Telugu Astrology: గురు, రవి కలయిక.. ఆ రాశుల వారికి అత్యంత శుభ యోగాలు..!

మే 13 నుండి 25 వరకు వృషభ రాశిలో గురువు, సూర్యుడి కలయిక అత్యంత శుభప్రదం. దీని ప్రభావంతో మేషం, వృషభం, కర్కాటకం సహా మరికొన్ని రాశుల వారు శుభ యోగాలు పొందనున్నారు. ఉద్యోగంలో పదోన్నతి, ఆర్థిక ప్రగతి, కుటుంబ సంతోషం, ఆరోగ్యం మెరుగుపడతాయి. ఈ కాలంలో అనేక శుభకార్యాలు జరుగుతాయి.

Telugu Astrology: గురు, రవి కలయిక.. ఆ రాశుల వారికి అత్యంత శుభ యోగాలు..!
Telugu Astrology

Edited By: Janardhan Veluru

Updated on: May 02, 2025 | 7:09 PM

జాతక చక్రంలో గురు, రవులు కలిసినా, పరస్పరం చూసుకున్నా దాన్ని అత్యంత శుభ యోగంగా జ్యోతిషశాస్త్రం పరిగణిస్తుంది. గ్రహ సంచారంలో కూడా ఈ రెండు గ్రహాల కలయికకు, పరస్పర వీక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ నెల(మే) 13 నుంచి 25 వరకు వృషభ రాశిలో రవి, గురువులు కలుసుకోబోతున్నాయి. ఈ రెండు మిత్ర గ్రహాల కలయిక వల్ల మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకర రాశుల వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతి, సామాజికంగా గుర్తింపు, ఆదాయంలో పెరుగుదల, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారం, రాజపూజ్యాలకు బాగా అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి అత్యంత శుభ గ్రహాలైన రవి, గురువులు ధన స్థానంలో కలుసుకోవడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయపరంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా తప్ప కుండా విజయవంతం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. తండ్రి జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
  2. వృషభం: ఈ రాశిలో గురు, రవులు కలవడం వల్ల తప్పకుండా ఉద్యోగంలో పదోన్నతి కలుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ప్రభుత్వ గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారి కలలు సాకారం అవుతాయి. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. కొద్ది ప్రయత్నంతో సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగి పోతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో భాగ్య, ధనాధిపతుల యుతి జరుగుతున్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందడం జరుగుతుంది. ఆకస్మిక దన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ప్రభుత్వమూలక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి.
  4. సింహం: రాశ్యధిపతి రవి ఈ రాశికి అత్యంత శుభుడైన గురువుతో దశమ స్థానంలో కలిసినందు వల్ల ఉద్యోగంలో హోదా పెరగడానికి, జీతభత్యాలు వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి విజయాలు లభిస్తాయి. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగానికి ఆఫర్ అందుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది.
  5. వృశ్చికం: ఈ రాశికి శుభులైన రవి, గురువులు సప్తమ స్థానంలో కలవడం వల్ల రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది. హోదాతో పాటు జీతభత్యాలు కూడా బాగా పెరుగుతాయి. అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశం ఉంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతానం కలగడానికి అవకాశం ఉంది. మంచి పరిచయాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
  6. మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో గురు, రవులు కలవడం వల్ల రాజపూజ్యాలు పెరుగుతాయి. ప్రభుత్వం నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో రాజయోగాలు కలుగుతాయి. పిల్లలు చదువుల్లో లేదా ఉద్యోగాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. విదేశీయానానికి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.