AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

zodiac signs: మకర రాశిలోకి రవిప్రవేశంతో మారనున్న గ్రహాల స్థితిగతులు…ఈ ఐదు రాశులవారికి పట్టిందల్లా బంగారమే..!

సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినపుడు సంక్రాంతి పండుగ వస్తుంది. జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకోనున్నారు. ఇక ఈ నెల 15న రవి మకర రాశిలో ప్రవేశించడంతో ప్రారంభమయ్యే సంక్రాంతి సంబరాలు ఈసారి ప్రధానంగా ఐదు రాశుల వారిని అందలం ఎక్కించబోతున్నాయి. మకర రాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి అన్ని శుభవార్తలు వినే అవకాశం ఉందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ నెల18 నుంచి శని తన స్వక్షేత్రమైన కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ గ్రహాల మార్పుల కారణంగా వారు అత్యధికంగా ప్రయోజనం పొందబోతున్నారు.

Jyothi Gadda
|

Updated on: Jan 14, 2023 | 6:55 PM

Share
మేషం: ఈ నెల 18న శని కుంభరాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశి వారు కొన్ని అదృష్ట యోగాలు అనుభవించే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. ఇంతవరకు సంతానం కలగని వారికి సంతానం కలుగుతుంది. ముఖ్యమైన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, అధికార యోగం చోటు చేసుకుంటాయి.

1 / 5
వృషభం: సంక్రాంతి తర్వాత నుంచి ఈ రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో తిరుగులేని అభివృద్ధి కనిపిస్తుంది. విదేశాలలో ఉద్యోగం, విదేశాలలో ఉన్నత విద్య, విదేశాలలో స్థిర నివాసం వంటివి తప్పకుండా జరుగుతాయి. వివాహ యోగానికి, సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది.

2 / 5
మిథునం: ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. గతంలో ఎన్నడూ జరగనంతగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మాటకు విలువ పెరుగుతుంది.

3 / 5
కుంభం:సంక్రాంతి తరువాత శని కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశి వారు ఉద్యోగంలో స్థిరత్వం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం మారటానికి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. అనారోగ్యం నుంచి కొద్దిగా బయటపడటానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు.

4 / 5
మీనం: సంక్రాంతి నుంచి రవి శుక్ర గ్రహాలు లాభ స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఉద్యోగ పరంగా ప్రమోషన్లకు, అధికార యోగానికి అవకాశం ఉంది. ఈనెల 18 నుంచి శని 12వ రాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. శుభకార్యాలు, తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు, విహారయాత్రల మీద బాగా ఖర్చు అవుతుంది. ఆరోగ్యం పర్వాలేదు.

5 / 5
Follow Us
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ..

విటమిన్ మాత్రలు వాడుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

రామాయణంలో సీతను కాపాడేందుకు రావణుడితో పోరాడిన జటాయువు.. ప్రపంచంలో

ఆసియాలోనే బెస్ట్ బీచ్‌గా గోవా పాలొలెమ్‌.. ఈ బీచ్‌ ప్రత్యేకతలు..

ఐసీయూలో ఏం జరిగింది? ఓటీటీలో మతిపోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్

అలిపిరి పేరు ఎలా వచ్చింది? చింత చెట్టు నుంచి రామానుజాచార్యుల వరకు

Mahindra UDO ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు

మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం.. కొత్తగా 4.5 లక్షల చేయూత పింఛన్లు

Dubstep Buzz X11 ఇయర్‌‌బడ్స్​లో మతిపోగొట్టే ఫీచర్లు

రూ.6 లక్షల బడ్జెట్​లో ఫ్యామిలీ కారు కొనాలంటే ఏది బెస్ట్​