హిందూ మతంలో గురువారం విష్ణువు, దేవగురు బృహస్పతి ఆరాధనకు చాలా పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ విశ్వాసం ప్రకారం ఈ రోజున చేసే పూజలు, దానికి సంబంధించిన చర్యలు జీవితంలోని దుఃఖాన్ని, దురదృష్టాన్ని తొలగించి, సంతోషాన్ని, అదృష్టాన్ని పెంచుతాయని భావిస్తారు. మీరు మీ కష్టానికి పూర్తి ఫలితాన్ని పొందడం లేదని లేదా ఎన్ని ప్రయత్నాలు చేసినా.. మీకు తగిన ఫలం లభించడం లేదని మీరు భావిస్తే.. గురువారం దేవగురువు బృహస్పతిని, శ్రీమహావిష్ణువును ఆరాధించాలి. ఈ నేపథ్యంలో ఈ రోజు చేయాల్సిన చర్యల గురించి తెలుసుకుందాం..
హిందూ మత విశ్వాసం, జ్యోతిష్యం ప్రకారం రంగులు జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపుతాయి. అటువంటి పరిస్థితిలో ఆనందం, అదృష్టం కోరుకునే వ్యక్తి ఎరుపు, నలుపు, నీలం మొదలైన వాటిని విడిచిపెట్టి, గురువారం పసుపు బట్టలు ధరించడానికి ప్రయత్నించాలి. ఈ రోజున పసుపు రంగు దుస్తులు ధరించడం వలన వ్యక్తికి బృహస్పతి పూర్తి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.
పసుపును హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతి శుభ కార్యంలో ఉపయోగించే పసుపును గురువారం స్నానపు నీటిలో కలిపి తీసుకుంటే.. ఆ వ్యక్తికి అన్నింటా అదృష్టం సొంతం అవుతుంది. ఈ పరిహారంతో దేవగురువు బృహస్పతి జాతకంలో శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు.
గురువారం రోజున అరటిచెట్టును పూజిస్తే, జీవితంలో వచ్చే అన్ని రకాల సమస్యలు రెప్పపాటులో తొలగిపోయి సకల సిరి సంపదలు, సౌభాగ్యాలు లభిస్తాయని విశ్వాసం. పెళ్లికాని యువతీ యువకులు గురువారం నాడు ఇలా చేయడం వల్ల పెళ్లికి ఏర్పడే ఉన్న అడ్డంకులు త్వరగా తొలగిపోతాయని విశ్వాసం.
హిందూమతంలో కేవలం పూజలు, జపము, తపస్సు మాత్రమే కాదు, దేవతామూర్తుల అనుగ్రహం, నవగ్రహాల అనుగ్రహం పొందేందుకు దాన ధర్మాలకు కూడా విశిష్ట స్థానం ఉంది. హిందూ విశ్వాసం ప్రకారం గురువారం ఆలయంలో ఒక బ్రాహ్మణుడికి పసుపు రంగు బట్టలు, పసుపు పండ్లు, శనగ పప్పులు, హిందూ పురాణాలు, కుంకుమ, పసుపు మొదలైన వాటిని దానం చేస్తే.. జీవితంలో అన్ని ఆనందాలను పొందుతారు. సర్వత్రా లక్కీ సొంతం అవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది.
ఎంత కష్టపడి పనిచేసినా ఆర్థికంగా ఇబ్బందులు తొలగకుండా కష్టాలు పడుతుంటే.. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి గురువారం రోజున శ్రీ మహావిష్ణువుతో లక్ష్మీ దేవిని సంప్రదాయంగా.. ప్రత్యేకంగా పూజించాలి. గురువారం అరటిచెట్టు దగ్గర స్వచ్ఛమైన దేశీ నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి సంతసించి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అదృష్టాన్ని పెంచుకోవడానికి గురువారం ఈ పరిహారాలను చేయడం ద్వారా దేవ గురువు బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)