Neecha Bhanga Raja Yoga
ప్రస్తుతం తులా రాశిలో రవి గ్రహం నీచబడి ఉంది. ఈ నీచత్వం నవంబర్ 18 వరకూ కొనసాగు తుంది. సాధారణంగా నీచబడిన గ్రహం మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉండదు. అయితే, కుజ గ్రహంతో కలిసి ఉండడం వల్ల రవి గ్రహానికి నీచత్వం భంగమైంది. అంటే, గ్రహ రాజైన రవికి బలహీనత పోయి, మళ్లీ బలం చేకూరింది. దీన్ని నీచభంగ రాజయోగం అంటారు. ఈ యోగం వల్ల ఆరు రాశుల వారికి రాజయోగం పడుతోంది. మిగిలిన రాశుల వారికి సాధారణంగా గడిచి పోతుంది. ఈ రాజయోగం పట్టిన రాశులుః మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం.
- మేషం: ఈ రాశికి ఏడవ స్థానంలో రవి, కుజ గ్రహాలు కలవడం వల్ల నీచభంగ రాజయోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల ఈ రాశివారికి వ్యక్తిగతంగా మహాయోగం పట్టే అవకాశం లేదు కానీ, వృత్తి, ఉద్యోగాల్లో వీరిని వేధించేవారు, పురోగతికి ఆటంకాలు కల్పించేవాళ్లు, దెబ్బతీయడానికి ప్రయత్నించేవాళ్లు, ఏదో కారణంగా నిష్క్రమిస్తారు. వారికి బదిలీలు రావడమో, వారు ఉద్యోగం నుంచి వెళ్లిపోవడమో, వారి వ్యవహారం బట్టబయలు కావడమో జరుగుతుంది. వ్యాపారాల్లో కూడా పోటీదార్లు వైదొలగుతారు.
- వృషభం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో రవి, కుజ గ్రహాలు కలవడం వల్ల గృహ, వాహన యోగాలు కల గడం, వృత్తి, ఉద్యోగాలలో హోదా పెరగడం, వివాదాలు సానుకూలంగా పరిష్కారం కావడం, కోర్టు ద్వారా వివాదాస్పద ఆస్తి దక్కడం వంటివి జరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో తిరుగుండదు. మీ మాట, చేత బాగా చెల్లుబాటు అవు తాయి. ఆర్థిక సమస్యలకు, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారాల్లో పోటీ తగ్గుతుంది.
- సింహం: ఈ రాశినాథుడైన రవి నీచబడినప్పటికీ, కుజ గ్రహంతో కలవడం వల్ల నీచభంగం కలిగింది. అందువల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం యథా ప్రకారం కొనసాగుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించడం జరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. చొరవ పెరుగుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. శత్రువులు దూరంగా వెళ్లిపోతారు. సోదరులతో వివాదాలు పరిష్కారం అవుతాయి.
- తుల: ఈ రాశిలో రవి గ్రహం నీచబడడమే ఒక యోగం కాగా, అక్కడ నీచభంగ రాజయోగం కూడా ఏర్పడడం మరింతగా శుభ ఫలితాలనిస్తుంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులతో మీ మాటకు విలువ పెరుగు తుంది. తండ్రి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రతి పనీ, ప్రతి వ్యవహారమూ లాభదాయకంగా మారుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
- ధనుస్సు: ఈ రాశివారికి లాభ స్థానంలో రవికి నీచభంగం ఏర్పడడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలకు సంబంధించి శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆదాయానికి, జీవనోపాధికి సంబంధించి వేగవంతమైన పురోగతి ఉంటుంది. మీ ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో, ముఖ్యంగా రాజ కీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి.
- మకరం: ఈ రాశివారికి దశమ స్థానంలో రవికి నీచభంగం ఏర్పడడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన స్థిర త్వంతో పాటు, ప్రాధాన్యం, ప్రాభవం కూడా బాగా వృద్ధి చెందుతాయి. సమాజంలో పేరు ప్రఖ్యా తులు పెరుగుతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మార డానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు లాభాలపరంగా బాగా వృద్ధి చెందుతాయి.