
ఫిబ్రవరి 24 నుంచి శుభవాశి యోగం ప్రారంభం అవుతుంది. ఇది మేష, కర్కాటక, కన్య, ధనస్సు రాశుల వారికి లాభదాయకం. ఈ రాశుల వారికి శుభవాశి యోగం గొప్ప అవకాశాలను అందించనుంది.

ఈ రాశి వారికి ఫిబ్రవరి 24 నుంచి అనుకున్న ప్రతి పనిలో విజయవంతమవుతారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఆశించిన ఫలితాలు దక్కుతాయి. వ్యాపారంలో కూడా మంచి లాభాలు రావచ్చు. జరగబోయే నష్టాన్ని ముందే అంచనా వేసి అందులో నుంచి బయటపడతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఫార్మా రంగంలో, వైద్య సేవల్లో ఉన్నవారికి కూడా లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా మంచి సమయం.

ఈ రాశి వారు ఫిబ్రవరి 24 నుంచి ఒక పెద్ద వ్యాపార అవకాశాన్ని పొందే సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. పూర్వీకుల ఆస్తుల నుంచి లాభాలు రావచ్చు. చేపట్టిన ప్రతి పనిలో విజయవంతం అవుతారు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేస్తే లాభాలు చేకూరే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారికి కూడా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది.

కన్యారాశి వారికి శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించడం వలన వీరికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం, నిరుద్యోగులకు ఉద్యోగం లభించడం జరుగుతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా అనేక లాభాలు పొందుతారు. ఇంట్లో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.

ఈ రాశి వారు ఫిబ్రవరి 24 నుంచి అదృష్టవంతులుగా మారబోతున్నారు. ఆకస్మికంగా పెద్ద మొత్తంలో డబ్బు రావచ్చు. సంపద పెరిగే అవకాశం ఉంది. కొత్త ఇల్లు, కొత్త వాహనం కొంటే లాభసాటిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయి. విదేశాల్లో వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వారు శుభఫలితాలు పొందవచ్చు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది.