అనుకూలంగా చంద్రుడు.. వారికి శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి ఉపశమనం..!

| Edited By: Janardhan Veluru

Nov 06, 2023 | 5:51 PM

నవంబర్ 4వ తేదీ నుంచి 9 వరకు చంద్రుడు తనకిష్టమైన స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇందులో కర్కాటక రాశి చంద్రుడి స్వక్షేత్రం కాగా, సింహ, కన్యారాశులు ఈ గ్రహానికి మిత్ర క్షేత్రాలు. ఈ స్థానాలలో చంద్రుడు సంచరిస్తున్నప్పుడు మనసులోని కోరికలు నెరవేరుస్తాడు. ఈ సంచార సమయంలో సానుకూల దృక్పథంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఎటువంటి ప్రయ త్నాలు చేపట్టినా తప్పకుండా నెరవేరడం జరుగుతంది.

అనుకూలంగా చంద్రుడు.. వారికి శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి ఉపశమనం..!
Moon in Cancer
Follow us on

నవంబర్ 4వ తేదీ నుంచి 9 వరకు చంద్రుడు తనకిష్టమైన స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఇందులో కర్కాటక రాశి చంద్రుడి స్వక్షేత్రం కాగా, సింహ, కన్యారాశులు ఈ గ్రహానికి మిత్ర క్షేత్రాలు. ఈ స్థానాలలో చంద్రుడు సంచరిస్తున్నప్పుడు మనసులోని కోరికలు నెరవేరుస్తాడు. ఈ సంచార సమయంలో సానుకూల దృక్పథంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, ఎటువంటి ప్రయ త్నాలు చేపట్టినా తప్పకుండా నెరవేరడం జరుగుతంది. ఎంత పాజిటివ్ గా ఉంటే అంత మంచిది. ఇక దీర్ఘకాలిక అనారోగ్యాలతో అవస్థలు పడుతున్నవారికి సరైన వైద్యం, చికిత్సా పద్ధతులు లభ్యమయ్యేలా చేస్తాడు. మానసిక ఒత్తిడి తగ్గడం, మనశ్శాంతి ఏర్పడడం వంటివి జరుగుతాయి. తల్లిని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తారు. తల్లితో కలిసి ఉండడం జరుగుతుంది. వివిధ రాశులకు ఈ చంద్ర గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోయేదీ పరిశీలిద్దాం.

