Telugu Astrology: మకర రాశిలో కుజ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారి తల రాతలు మారడం పక్కా.. !

| Edited By: Janardhan Veluru

Feb 19, 2024 | 7:15 PM

భోగభాగ్యాలకు, ధనాభిలాషకు మారుపేరైన శుక్రుడితో దూకుడుకు, తెగువలకు మారుపేరైన కుజుడు కలిసి ఉండడం, పైగా మొండి పట్టుదలకు ప్రతిరూపమైన మకర రాశిలో కలిసి ఉండడం వల్ల ఏడు రాశుల వారిలో ఈ లక్షణాలు పెరిగే అవకాశం ఉంది. మనసులోని కోరికలు, ఆశలు విజృంభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ధన సంపాదన మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది.

Telugu Astrology: మకర రాశిలో కుజ, శుక్రుల కలయిక..  ఆ రాశుల వారి తల రాతలు మారడం పక్కా.. !
Astrology
Follow us on

భోగభాగ్యాలకు, ధనాభిలాషకు మారుపేరైన శుక్రుడితో దూకుడుకు, తెగువలకు మారుపేరైన కుజుడు కలిసి ఉండడం, పైగా మొండి పట్టుదలకు ప్రతిరూపమైన మకర రాశిలో కలిసి ఉండడం వల్ల ఏడు రాశుల వారిలో ఈ లక్షణాలు పెరిగే అవకాశం ఉంది. మనసులోని కోరికలు, ఆశలు విజృంభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ధన సంపాదన మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. అనుకున్నది సాధించే వరకూ నిద్రపోని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రాశులుః మేషం, వృషభం, కర్కాటకం, తుల, ధనుస్సు, మకరం, మీనం.

  1. మేషం: ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో పైకి ఎదగాలన్న కోరిక విజృంభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధం కావడం, ఉద్యోగంలో శ్రమను పెంచడం వంటివి ప్రారంభం అవుతాయి. డబ్బు మీద కూడా ప్రేమ పెరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాల మీద, అదనపు రాబడి మీద దృష్టి సారిస్తారు. సుఖ వంతమైన జీవితం కోసం ఆరాటం ఎక్కువవుతుంది. ప్రేమ వ్యవహారాలు, పెళ్లి ప్రయత్నాలు సాను కూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలోనూ, ఆర్థికంగానూ స్థిరత్వం ఏర్పడడానికి అవకాశముంది.
  2. వృషభం: ఈ రాశివారికి విదేశీ యానం మీద, విదేశాల్లో ఉద్యోగాల మీద దృష్టి పడుతుంది. వీటిని సాధించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రయత్నాలు ప్రారంభించి సఫలం అవుతారు. ప్రతి ప్రయత్నానికీ, ప్రతి పనికీ అధిక సంపాదనతో లింకు పెట్టడం జరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ చాలావరకు సఫలం అవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజృంభించడం జరుగుతుంది. అనవసర పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది. ఆదాయం పెరగడం వల్ల విలాస జీవితం అలవాటవుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి సప్తమంలో ఉచ్ఛ కుజుడితో శుక్రుడు కలవడం వల్ల భోగభాగ్యాలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతుల కోసం లేదా అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నించి విజయం సాధించడం జరుగుతుంది. విలాస జీవితానికి అలవాటు పడతారు. అనవసర పరిచయాలు పెరుగుతాయి. అదనపు ఆదాయ మార్గాలను విస్తరించుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో దూకుడు పెరుగుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది.
  4. తుల: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో అంటే సుఖ స్థానంలో శుక్ర, కుజుల యుతి ఏర్పడినందువల్ల సుఖసంతోషాలకు కోసం తాపత్రయపడడం జరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాల కోసం ప్రయ త్నిస్తారు. గృహంలో కూడా ఆధునిక సౌకర్యాలను మెరుగుపరచుకుంటారు. వ్యక్తిగత సుఖాల మీద విపరీతంగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఎక్కువగా విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడానికి విపరీతంగా శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తారు.
  5. ధనుస్సు: ఈ రాశికి ధన స్థానంలో ఉచ్ఛ కుజుడితో శుక్రుడు కలవడం వల్ల వ్యక్తిగతంగా తాను సుఖ పడడానికి పాటుపడుతూనే కుటుంబ సుఖ సంతోషాల కోసం ప్రయత్నించడం జరుగుతుంది. మొత్తం మీద సంపాదనను పెంచుకోవాలనే తాపత్రయం పెరుగుతుంది. చివరికి సంపాదనను పెంచుకోవడం కూడా జరుగుతుంది. సిరిసంపదలు కలిసి వస్తాయి. విలాస జీవితం అలవాటవు తుంది. ప్రముఖులతోనూ, స్నేహితులతోనూ పార్టీలు చేసుకోవడం బాగా ఎక్కువవుతుంది.
  6. మకరం: ఈ రాశిలో కుజ, శుక్రులు కలవడం వల్ల సుఖాభిలాష పెరుగుతుంది. ధనాశ విజృంభిస్తుంది. గట్టి పట్టుదలతో మనసులోని కోరికలను నెరవేర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అధికారం కోసం సర్వశక్తులూ దారబోస్తారు. వీరి ప్రయత్నాలు అనేకం సఫలం అవుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
  7. మీనం: ఈ రాశికి లాభ స్థానంలో కుజ, శుక్రుల కలయిక చోటు చేసుకున్నందువల్ల, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం పెంచుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు సాగిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. లాభదాయక పరిచయాలను ఏర్పరచుకుంటారు. సంపన్నులతో స్నేహాలు పెంచుకుని, వ్యాపారాలు ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది. వీరి ప్రయత్నాలు ఫలించి ఉద్యోగ, ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మనసులోని కోరికలకు తగ్గట్టుగా భోగభాగ్యాలను అనుభవిస్తారు.