Shakata Yoga: శకట యోగంతో ఆ రాశుల వారికి లేనిపోని కష్టాలు! మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందంటే..?

| Edited By: Janardhan Veluru

Nov 08, 2023 | 6:12 PM

గురు, చంద్రులు ఒకదానికొకటి 6,8,12 స్థానాలలో ఉన్నప్పుడు ఈ శకట యోగం ఏర్పడుతుంది. గ్రహ సంచారానికి కూడా ఇది వర్తిస్తుంది. ఇది ఏర్పడినప్పుడు ఏ ప్రయత్నమూ, ఏ పనీ ఒక పట్టాన కలిసి రాదు. ఇది అప్పుడప్పుడూ దాదాపు అన్ని రాశులకూ తప్పకపోవచ్చు. ఈ యోగం ఏర్పడితే తప్పకుండా రెండు రోజులుంటుంది. సాధారణంగా గురువుకు చంద్రుడు కేంద్రస్థానాల్లో అంటే, 1,4,7,10 స్థానాల్లో గానీ, కోణ స్థానాలైన 5,9 గానీ, 11వ స్థానంలో గానీ సంచారం చేస్తున్నప్పుడు శుభ ఫలితాలనిస్తుంది.

Shakata Yoga: శకట యోగంతో ఆ రాశుల వారికి లేనిపోని కష్టాలు! మీ రాశిపై ప్రభావం ఎలా ఉంటుందంటే..?
Sakata Yoga Effects
Follow us on

జ్యోతిషశాస్త్రంలో శకట యోగానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. జాతక చక్రంలో ఈ యోగం పట్టినవారికి అనేక చిక్కు సమస్యలుంటాయి. ఎంతో కష్టపడితే గానీ ఫలితం ఉండదు. శ్రమకు తగ్గ ఫలితం ఉండకపోవచ్చు. జీవితం చాలావరకు గతుకుల రోడ్డు మీద బండి ప్రయాణంలా ఉంటుంది. గురు, చంద్రులు ఒకదానికొకటి 6,8,12 స్థానాలలో ఉన్నప్పుడు ఈ శకట యోగం ఏర్పడుతుంది. గ్రహ సంచారానికి కూడా ఇది వర్తిస్తుంది. ఇది ఏర్పడినప్పుడు ఏ ప్రయత్నమూ, ఏ పనీ ఒక పట్టాన కలిసి రాదు. ఇది అప్పుడప్పుడూ దాదాపు అన్ని రాశులకూ తప్పకపోవచ్చు. ఈ యోగం ఏర్పడితే తప్పకుండా రెండు రోజులుంటుంది. సాధారణంగా గురువుకు చంద్రుడు కేంద్రస్థానాల్లో అంటే, 1,4,7,10 స్థానాల్లో గానీ, కోణ స్థానాలైన 5,9 గానీ, 11వ స్థానంలో గానీ సంచారం చేస్తున్నప్పుడు శుభ ఫలితాలనిస్తుంది. అయితే, 6,8,12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మాత్రం ఇబ్బంది పడడం, ఎదురు దెబ్బలు తినడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాల్లో ఏదో ఒక గ్రహం రాశికి లేదా లగ్నానికి కేంద్ర స్థానంలో ఉన్న పక్షంలో ఈ యోగం వర్తిం చదు. ఏ రాశుల వారిని శకట యోగం ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ఇక్కడ చూద్దాం.

