Horoscope: కుంభరాశిలోకి మారుతోన్న శని.. ఈ 12 నక్షత్రాలకు మహారాజయోగం ఖాయమే.!

| Edited By: Ravi Kiran

Jan 17, 2023 | 7:00 AM

ఈ నెల 18న కుంభరాశిలోకి మారుతున్న శని వల్ల కొన్ని రాశులే కాదు, కొన్ని నక్షత్రాలకు కూడా కనీవినీ ఎరుగని రీతిలో మహా రాజయోగం పట్టబోతోంది..

Horoscope: కుంభరాశిలోకి మారుతోన్న శని.. ఈ 12 నక్షత్రాలకు మహారాజయోగం ఖాయమే.!
Horoscope
Follow us on

ఈ నెల 18న కుంభరాశిలోకి మారుతున్న శని వల్ల కొన్ని రాశులే కాదు, కొన్ని నక్షత్రాలకు కూడా కనీవినీ ఎరుగని రీతిలో మహా రాజయోగం పట్టబోతోంది. గృహ, వాహన యోగాలతో పాటు, ఉద్యోగంలో ఉన్నత పదవులు, మంచి చోట పెళ్లిళ్లు, విదేశీయానాలు, విదేశాల్లో ఉద్యోగం, నిరుద్యోగులకు ఉద్యోగ పరంగా స్థిరత్వం, ప్రేమ వ్యవహారాల్లో విజయం, ఆకస్మిక ధన లాభం, వృత్తి వ్యాపారాల్లో లాభాలు వంటివి వీరి జీవితంలో చోటు చేసుకుంటాయి. జ్యోతిష శాస్త్రంలో మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. అవన్నీ 12 రాశులకు విస్తరించి ఉంటాయి. ప్రతి గ్రహమూ ఈ నక్షత్రాల మీద నుంచి సంచరించవలసిందే. అందువల్ల శని సంచారం వల్ల ఏ ఏ నక్షత్రాలు ప్రయోజనం పొందబోతున్నది ఇక్కడ అధ్యయనం చేసి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. శని రాశి మారటం వల్ల దాదాపు అన్ని నక్షత్రాల వారికి కొద్దో గొప్పో యోగం పట్టబోతోంది. శనికి కుంభరాశి స్వక్షేత్రం, మూల త్రికోణం. ఫలితంగా శని అన్ని నక్షత్రాల వారికి యోగం కలగజేస్తాడు. యోగం అంటే మనసులోని కోరికలు నెరవేరటం. ఈ మొత్తం నక్షత్రాలను మహారాజ యోగం పట్టే నక్షత్రాలుగా, సాధారణ రాజయోగం పట్టే నక్షత్రాలుగా విభజన చేయడం జరిగింది. శని కుంభరాశి నుంచి మీన రాశికి మారేవరకు, అంటే రెండున్నర ఏళ్ల వరకు ఈ నక్షత్రాల వారు అదృష్ట యోగం, రాజయోగం అనుభవించబోతున్నారు.

మహారాజ యోగం పట్టే నక్షత్రాలలో అశ్విని, భరణి, రోహిణి, పునర్వసు, పుష్యమి, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, పూర్వాషాడ, శతభిషం, ఉత్తరాభాద్ర ఉన్నాయి. ఈ 12 నక్షత్రాలు కాకుండా 15 నక్షత్రాలకు సాధారణ రాజయోగం పట్టే అవకాశం ఉంది. ఈ 12 నక్షత్రాలకు జనవరి 18తో ప్రారంభమై రెండున్నర ఏళ్ల పాటు జీవితంలో అనేక సానుకూల మార్పులు, శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. వ్యక్తిగత జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ, ఏ దశలు, అంతర్దశలు నడుస్తున్నప్పటికీ ఈ 12 నక్షత్రాల వారికి అనేక శుభ ఫలితాలు అనుభవానికి రావడం మాత్రం ఖాయం. ఈ నక్షత్రాల వారు చాలావరకు కష్టాల్లోంచి, సమస్యల్లోంచి బయటపడటం తప్పనిసరిగా జరుగుతుంది. ఇతర గ్రహాల సంచారం వల్ల మధ్య మధ్య సమస్యలు ఎదురైనా, వాటిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండని స్థాయిలోనే ఉంటాయి.

అశ్విని, భరణి నక్షత్రాల వారు ఉద్యోగంలో అధికార యోగం పట్టడం ఖాయంగా జరుగుతుంది. నిరుద్యోగులు అయితే మంచి ఉద్యోగంలో చేరి స్థిరపడటం కూడా జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు. ఐ టి, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు తదితర వృత్తి నిపుణులకు జీవితం కొత్త మలుపులు తిరుగుతుంది. జీవితంలో ఇక దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ వ్యవహారాలలో విజయాలు సాధిస్తారు. మంచి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. అంతకు మించి చక్కటి లక్ష్మీ యోగం పడుతుంది. రోహిణి, పునర్వసు, పుష్యమి నక్షత్రాల వారు ఏనాడూ ఊహించని ఉద్యోగాలలో స్థిరపడతారు. ఆకస్మిక ధన లాభాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించే అవకాశం కూడా ఉంది. వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. ఐటి తదితర వృత్తి నిపుణులకు విదేశాల్లో లేదా విదేశీ కంపెనీల్లో ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. తమ వృత్తిలలో కొత్త పుంతలు తొక్కుతారు. లాభాల పంట పండించుకుంటారు.

ఇక పుబ్బ, హస్త, స్వాతి నక్షత్రాల వారికి అనుకోకుండా, ఏమాత్రం ఊహించని విధంగా గృహ, వాహన యోగాలు పట్టబోతున్నాయి. సృజనాత్మకతకు ప్రతిరూపాలైన ఈ నక్షత్రాల వారికి సమాజంలో తిరుగులేని గుర్తింపు లభిస్తుంది. వీరు కళా రంగంలో ఉన్నట్టయితే విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. రాజకీయ, సామాజిక రంగాలలో ఉన్నట్టయితే గుర్తింపుతో పాటు, అందలాలు ఎక్కడం కూడా జరిగి తీరుతుంది. సాహిత్యం, పరిశోధన వంటి రంగాల్లో ఉన్నవారు పురస్కారాలు అందుకునే అవకాశం ఉంది. వీరికి సంపద కూడా బాగా పెరుగుతుంది. అనురాధ, పూర్వాషాఢ నక్షత్రాల వారు ఇంతవరకు కన్న కలలన్నీ సాకారం కావడం జరుగుతుంది. ముఖ్యంగా మంచి ఇల్లు అమరుతుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఇష్టపడిన వారితో వైభవంగా పెళ్లి జరుగుతుంది. కుటుంబ సభ్యులు అనుకూలంగా మారుతారు. శతభిషం, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారు ఈ రెండున్నర ఏళ్ళు ఒక వెలుగు వెలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో ఎంత శ్రద్ధ పెడితే అంతగా అభివృద్ధి చెందుతారు. ఉద్యోగులు కొద్దిపాటి ప్రయత్నంతో అధికారం దక్కించుకుంటారు. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.

ఎవరికి ఏ రాజయోగం పట్టినా ఒక్క విషయాన్ని మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. శనికి అహంకారం అన్నా, బద్ధకం అన్నా ఏ మాత్రం నచ్చదు. ఆ రెండు లక్షణాలు ఉన్నవారికి ఏదో ఒక సమయంలో తప్పకుండా సమస్యలు, ఆటంకాలు సృష్టిస్తాడు. శనికి వినయ విధేయత లంటే చాలా ఇష్టం. లక్షణాలు ఉన్న వారిని చాలా త్వరగా అందలాలు ఎక్కిస్తాడు. శనీశ్వరుడు ఈనెల 18న రాసి మారుతున్నందువల్ల అంతకు ఒకటి రెండు రోజుల ముందు శివాలయానికి వెళ్లి అర్చన చేయించడం మంచిది. దీనివల్ల అన్ని నక్షత్రాల వారు తప్పనిసరిగా ప్రయోజనం పొందటం జరుగుతుంది.