Marriage Astrology: అనుకూలంగా మూడు శుభ గ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి త్వరలో పెళ్లి యోగం..

| Edited By: Janardhan Veluru

Nov 08, 2023 | 6:00 PM

మూడు శుభ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ ఏడాది చివరి లోగా, కొన్ని రాశుల వారికి పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. చాలాకాలంగా పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నాలు సాగిస్తూ విసిగి వేసారిపోయిన ఈ రాశుల వారికి అనుకోకుండా, అప్రయత్నంగా సంపన్నత, సంస్కారం కలిగిన కుటుంబాలలో పెళ్లి సంబంధాలు నిశ్చయం అయ్యే అవకాశం ఉంది.

Marriage Astrology: అనుకూలంగా మూడు శుభ గ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి త్వరలో పెళ్లి యోగం..
Marriage Astrology
Follow us on

మూడు శుభ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ ఏడాది చివరి లోగా, కొన్ని రాశుల వారికి పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. చాలాకాలంగా పెళ్లి సంబంధాల కోసం ప్రయత్నాలు సాగిస్తూ విసిగి వేసారిపోయిన ఈ రాశుల వారికి అనుకోకుండా, అప్రయత్నంగా సంపన్నత, సంస్కారం కలిగిన కుటుంబాలలో పెళ్లి సంబంధాలు నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరు రాశుల వారు పెళ్లి ప్రయత్నాలు, పెళ్లి సంబంధాల విషయంలో డబుల్ ధమాకా కొట్టబోతున్నారు. మిగిలిన రాశుల వారికి వచ్చే ఏడాది ఫిబ్రవరి తర్వాత నుంచి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఈ ఏడాది పెళ్లి ప్రయత్నాలు ఫలించే రాశుల జాబితాలో వృషభం, సింహం, కన్య, వృశ్చికం, మకరం, మీనం. ఈ రాశుల వారికి అతి కొద్ది ప్రయత్నంతో అంచనాలకు మించిన సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఇది యువతీ యువకులిద్దరికీ వర్తిస్తుంది.

వృషభం: రాశ్యధిపతి అయిన శుక్ర గ్రహం పంచమ స్థానంలో సంచరించడం ప్రారంభించినందువల్ల ఈ రాశి వారికి తనకు ఇష్టమైన వ్యక్తితో లేదా ప్రేమించిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది. అను కోకుండా, అతి వైభవంగా పెళ్లి జరిగే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో లేనివాళ్లు పెళ్లి చూపుల్లో వెంటనే ఇష్టపడి, పెళ్లికి సిద్ధపడడం జరగవచ్చు. ఎక్కువగా పెళ్లి సంబంధాలను చూడాల్సిన అవ సరం ఉండకపోవచ్చు. ప్రేమ ప్రయత్నాలు, ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా, జయప్రదంగా సాగి పోతాయి.

సింహం: ఈ రాశివారికి తల్లితండ్రులు ప్రయత్నం చేసిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. జీవితంలో మరచిపోలేని విధంగా అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుందని చెప్పవచ్చు. సాధారణంగా సంపన్న కుటుంబంతో లేదా బాగా పలుకుబడి కలిగిన కుటుంబంతో పెళ్లి సంబంధం కుదరవచ్చు. గతంలో చేసిన పెళ్లి ప్రయత్నం చాలా కాలం తర్వాత ఇప్పుడు సఫలం అయ్యే అవకాశం ఉంటుంది. వరుడు, వధువు ఒకే సంస్థలో పనిచేస్తున్నవారు అయ్యే అవకాశం కూడా ఉంది.

కన్య: ఎక్కువగా ప్రయత్నాలు అవసరం లేకుండానే ఈ రాశివారికి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవ కాశం ఉంది. మొదటి చూపులోనే ఇష్టపడడం జరుగుతుంది. సాధారణంగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో లేదా విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లయ్యే అవకాశం ఉంది. లేదా పెళ్లయిన తర్వాత విదేశాలకు వెళ్లిపోయే అవకాశం కూడా ఉంటుంది. పెళ్లి మీద బాగా ఖర్చయ్యే సూచన లున్నాయి. ఇందులో వధువు గానీ, వరుడు గానీ తమ కంటే ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి కావచ్చు.

వృశ్చికం: వివాహానికి సంబంధించిన గ్రహమైన శుక్రుడు లాభ స్థానంలో సంచరిస్తున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా ఈ ఏడాది పెళ్లి అవుతుంది. సాధారణంగా ప్రేమ వివాహం అయ్యే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రేమ వ్యవహారం బయటపడి, అతి తక్కువ వ్యవధిలో ఇద్దరికీ వివాహం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పెళ్లి కార్యక్రమం నిరాడంబరంగా, ఎటువంటి ఆర్భాటమూ లేకుండా జరిగిపోతుంది. పెళ్లి కారణంగా ఇద్దరికీ అదృష్టం పట్టడం, సంపద పెరగడం వంటివి జరుగుతాయి.

మకరం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో శుక్రుడు, సుఖ స్థానంలో గురువు సంచారం వల్ల బాగా పరిచయ స్థులలోనో, సహోద్యోగులతోనో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఇది ప్రేమ వివాహం కావచ్చు, తల్లితండ్రులు నిశ్చయం చేసిన సంబంధం కూడా కావచ్చు. మొత్తానికి ఇష్టపడి చేసు కున్న వివాహం అవుతుంది. పెళ్లి సందర్భంగా తప్పకుండా భారీగా ఖర్చవుతుంది. వధువు లేదా వరుడు దూర ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తి కావచ్చు. అతి తక్కువ వ్యవధిలో పెళ్లి చేయడం జరుగుతుంది.

మీనం: ఈ రాశివారికి ప్రేమ వివాహం అయ్యే అవకాశం ఉంది. కులాంతర వివాహం అయ్యే అవకాశం కూడా ఉంది. వధువు, వరుడికి మధ్య ఎక్కువ వయసు వ్యత్యాసం ఉండడం కానీ లేదా వరుడి వయసు వధువు వయసు కంటే తక్కువగా ఉండడం గానీ జరుగుతుంది. కొద్దిగా కూడా వ్యవధి లేకుండా పెళ్లి జరిగే సూచనలున్నాయి. వధూవరుల్లో ఒకరు సంపన్న కుటుంబానికి లేదా ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉంటారు. పెళ్లి కార్యక్రమం ఆర్భాటంగా పూర్తవు తుంది.