Shukra Gochar 2024
మార్చి 30 నుంచి ఏప్రిల్ 23 వరకు తన ఉచ్ఛ స్థానమైన మీన రాశిలో శుక్రుడు సంచారం చేయబోతున్నాడు. సాధారణంగా శుక్రుడు తన స్వస్థానాల్లో గానీ, ఉచ్ఛ స్థానంలో గానీ సంచారం చేస్తున్నప్పుడు ఏ రాశికైనా ఎక్కువగా శుభ ఫలితాలనే ఇస్తాడు. దుస్థానాల్లో ఉన్నప్పుడు కూడా తప్పకుండా మంచి ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది. శుక్రుడు మీన రాశిలోకి వచ్చీ రాగానే మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకర, కుంభ రాశులకు కూడా వీలైనంతగా శుభ ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది.
- మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపడుతుండడం వల్ల విలాసాల మీదా, సుఖాల మీదా ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందు తాయి. భార్యాభర్తల మధ్య ఏవైనా సమస్యలున్న పక్షంలో అవి కొద్ది ప్రయత్నంతో తొలగిపోతాయి. విడాకుల కేసులు ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉంటుంది. విదేశీ యానానికి ఆటంకాలు తొలగిపోతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వైద్య ఖర్చులు చాలావరకు తగ్గిపోతాయి.
- కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల విదేశీ యానానికి ఎటువంటి ఇబ్బం దులున్నా తొలగిపోతాయి. విదేశీ సొమ్ము తినే యోగం పడుతుంది. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. తండ్రి వైపు నుంచి సంపద కలిసి వస్తుంది. తండ్రితో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. తీర్థయాత్రలు, విహార యాత్ర లకు వెళ్లడం జరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది.
- సింహం: ఈ రాశికి అష్టమ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశముం టుంది. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది. వారసత్వ సంపద కలిసి వస్తుంది. జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని విధంగా జీత భత్యాలు పెరగడం జరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆదాయానికి లోటుండదు.
- వృశ్చికం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడికి ఉచ్ఛస్థితి కలుగుతున్నందువల్ల సంపన్న వ్యక్తితో ప్రేమలో పడడం లేదా, సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం కావడం వంటివి జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వచ్చి, దాని వల్ల లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. లాభదాయక పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు తృతీయ స్థానంలో ఉచ్ఛపడుతుండడం వల్ల ఈ రాశివారి ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. ముఖ్యంగా విశేషమైన ఆర్థిక పురోగతి ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి కంపెనీలో మంచి జీతభత్యాలతో ఉద్యోగం లభిస్తుంది. మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి.
- కుంభం: ఈ రాశికి ధన స్థానంలో శుక్రుడు ఉచ్ఛస్థితికి వస్తున్నందువల్ల తప్పకుండా అనేక విధాలుగా ధన లాభం కలుగుతుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. జీవనశైలి బాగా మెరుగు పడుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. లాభదాయక స్నేహాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు, రాబడి బాగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు గడిస్తారు. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.