Happy Life: కుజ, బుధుల యుతి.. ఇక ఆ రాశుల వారికి ప్రశాంత జీవనం పక్కా..!

Kuja Budha Yuti: మీన రాశిలో ఏప్రిల్ 11 నుంచి 30 వరకు కుజ–బుధ గ్రహాల యుతి ఏర్పడుతోంది. బుధుడు నీచస్థితిలో ఉండగా, కుజుడు మిత్ర క్షేత్రంలో ఉండటం వల్ల ఈ సంయోగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ప్రభావంతో వృషభం, మిథునం, తుల, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారికి ఇప్పటి వరకు ఉన్న సమస్యలు, ఒత్తిడులు క్రమంగా తగ్గి, జీవితం ప్రశాంతంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Happy Life: కుజ, బుధుల యుతి.. ఇక ఆ రాశుల వారికి ప్రశాంత జీవనం పక్కా..!
Relief From Problems

Edited By:

Updated on: Apr 10, 2026 | 4:16 PM

మీన రాశిలో కుజ, బుధుల యుతి చెందడానికి ఒక ప్రత్యేకత ఉంది. మీన రాశి జాతక చక్రంలో చిట్టచివరి రాశి అయినందువల్ల ఈ రెండు గ్రహాల కలయికకు ప్రాధాన్యం పెరుగుతుంది. కొన్ని రాశులవారి సమస్యలు, ఒత్తిళ్లను పరిష్కరించడం తప్ప ఈ రెండు గ్రహాలు ఇతరత్రా ఉపయోగపడే అవకాశం ఉండదు. ఇందులో బుధుడికి మీన రాశి నీచ స్థానం కాగా, కుజుడికి మిత్ర క్షేత్రం. ఈ నెల(ఏప్రిల్) 11 నుంచి 30 వరకు ఈ రెండు గ్రహాలు ఈ రాశిలో కలిసి ఉంటాయి. వీటి వల్ల వృషభం, మిథునం, తుల, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారికి కొన్ని కష్టనష్టాలు, బాధలు, బెడదలు తీరిపోయి ప్రశాంత జీవనం గడపగలుగుతారు.

కుజ, బుధుల యుతి ప్రభావం ఈ ఆరు రాశుల వారిపై ఎలా ఉంటుందో ఇప్పుడు విడివిడిగా చూద్దాం..

  1. వృషభం: కుజ, బుధ గ్రహాలు లాభ స్థానంలో కలవడం వల్ల ఈ రాశివారికి ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి దాదాపు పూర్తిగా విముక్తి లభిస్తుంది. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రతికూలతలు తగ్గుతాయి. పని ఒత్తిడి, పని భారం నుంచి బయటపడతారు. ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న వీరి చిరకాల నెరవేరుతుంది. రావలసిన సొమ్మును, రాదనుకున్న సొమ్మును, మొండి బాకీలను గట్టి ప్రయత్నంతో రాబట్టుకుంటారు. సంతానం లేదన్న బాధ తీరే అవకాశం ఉంది.
  2. మిథునం: రాశ్యధిపతి బుధుడు దశమ స్థానంలో కుజుడితో కలవడం వల్ల ఉద్యోగంలో పదోన్నతికి మార్గం సుగమం అవుతుంది. పని ఒత్తిడి నుంచి, కొన్ని బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. విద్యార్థులకు చదువుల మీద ఏకాగ్రత, శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు చాలావరకు తగ్గుతాయి. ఆదాయం వృద్ధి చెందడం వల్ల వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. బాకీలను రాబట్టుకుంటారు.
  3. తుల: ఈ రాశికి షష్ట స్థానంలో కుజ, బుధుల కలయిక వల్ల ఈ రాశివారికి లీగల్ సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆస్తి, వివాదాలు, కోర్టు కేసుల నుంచి సురక్షితంగా బయటపడతారు. అనారోగ్య సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా గట్టెక్కుతారు. వివాదాలు, అపార్థాలతో దూరమైన బంధుమిత్రులు మళ్లీ దగ్గరవుతారు. ఉద్యోగంలో పదోన్నతికి పోటీదార్లు తగ్గిపోతారు. వృత్తి, వ్యాపారాలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాయి.
  4. వృశ్చికం: రాశ్యధిపతి కుజుడు పంచమంలో బుధుడితో కలిసి ఉన్నందువల్ల ఈ రాశివారికి ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో ఉన్న ప్రతిష్ఠంభన తొలగిపోతుంది. ముఖ్యంగా వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీయాన ఆటంకాలు తొలగిపోతాయి. వీసా సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమికుల మధ్య అపార్థాలు తొలగిపోయి మళ్లీ సఖ్యత, సాన్నిహిత్యం ఏర్పడతాయి. కొన్ని వైవాహిక సమస్యలకు, కుటుంబ సమస్యలకు ఊహించని పరిష్కారం లభిస్తుంది.
  5. కుంభం: ధన స్థానంలో కుజ, బుదులు కలవడం వల్ల ఈ రాశివారికి ఆదాయ వృద్ధికి ఆటంకాలు తొలగిపోతాయి. ఏలిన్నాటి శని దోషం నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. రావలసిన సొమ్ము చేతికి రావడం, మొండి బాకీలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం కావడం, కుటుంబ వ్యవహారాలు చక్కబడడం జరుగుతుంది. ఆస్తి, ఆర్థిక వివాదాల నుంచి బయటపడతారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. సంతాన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది.
  6. మీనం: ఈ రాశిలో సంచారం చేస్తున్న కుజ, బుధుల వల్ల ఈ రాశివారికి ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమై ఆస్తి లాభం, భూలాభం కలుగుతుంది. మిమ్మల్ని దూరం పెట్టిన అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. గృహ, వాహన ప్రయత్నాల్లో ఆటంకాలు, చిక్కులు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు తగ్గి ఆర్థిక లాభాలు కలుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అపార్థాలు సమసిపోతాయి. అనారోగ్యం నుంచి విముక్తి లభిస్తుంది.
Follow Us