  1. మేషం: ఈ రాశివారికి ఈ అయిదు రోజుల చంద్ర సంచారం అన్ని విధాలుగానూ అనుకూలంగా ఉండబో తోంది. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సత్ఫలితాలనిస్తుంది. ఆత్మవిశ్వాసం, మానసిక స్థయిర్యం ఏర్పడతాయి. ఇష్టమైన ప్రాంతాలను సందర్శించడం జరుగుతుంది. గృహ, వాహన యోగాలు ఏర్పడతాయి. తల్లి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లలు లేదా విద్యార్థులు చదువుల్లో బాగా పైకి వస్తారు. మనసులోని ఒకటి రెండు కోరికలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
  2. వృషభం: విరోధాలు, శత్రుత్వాల స్థానంలో స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఎటువంటి ప్రయత్న మైనా సఫలం అవుతుంది. కొత్త ప్రాజెక్టులు, కార్యక్రమాలు చేపట్టడానికి, వృత్తి, వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఇది బాగా అనుకూలమైన సమయం. శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందజేస్తారు. రావలసిన సొమ్ము చేతికి అందు తుంది.
  3. మిథునం: ఈ రాశివారికి కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అయి, సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యానికి సరైన వైద్యం లభించే అవకాశం ఉంది.
  4. కర్కాటకం: ఈ రాశినాథుడైన చంద్రుడు స్వక్షేత్ర, మిత్ర క్షేత్రాలలో సంచారం చేస్తున్నందువల్ల, ఈ రాశివారికి ఇది అన్ని విధాలుగానూ అనుకూల సమయం. పైగా గురువుకు అనుకూల స్థానాలలో ఉన్నం దువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టడానికి ఇది మంచి సమయం. అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది.
  5. సింహం: ఈ రాశివారికి విదేశీయానానికి సంబంధించిన సమస్యలు, వీసా సమస్యలు తొలగిపోతాయి. విహార యాత్రలకు, తీర్థయాత్రలకు అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. శుభ కార్యాల మీదా, సహాయ కార్యక్రమాల మీదా ఖర్చు చేస్తారు. పుణ్య కార్యాల్లో కూడా పాల్గొం టారు. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. అనుకోకుండా తండ్రి నుంచి ఆస్తి కలిసి వస్తుంది. మంచి ఆలోచనలు కలుగుతాయి. ప్రతి దాన్నీ సానుకూల దృక్పథంతో చూస్తారు.
  6. కన్య: ఈ రాశివారికి ప్రధానంగా మంచి పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడు తుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అవకాశం ఉంది. అన్ని రంగాల వారికీ పురోగతి ఉంటుంది. సతీమణికి, పిల్లలకు కూడా అభివృద్ధి ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ మార్గాలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సత్ఫలితాలనిస్తుంది.
  7. తుల: వృత్తి, వ్యాపారాల్లో క్షణం కూడా తీరిక ఉండని యాక్టివిటీ ఏర్పడుతుంది. ఉద్యోగంలో కూడా జీత భత్యాలు పెరగడం, అధికార యోగం పట్టడం, ప్రాధాన్యం పెరగడం వంటివి జరుగుతాయి. నిరు ద్యో గులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. సామాజికంగా కీర్తి ప్రతిష్ఠలు పెరుగు తాయి. శుభ కార్యాలు చేస్తారు. పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సతీమణి నుంచి, పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వినడం జరుగుతుంది.
  8. వృశ్చికం: ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాబల్యం బాగా పెరుగుతాయి. అధి కారులు ఎక్కువగా ఆధారపడడం జరుగుతుంది. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఏ రంగానికి చెందినవారికైనా పురోగతి ఉంటుంది. లాటరీలు, జూదాలు, వడ్డీ వ్యాపారాలు, షేర్లు వంటివి కలిసి వస్తాయి. ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు.
  9. ధనుస్సు: వృత్తి, వ్యాపారాలు దూసుకుపోతాయి. లావాదేవీలు, కార్యకలాపాలు ఊపందుకుంటాయి. అంచనా లకు మించిన రాబడి ఉంటుంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. సతీమణికి వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. మరింత మంచి ఉద్యోగంలో మారడానికి అవకాశం ఉంది. తల్లితండ్రులతో పుణ్య క్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. కుటుంబ జీవితం సరదాగా, హాయిగా గడిచిపోతుంది.
  10. మకరం: కుటుంబ వాతావరణం సానుకూలంగా మారుతుంది. సతీమణికి అదృష్టం పడుతుంది. వృత్తి, ఉద్యో గాలపరంగా సతీమణి సాటి ఉద్యోగుల కంటే పురోగతి చెందే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. కొత్తవారు ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగుతాయి. శక్తికి మించి ఇతరులకు సాయం చేస్తారు. ఉద్యోగంలో ఆశించినట్టుగా స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి.
  11. కుంభం: శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. శత్రువులు అనుకూలంగా మారుతారు. అధికారుల నుంచి ఊహించని విధంగా ఆదరణ లభిస్తుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. తల్లి వైపు నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
  12. మీనం: ఈ రాశివారికి సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఎవరితో ఎటువంటి విభేదాలున్నా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మీ ఆలోచన లకు, నిర్ణయాలకు విలువ ఏర్పడుతుంది. కుటుంబ సమేతంగా పుణ్య క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. జీతభత్యాల పరంగా శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు.

(Note: ఇక్కడ అందించిన సమాచారం వారివారి నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.  దీన్ని నిర్ధారించేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని అందించాము)

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి