్తరి స్తాయి. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. అనేక మార్గాల్లో సంపాదించే అవకాశముంటుంది. ఆర్థిక పరిస్థితితో పాటు, ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. విదేశాల నుంచి ఆశిం చిన శుభవార్తలు, సమాచారాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశముంది. వృత్తి, ఉద్యో గాల్లో ఆశించిన గుర్తింపుతో పాటు పురోగతి కూడా ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి.
- కన్య: ఈ రాశికి సప్తమంలో శుక్ర రాహువుల కలవడం వల్ల ఉద్యోగంలోనూ, ఆర్థికంగానూ స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం, అదనపు రాబడి వృద్ధి చెందుతాయి. వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. జీవిత భాగస్వామికి కూడా అదృష్టం పట్టి, ఆదాయం బాగా పెరగడం జరుగుతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతికి అవకాశముంది.
- ధనుస్సు: ఈ రాశికి నాలుగవ స్థానంలో శుక్ర, రాహువుల కలయిక వల్ల గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వృత్తి, ఉద్యోగా ల్లోనే కాకుండా సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరిగే సూచనలున్నాయి. రాజకీయ ప్రము ఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. తల్లితండ్రులతో సఖ్యత, సామరస్యం మెరుగుపడతాయి.
- కుంభం: ఈ రాశివారికి ధన స్థానంలో ఈ రెండు గ్రహాలు కలుస్తున్నందువల్ల ఆదాయం బాగా పెరుగు తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధి చెందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పొదుపు చర్యలు చేపడతారు. పదోన్న తులకు ఆస్కారముంది. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు మీ సలహాలు, సూచనలు పాటించి ప్రయోజనం పొందుతారు. శుభ కార్యాలకు సహాయం చేస్తారు.