Shukra Shani Yoga: ఏర్పడిన శని శుక్ర యోగం.. ఈ మూడు రాశులు సువర్ణ సమయం.. మట్టి పట్టుకున్నా బంగారమే..

జ్యోతిష్యశాస్త్రంలో శని, శుక్ర గ్రహాలు కలయిక చాలా శుభప్రదంగా భావిస్తారు. శని శుక్ర సంచారము మొత్తం 12 రాశులకు చెందిన వ్యక్తులపై ప్రభావం చూపించినా.. కొన్ని రాశుల వారికి అదృష్టకరం. శని శుక్ర యోగం వలన కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. డబ్బు, వృత్తి, సంబంధాలలో ప్రత్యేక విజయం, ఆనందాన్ని పొందుతారు. ఈ రోజు ఆ అదృష్ట రాశులు ఏమిటో తెలుసుకుందాం..

Shukra Shani Yoga: ఏర్పడిన శని శుక్ర యోగం.. ఈ మూడు రాశులు సువర్ణ సమయం.. మట్టి పట్టుకున్నా బంగారమే..
Shani Shukra Yog

Updated on: Jun 23, 2025 | 7:25 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం రెండు గ్రహాలు ఒక ప్రత్యేక కోణంలో వచ్చినప్పుడు.. అది ఆ వ్యక్తి జీవితం, సంపద, వృత్తి, సంబంధాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. జూన్ 22వ తేదీ 2025న ఉదయం 11:43 గంటలకు, శనీశ్వరుడు, శుక్రుడు 45 డిగ్రీల కోణంలో రావడం ద్వారా “అర్ధకేంద్ర యోగం”ను ఏర్పరచారు. శనీశ్వరుడు క్రమశిక్షణ, కృషి, స్థిరత్వాన్ని సూచిస్తుండగా.. శుక్రుడు అందం, వైభవం, సౌకర్యం, ప్రేమకు కారకం కనుక ఈ యోగం ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రెండు గ్రహాలు ఒక ప్రత్యేక స్థానంలోకి వచ్చినప్పుడు.. కొన్ని రాశులకు అపారమైన ప్రయోజనాలు, పురోగతి లభిస్తుంది. ఈ రాజయోగం గరిష్ట ప్రయోజనం ఏ 3 రాశులకు లభిస్తుందో ఈ రోజు తెలుసుకుందాం:

మేషరాశి: మేష రాశి వారికి శని-శుక్ర సంయోగం జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు లభించవచ్చు. వ్యాపారాస్తులకు మంచి లాభాలను తెస్తుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, పెట్టుబడి అవకాశాలు ఏర్పడనున్నాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం లేదా ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పరచుకునే అవకాశం ఉంది.

వృషభ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు శని శుక్రల కలయిక వృషభ రాశి వారికి స్థిరత్వం, ప్రతిష్టను ఇస్తుంది. కెరీర్‌లో పాత అడ్డంకులు తొలగిపోతాయి. బాస్ నుంచి ప్రశంసలు, జీతం పెరుగుదల సూచనలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో వీరికి సమతుల్యత, మద్దతు లభిస్తుంది. విద్య, పిల్లలు , వివాహానికి సంబంధించిన విషయాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. డబ్బులను పొడుపు చేసే అవకాశం అధికంగా ఉంది.

ఇవి కూడా చదవండి

మకర రాశి: శని శుక్రల కలయిక వలన ఈ సమయం మకర రాశి వారికి అదృష్టం , పురోగతిని తెస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి, బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి. అవివాహితులకు .. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నవారికి వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో పెట్టుబడులు పెరుగుతాయి. నాలుగు విధాలుగా పొదుపులు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులు మద్దతు ఇస్తారు.

ఈ యోగా సమయంలో ఏమి చేయాలంటే

శని శుక్ర శుభ యోగం దాదాపు 15 నుంచి 20 రోజుల వరకు ప్రభావవంతంగా ఉంటుంది. ఈ సమయంలో ఓర్పు, సానుకూల ఆలోచన , కృషితో ముందుకు సాగాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. పెద్ద నిర్ణయాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ రాశి ఈ మూడు రాశుల్లో ఏదైనా ఒకటి అయితే మీకు ఈ సమయం సువర్ణావకాశాలను తెస్తుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.