AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏప్రిల్ 26 రాశిఫలాలు: ఆర్థిక వ్యవహారాల్లో వారు జాగ్రత్త.. నిరుద్యోగులకు విజయం..!

Horoscope Today (April 26, 2026): ఆదివారంనాడు గ్రహస్థితుల ప్రభావంతో మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వారికి వృత్తి, ఆర్థిక, కుటుంబ విషయాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొందరికి ఆదాయం, అవకాశాలు పెరిగితే, మరికొందరు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సూచనలు ఉన్నాయి. 12 రాశుల వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఏప్రిల్ 26 రాశిఫలాలు: ఆర్థిక వ్యవహారాల్లో వారు జాగ్రత్త.. నిరుద్యోగులకు విజయం..!
Rashifal In Telugu 26 April 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 26, 2026 | 5:45 AM

Share

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2026): మేష రాశి వారు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. తోబుట్టువులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల్ని కొనసాగిస్తారు. మిథున రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలను అందుకుంటారు. వ్యాపారాల్లో ప్రధానమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. తోబుట్టువులతో వివాదాలను తెలివిగా పరిష్కరించుకుంటారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందుతాయి. కుటుంబ జీవితం చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాల పరిస్థితి నిలకడగానే ఉంటుంది. కొన్ని కుటుంబ సంబంధమైన వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. ఆస్తి వివాదాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల్ని కొనసాగిస్తారు. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. యాక్టివిటీ బాగా పెరిగే అవకాశంఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. చిన్ననాటి మిత్రులతో కలిసి విందుల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తలపెట్టిన పనుల్లో కొద్దిగా శ్రమాధి క్యత ఉంటుంది. నిరుద్యోగులు తమ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. పిల్లలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగిపో తుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఉత్సాహంతో బాధ్యతలను పూర్తి చేస్తారు. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీల్లో కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో కాస్తంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. భారీ లక్ష్యాల కారణంగా ఇబ్బంది పడతారు. వృత్తి జీవితంలో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. చిన్ననాటి స్నేహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. తలపెట్టిన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్, రాజకీయాలు, ఇతర బిజినెట్ రంగంలో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది. కుటుంబ సంబంధమైన వివాదాలు సర్దుమణుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపా రాలు బాగా బిజీగా సాగిపోతాయి. దగ్గర బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. అనుకో కుండా ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన దాని కంటే ఎక్కువగా సత్ఫలితాలను ఇస్తాయి. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయానికి లోటుండదు కానీ, అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో అప్రయత్న ధన లాభం ఉంటుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ‍సాగిపోతుంది. వ్యాపారాలలో కొత్త ఆలోచనలను, కొత్త వ్యూహాలను అమలు చేసి, ఆర్థికంగా లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం లభిస్తుంది. గృహ, వాహన సంబంధమైన ప్రయత్నాలు ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంది. రాబడి మార్గాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్య మైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు కూడా తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1)

వృత్తి, ఉద్యోగాల్లో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు సాఫీగా, ఉత్సాహంగా సాగిపోతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఆదాయానికి లోటుండదు. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, చేపట్టిన పనుల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయి. బంధుమిత్రుల్లో మాటకు విలువ పెరుగుతుంది. శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ప్రోత్సాహకరంగా సాగిపోతుంది. వృత్తి రంగంలో కొద్దిగా ఒత్తిడి, శ్రమ ఉండవచ్చు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. మీ మనుసులోని కోరికలు నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సన్నిహితులతో వాదోపవాదాలకు దిగవద్దు. ప్రముఖులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. ఆరోగ్యం పరవాలేదు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల మీద మరింతగా శ్రద్ధ పెంచుతారు. వ్యాపారాలు కాస్తంత బిజీగా సాగిపోతాయి. ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. కొన్ని కొత్త ప్రయత్నాలను చేపడతారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాల్ని చక్కబెడతారు. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ అదనపు ఆదాయ ప్రయత్నాల్ని పట్టు దలగా కొనసాగిస్తారు. ప్రయాణాల్లోనే కాక, ఆహార నియమాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. స్వయం ఉపాధి, వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా అది తప్పకుండా సఫలం అవుతుంది. నిరుద్యోగులకు అను కోకుండా మంచి ఆఫర్ అందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య, ఆర్థిక సమస్యల నుంచి ఊహించని ఉపశమనం లభిస్తుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడడం మంచిది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us