ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ దూకుడు మీదుంటారట.. వీరి స్పెషాలిటీ ఏంటో తెలుసా..?

సంఖ్యాశాస్త్రం మన వ్యక్తిత్వం, ఆలోచనా శైలి, సంబంధాలు, జీవితం ఎలా సాగుతుందో చెప్పే ఒక విశ్వసనీయ మార్గం. ప్రతి మనిషికి 1 నుండి 9 మధ్యలో ఒక ప్రత్యేక సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య ఆధారంగా మన బలాలు, లోపాలు, అవకాశాలు ఎలా ఉంటాయో వివరంగా తెలుస్తుంది. అంతేకాకుండా మన జీవితం ఏ దిశగా ముందుకెళ్లనుందో కూడా ఈ సంఖ్యల ద్వారా అంచనా వేయవచ్చు.

ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ దూకుడు మీదుంటారట.. వీరి స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
Numerology Secrets

Updated on: May 06, 2025 | 2:16 PM

ఇవాళ మనం 9వ సంఖ్యకు సంబంధించిన వారి గురించి మాట్లాడుకుందాం. ఈ సంఖ్య వారికి 9, 18, 27 తేదీల్లో జన్మించినప్పుడు వస్తుంది. ఈ సంఖ్యకు అంగారకుడు ప్రభావం ఉంటుంది. అంగారకుడు శక్తి, ధైర్యం, క్రమశిక్షణ, ఉత్సాహానికి ప్రాతినిధ్యం. ఈ సంఖ్య ఉన్నవారు ఎప్పుడూ చురుకుగా ఉంటారు. ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన ఉంటుంది.. పైగా ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి తమ శక్తిని పూర్తిగా వినియోగిస్తారు.

9వ సంఖ్య కలిగిన వారు సహజంగా నాయకులు. వీరికి నిర్ణయాలు తీసుకోవడంలో భయం ఉండదు. ఏ విషయమైనా ధైర్యంగా ముందుకు వెళ్లి తాము చేయాల్సింది చేస్తారు. ఇతరుల బాధలు చూసినప్పుడు వెనక్కి తగ్గరు. వీరికి సహాయం చేయడంలో సంతృప్తి ఉంటుంది. తమ వ్యక్తిత్వంతో మాత్రమే కాకుండా.. ప్రవర్తనతో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో సానుకూల మార్పు కోసం పని చేయాలన్న సంకల్పంతో ముందడుగు వేస్తారు.

ఈ సంఖ్యలో పుట్టినవారు ప్రేమ విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. ఎవ్వరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. ప్రేమలో ఆడంబరం, ప్రదర్శన ఉండదు. మనసులో ఉన్నది చెప్పడం వీరి స్వభావం. ఒక్కసారి ఏ వ్యక్తిని అయినా తమ జీవితంలోకి అంగీకరిస్తే వారి పట్ల పూర్తి
బాధ్యతతో ఉంటారు. ఈ ప్రేమ స్థిరంగా ఉంటుంది. స్వార్థం లేకుండా అంకితభావంతో ఉంటారు.

9వ సంఖ్య కలిగిన వారికి ఉద్యోగం విషయంలో ఓ ప్రత్యేక ఆరాటం ఉంటుంది. తాము ఎంచుకున్న రంగంలో అత్యుత్తమంగా రాణించాలని భావిస్తారు. కష్టపడతారు. ఏదైనా కొత్తగా చేయాలన్న తపన వీరికి చిన్ననాటి నుంచే అనిపిస్తుంది. వీరు వైద్యరంగం, పోలీస్ శాఖ, ఉపాధ్యాయ వృత్తి, క్రీడలు, సామాజిక సేవా రంగాల్లో ఉత్తమంగా రాణించగలరు. వీరికి శారీరక బలం, మానసిక ధైర్యం రెండు సమపాళ్లలో ఉంటాయి. ఇది వారికి ఎదుగుదలలో ఎంతో ఉపయోగపడుతుంది.

ఈ సంఖ్యకు చెందిన వారు తమ వల్ల ఇతరులకు మేలు జరగాలన్న ఆలోచనతో ముందుకెళ్తారు. కుటుంబానికి, మిత్రులకు అండగా నిలవడంలో వీరు ముందుంటారు. సహాయం చేయాలన్న ఉద్దేశం వల్లే వీరు వైద్య వృత్తిలో ఎక్కువగా కనిపిస్తారు. ఎవరి బాధనైనా తమ బాధగా భావించి సహాయం చేయడంలో ముందుంటారు.

9వ సంఖ్య వారు శక్తివంతంగా ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే గల వ్యక్తులు. ప్రేమ, సహాయం, సేవ అనే మూడు లక్షణాలతో జీవితాన్ని తీర్చిదిద్దుతారు. ఈ సంఖ్య వారికి ప్రత్యేకతను ఇస్తుంది. మనిషిగా మాత్రమే కాకుండా.. సమాజంలో మార్పు తేవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతారు.