Kala Sarpa Yoga Effect: ఆ రాశుల వారికి కాలసర్ప దోషం.. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త..!

మార్చి 16 నుంచి 29 వరకు చంద్రుడితో సహా గ్రహాలన్నీ రాహు–కేతువుల మధ్య సంచరించడం జ్యోతిషశాస్త్రంలో కాలసర్ప యోగంగా పరిగణించబడుతుంది. ఈ 13 రోజుల సమయంలో కొన్ని రాశుల వారికి అనుకున్న పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారు ప్రయాణాలు, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. గురు గ్రహం రాహువుపై దృష్టి ఉండటం వల్ల తీవ్ర ప్రతికూల ఫలితాలు తగ్గే అవకాశముంది.

Kala Sarpa Yoga Effect: ఆ రాశుల వారికి కాలసర్ప దోషం.. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త..!
Kalasarpa Dosha

Edited By:

Updated on: Mar 16, 2026 | 1:03 PM

ఈ నెల(మార్చి) 16 నుంచి 29 వరకు చంద్రుడితో సహా గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య సంచారం చేయడం జరుగుతోంది. రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండడాన్ని జ్యోతిషశాస్త్రంలో కాలసర్ప దోషంగా పరిగణిస్తారు. ఈ 13 రోజుల కాలంలో కొన్ని రాశులకు అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్టుగా ఉంటుంది. వీరు ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టకపోవడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం, ఎవరికీ మాట ఇవ్వక పోవడం చాలా మంచిది. ఇందులో రాహువు మీద గురు గ్రహం దృష్టి పడడం వల్ల చెడు ఫలితాలు ఎక్కువగా ఉండకపోవచ్చు. అయినప్పటికీ, మిథునం, కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది.

  1. మిథునం: ఈ రాశికి తృతీయ, భాగ్య స్థానాల్లో రాహు కేతువుల సంచారం వల్ల కాలసర్ప దోషం ఏర్పడింది. దీనివల్ల ప్రతి ప్రయత్నం, ప్రతి పని తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. అధిక వ్యయానికి, అధిక శ్రమకు అవకాశం ఉంటుంది. అతి తక్కువ లాభానికి అతి ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు ముందుకు సాగకపోవచ్చు. దుర్వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఆదాయం తగ్గే అవకాశం ఉంది. ఇష్టమైన బంధుమిత్రులు దూరమవుతారు. ప్రాధాన్యం తగ్గుతుంది.
  2. కర్కాటకం: ఈ రాశికి ధన, అష్టమ స్థానాల మీద కాలసర్ప దోష ప్రభావం పడింది. అందువల్ల ఆదాయ వృద్ధి కుంటుబడుతుంది. ఆదాయ ప్రయత్నాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయంతో పాటు ప్రాభవం కూడా తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయ త్నాలు ఒక పట్టాన కలిసి రావు. బంధుమిత్రుల వల్ల విమర్శల పాలయ్యే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా నడుస్తాయి. రావాల్సిన డబ్బు ఒక పట్టాన చేతికి రాకపోవచ్చు.
  3. సింహం: ఈ రాశికి, సప్తమ స్థానానికి కాలసర్ప దోషం ఏర్పడుతున్నందువల్ల కుటుంబ, దాంపత్య సమస్యలు వృద్ధి చెందుతాయి. ఇంటా బయటా అనుకూలతలు బాగా తగ్గుతాయి. ప్రతి వారితోనూ అపార్థాలు తలెత్తుతాయి. డబ్బు ఇవ్వాల్సిన వారు ఇవ్వక ఇబ్బంది పడతారు. ఇవ్వాల్సిన చోట ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులతో అకారణ సమస్యలు తలెత్తుతాయి. వృత్తి, వ్యాపా రాల్లో పోటీదార్లు పైచేయి సాధిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఒక పట్టాన కలిసిరావు.
  4. వృశ్చికం: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాల మీద కాలసర్ప దోష ప్రభావం పడినందువల్ల ఆరోగ్యం, వాహన ప్రమాదాలు, అపనిందలు, అభియోగాల వంటి విషయాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం కొద్దిగా తగ్గుతాయి. కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామితో వాదోపవాదాలకు అవకాశం ఉంది. ప్రయాణాల వల్ల నష్టం కలుగుతుంది. ఆస్తి సమస్యలు ఇబ్బంది పెడతాయి.
  5. కుంభం: ఈ రాశికి, సప్తమ స్థానానికి మధ్య కాలసర్ప దోషం ఏర్పడుతున్నందువల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన ఉండే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. సుఖ సంతోషాలు బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో అధికారుల ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. శుభ కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. ఆశించిన శుభవార్తలు అందకపోవచ్చు.
  6. మీనం: ఈ రాశికి షష్ట, వ్యయ స్థానాల్లో ఏర్పడిన కాలసర్ప దోషం వల్ల ధన నష్టానికి, ఆర్థికపరమైన మోసాలకు బాగా అవకాశం ఉంది. ఏ పనీ ఒక పట్టాన పూర్తి కాదు. ఆరోగ్యపరంగా ఇబ్బంది కలు గుతుంది. వైద్య ఖర్చులు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు బాగా ఇబ్బంది పెడతాయి. కుటుంబ జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల వల్ల ఇబ్బందులుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా తగ్గుతాయి. ఎక్కువ శ్రమతో తక్కువ ఆదాయం పొందుతారు.
Follow Us