మేషం: ఈ నెల 18న శని కుంభరాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశి వారు కొన్ని అదృష్ట యోగాలు అనుభవించే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. ఇంతవరకు సంతానం కలగని వారికి సంతానం కలుగుతుంది. ముఖ్యమైన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, అధికార యోగం చోటు చేసుకుంటాయి.
వృషభం: సంక్రాంతి తర్వాత నుంచి ఈ రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో తిరుగులేని అభివృద్ధి కనిపిస్తుంది. విదేశాలలో ఉద్యోగం, విదేశాలలో ఉన్నత విద్య, విదేశాలలో స్థిర నివాసం వంటివి తప్పకుండా జరుగుతాయి. వివాహ యోగానికి, సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది.
మిథునం: ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. గతంలో ఎన్నడూ జరగనంతగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మాటకు విలువ పెరుగుతుంది.
కుంభం:సంక్రాంతి తరువాత శని కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశి వారు ఉద్యోగంలో స్థిరత్వం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం మారటానికి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. అనారోగ్యం నుంచి కొద్దిగా బయటపడటానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు.
మీనం: సంక్రాంతి నుంచి రవి శుక్ర గ్రహాలు లాభ స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఉద్యోగ పరంగా ప్రమోషన్లకు, అధికార యోగానికి అవకాశం ఉంది. ఈనెల 18 నుంచి శని 12వ రాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. శుభకార్యాలు, తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు, విహారయాత్రల మీద బాగా ఖర్చు అవుతుంది. ఆరోగ్యం పర్వాలేదు.