Telugu News Astrology Shani Transit in Mesha Rashi on 03 Jan 2027 These zodiac signs to get money, luck and career growth
Shani Gochar: 30 ఏళ్ల తర్వాత మేష రాశిలోకి శనీశ్వరుడు.. వారికి లక్కీ టైమ్ స్టార్ట్!
Shani Transit in Mesh Rashi Effects: శని దేవుడు ఒక రాశిలో సుమారు రెండున్నరేళ్లు సంచరిస్తాడు. అందువల్ల శని రాశి మార్పు ప్రభావం ఆయా రాశుల వారిపై దీర్ఘకాలం ఉంటుంది. కష్టపడే వారికి శని మంచి ఫలితాలు అందిస్తాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్న శని దేవుడు.. 2027 జనవరి 3న కుజ స్థానమైన మేష రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ గోచారం వల్ల కొందరికి సవాళ్లు ఎదురైనా, మరికొందరికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ పురోగతి, కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది.
జ్యోతిషశాస్త్రంలో శని దేవుడిని కర్మఫల ప్రదాతగా భావిస్తారు. వ్యక్తులు చేసే కర్మలను బట్టి శనీశ్వరుడు ఫలితాలను ఇస్తారు. అంటే చెడు చేసిన వారికి చెడు ఫలితాలను.. మంచి చేసిన వారికి మంచి ఫలితాలను శనిదేవుడు ప్రసాదిస్తాడని భావిస్తారు. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో శని గోచారంకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న శని దేవుడు జూన్ 3, 2027న కుజ స్థానమైన మేష రాశిలోకి ప్రవేశించనున్నారు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత శని ఈ రాశిలోకి అడుగుపెడుతున్నాడు.
జ్యోతిషశాస్త్రం ప్రకారం మేష రాశి శనికి నీచ రాశి. ఈ గోచారం కొన్ని రాశుల వారికి సవాళ్లను తెచ్చినప్పటికీ, మరికొన్ని రాశుల వారికి ఊహించని కొత్త అవకాశాలు, ధన లాభం, ఉద్యోగ పురోగతిని అందించబోతోంది. 30 ఏళ్ల తర్వాతి జరిగే ఈ శని గోచారంతో నాలుగు రాశుల వారి జీవితాల్లో కొత్త ద్వారాలను తెరిచి ఆర్థిక, ఉద్యోగ రంగాల్లో విశేషమైన ప్రగతిని ఇవ్వనుంది.
శని మేష రాశి ప్రవేశంతో జాక్‌పాట్ కొట్టనున్న రాశులివే..
మిథున రాశి (Gemini): మేష రాశిలోకి శని గోచారం మిథున రాశి వారికి ఆర్థికంగా ఎంతో అనుకూలంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఆదాయానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. అకస్మాత్తుగా ధన లాభానికి అవకాశముంది. పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్, హోదా పెరిగే అవకాశముంది. విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ వ్యాపారాల నుండి మంచి లాభాలు వస్తాయి.
సింహ రాశి (Leo): శని దేవుడి రాశి మార్పుతో ఈ రాశి వారికి ఆర్థిక, వృత్తిపరమైన జీవితంలో గణనీయమైన ఎదుగుదల ఉంటుంది. ఆఫీసు లేదా పని చేసే ప్రదేశంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. కొత్త ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది.
ధనుస్సు రాశి (Sagittarius): శని రాశి మార్పుతో ఈ రాశి వారు కెరీర్‌లో అనుకున్న స్థాయికి ఎదుగుతారు. నచ్చిన ఉద్యోగాన్ని సాధించే అవకాశాలు పెరుగుతాయి. ఆదాయంలో పెరుగుదల ఉండి ఆర్థిక స్థితి బలపడుతుంది. వ్యాపారులు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి భవిష్యత్తులో లాభపడతారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు విజయం లభిస్తుంది.
కుంభ రాశి (Aquarius): కొత్త అవకాశాలు, స్థిరత్వంతో నిండిన సమయం ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో సరికొత్త ప్రయోగాలు ఫలించి లాభాలు తెస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగి పొదుపు పెరుగుతుంది.
(గమనిక: జ్యోతిష్య ఫలితాలు సాధారణ గ్రహస్థితుల ఆధారంగా ఇవ్వబడినవి. వ్యక్తిగత జాతకంలోని లగ్నం, ఇతర గ్రహాల స్థితి వంటి అంశాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు)