నవ గ్రహాల్లో శనీశ్వరుడిని కర్మ ఫల దాత అని అంటారు. అన్ని గ్రహాలలో శనీశ్వరుడు అత్యంత క్రూరమైనది గ్రహంగా పరిగణించబడుతున్నాడు. అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం కూడా ఇదే. అందుచేత శనీశ్వరుడు ఏదైనా ఒక రాశిలో సుమారు రెండున్నరేళ్ల పాటు ఉంటాడు. శనీశ్వరుడు ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఛత్ పూజ తర్వాత శనీశ్వరుడు ఈ రాశిలో ప్రత్యక్షంగా అడుగు పెట్టనున్నాడు. జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల ప్రత్యక్ష, తిరోగమన కదలిక చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అన్ని గ్రహాలు ఒక నిర్దిష్ట కాలం తర్వాత ప్రత్యక్షంగా లేదా తిరోగమనంలో కదులుతాయి. దీంతో వివిధ రాశులపై విభిన్న ప్రభావాలను చూపిస్తాయి.
శనీశ్వరుడు ప్రస్తుతం తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి తిరోగమనంలో ప్రయాణిస్తున్నాడు. ఇలా ప్రయాణించి నేరుగా ఛత్ పండగ తర్వాత కుంభరాశిలోకి అంటే 15 నవంబర్ 2024న సాయంత్రం 5.09 గంటలకు అడుగు పెట్టనున్నాడు. కుంభరాశిలో శనీశ్వరుడు ప్రత్యక్ష సంచారం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని రాశుల వారికి ఇది చాలా శుభప్రదంగా ఉంటుంది.
వృషభ రాశి: శనీశ్వరుడు గమనంలో మార్పు కారణంగా వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వ్యక్తులకు ఉద్యోగం లభిస్తుంది. అంతేకాదు ప్రేమ జీవితంలో మెరుగుదలతో పాటు, వివాహ అవకాశాలు కూడా ఏర్పడతాయి.
కన్య రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు శనిశ్వరుడి కదలిక శుభ ఫలితాలనిస్తుంది. కన్య రాశి వారు పాత అప్పులు తీరుస్తారు. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి ఉపశమనం పొందుతారు. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధించవచ్చు.
తులా రాశి: శనీశ్వరుడు నేరుగా కుంభరాశిలో సంచరించడం వల్ల తులారాశి వారికి ఇది చాలా శుభప్రదంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో తుల రాశి వారు పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక లాభాలతో జీవితం మెరుగుపడుతుంది.
కుంభ రాశి: శనీశ్వరుడు ప్రత్యక్ష కదలిక కుంభరాశికి చెందిన వ్యక్తులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా కుంభరాశి వ్యక్తులు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. పాత సమస్యలన్నీ తొలగిపోతాయి. పని చేసే రంగంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక లాభంతో పాటు కుటుంబంలో ఉన్న సంబంధాలు కూడా మెరుగుపడతాయి.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..