  1. మేషం: ఈ రాశికి అత్యంత శుభులైన గురు, చంద్రులు ఒకదానికొకటి 6,8,12 స్థానాల్లో సంచరిస్తున్న ప్పుడు గృహ, వాహన సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు తలె త్తుతాయి. తల్లిని ఏదో ఒక అనారోగ్యం కొద్దిగా పీడిస్తుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండక పోవచ్చు. మనసంతా చికాకుగా ఉండే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన విషయాల్లో దుర్వా ర్తలు వినడం జరుగుతుంది. అధికారులు మీ పనితీరుతో ఒక పట్టాన సంతృప్తి చెందకపోవచ్చు.
  2. వృషభం: ఈ రాశికి గురు, చంద్రులు అత్యంత పాపులు. ఈ రాశివారికి శకట యోగం ఏర్పడినప్పుడు సాధా రణంగా తోబుట్టువులతో కలహాలు, తండ్రి నుంచి ఇబ్బందులు, ప్రయాణాల్లో డబ్బు లేదా విలువైన వస్తువుల నష్టం వంటివి జరుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా అది విఫలం అయ్యే అవకాశం ఉంటుంది. ఏ పనీ ఒక పట్టాన పూర్తి కాదు. క్షణం తీరిక ఉండదు, దమ్మిడీ ఆదాయం ఉండదు. మిత్రులతో లేదా దగ్గర బంధువులతో అపార్థాలు తలెత్తుతాయి. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది.
  3. మిథునం: ఈ రాశివారికి శకట యోగం ఏర్పడినప్పుడు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల వాతావరణం నిరుత్సాహం కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది. పని భారం పెరుగుతుంది. పని వేళలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి కావు. అందాల్సిన డబ్బు సకా లంలో అందదు. ఒక పట్టాన డబ్బు వసూలు కాదు. మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉండదు. ఆర్థిక లావాదేవీలు, షేర్లు ఉసూరుమని పిస్తాయి.
  4. కర్కాటకం: ఈ రాశివారికి అత్యంత శుభులైన గురు, చంద్రుల మధ్య షష్టాష్టకం ఏర్పడితే, ఒక పట్టాన ఏ పనీ పూర్తి కాదు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు వెళ్లవు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో మాట పడాల్సి వస్తుంది. ఆర్థిక విషయాలేవీ సానుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర విషయాలు ఆలోచించడం వల్ల మనసు పాడవుతుంది. తండ్రితో అకారణంగా అపార్థాలు చోటు చేసుకుం టాయి. దూర ప్రయాణాలు, విహార యాత్రలు, తీర్థయాత్రలు చివరి క్షణంలో వాయిదాపడతాయి.
  5. సింహం: ఈ రాశివారికి గురు, చంద్రుల మధ్య శకట యోగం ఏర్పడితే కష్టార్జితంలో అధిక భాగం వృథా కావడమో, నష్టపోవడమో, చోరీ కావడమో జరుగుతుంది. ప్రతి పనికీ ఒకటికి పదిసార్లు తిరగాల్సి వస్తుంది. ఇంటా బయటా శ్రమ, తిప్పట, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ప్రతికూల వార్తలు లేదా దుర్వార్తలు వింటారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఈ యోగం ఏర్ప డినప్పుడు ఒకటి రెండు రోజుల పాటు ముఖ్యమైన వ్యవహారాలను చేపట్టకపోవడం చాలా మంచిది.
  6. కన్య: ఈ రాశివారికి కుటుంబపరంగా చికాకులు తలెత్తుతాయి. జీవిత భాగస్వామితో కొద్దిగానైనా పొర పచ్చాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. ఆదాయం తగ్గడం జరుగుతుంది. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. గృహ, వాహన సంబంధమైన సమ స్యలు ఏర్పడతాయి. సొంత వాహనంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్వల్ప అనారోగ్య బాధలు ఉండవచ్చు. తల్లి ఆరోగ్యం కాస్తంత ఇబ్బంది పెట్టవచ్చు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది.
  7. తుల: ఈ రాశివారికి శకట యోగం ఏర్పడడం వల్ల కొద్దిగా పేరు ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కొందరు బంధుమిత్రులు దుష్ప్రచారం చేయడం, విమర్శలు చేయడం వంటివి జరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిఫలం ఏమీ లేకుండా బరువు బాధ్యతలు పెరగడం జరుగుతుంది. సతీమణితో సమస్యలు తలెత్తవచ్చు. చేయని నేరానికి నిందలు పడాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అవమానాలు కూడా జరగవచ్చు. స్వల్ప అనారోగ్యం వల్ల ముఖ్యమైన పనులన్నీ వాయిదాపడతాయి.
  8. వృశ్చికం: ఈ రాశివారికి గురు, చంద్రుల షష్టాష్టకం వల్ల ఆర్థికంగా దెబ్బ తినడం జరుగుతుంది. మిత్రుల వల్ల ఆర్థికంగా మోసపోయే అవకాశం ఉంది. ఆస్తి అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన ఒప్పందాలపై జాగ్రత్తగా చూసి సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు ఎక్కువగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. వ్యాపారాలు నత్తనడక నడుస్తాయి. కుటుంబ వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. కొద్దిగా మాట తొందరపాటు ఉంటుంది.
  9. ధనుస్సు: ఈ రాశ్యధిపతి అయిన గురువుతో చంద్రుడు దుస్థానాల్లో ఉన్నప్పుడు అనుకున్న పనులేవీ అనుకున్నట్టు జరగవు. ముఖ్యమైన పనులు, ప్రయత్నాల్లో ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. దూకుడుతనాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిగా ప్రాభవం తగ్గు తుంది. ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలకు విఘ్నాలు ఏర్పడుతాయి. మధ్యవర్తిత్వం వహించడం వల్ల భంగపడడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో కొద్దిగా అపార్థాలు తలెత్తుతాయి.
  10. మకరం: ఈ రాశివారికి శకట యోగం ఏర్పడడం వల్ల ముఖ్యమైన ప్రయత్నాలకు అనుకోని విఘాతాలు ఏర్పడతాయి. సోదరులతో సమస్యలు తలెత్తుతాయి. శుభ కార్యాలు చివరి క్షణంలో వాయిదా పడే అవకాశం ఉంది. తేలికగా పూర్తి కావలసిన ముఖ్యమైన వ్యవహారాలు కూడా వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఏదో ఒక కారణంగా జీవిత భాగస్వామికి కొద్ది కాలం పాటు దూరం కావడం జరుగుతుంది. అనవసర పరిచయాలు ఏర్పడతాయి.
  11. కుంభం: ఈ రాశివారికి ఇంటా బయటా బాగా శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. కొన్ని వ్యక్తిగత విషయాల్లో నిరాశా నిస్పృహలు కలుగుతాయి. సమస్యలన్నీ ఒక్కసారిగా మీద పడినట్టు అనిపిస్తుంది. ప్రతిదీ ఒక వివాదంగా మారుతుంది. ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. కాస్తంత ఓర్పు, సహనా లతో వ్యవహరించడం కూడా అవసరమే. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది కలిగి స్తాయి. కుటుంబంలో ఊహించని చికాకులు తలెత్తుతాయి. ఆదాయానికి దీటుగా ఖర్చులు పెరుగుతాయి.
  12. మీనం: ఈ రాశివారికి బంధువర్గం నుంచి దుర్వార్తలు వినిపిస్తాయి. ఎదురు చూస్తున్న సమాచారం ఒక పట్టాన అందకపోవచ్చు. పిల్లలు ఇబ్బందులకు గురి చేస్తారు. మనసంతా ఆందోళనగా, అలజడిగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవచ్చు. ఏ విషయంలోనూ ముందస్తు ప్లాన్లు ఫలించవు. వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో అపార్థాలు తలెత్తవచ్చు. స్వల్ప అనారోగ్య సమస్య తలెత్తే అవకాశం కూడా ఉంటుంది. ఇంటా బయటా మీ మీద కొందరికి నమ్మకం సడలుతుంది.