
శుక్రుడు, కుజుడు.. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రెండు రాశులకు చాలా ప్రాముఖ్యత ఉంది. కుజుడిని గ్రహాల అధిపతి అని అంటారు. కుజుడిని ధైర్యం, బలం, శక్తి, భూమి, సోదరులు మొదలైన వాటికి కారకాలుగా భావిస్తారు. ఇక, శుక్ర గ్రహం ప్రేమ, సౌందర్యం, సుఖం, ధనం, కళలు, వివాహం, భౌతిక సుఖశాంతులకు కారకుడిగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 జనవరిలో శుక్రుడు, కుజుడు ఒకరి పట్ల ఒకరు విరుద్ధంగా ఉన్నారు.
ద్రిక్ పంచాంగం ప్రకారం.. ఈ కొత్త సంవత్సరం మొదటి నెల జనవరిలో శుక్రుడు, కుజుడు ఒకదానికొకటి చలా దగ్గరికి వస్తాయి. రెండు గ్రహాలు ఇలా చాలా దగ్గరగా రావడాన్ని.. దాన్ని శుక్ర-కుజుల యుద్ధంగా పేర్కొంటారు. పంచాంగం ప్రకారం రెండు గ్రహాల మధ్య ఈ పరిస్థితి జనవరి 6వ తేదీ ఉదయం 8.19 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ శుక్ర-కుజ సంయోగం జనవరి 10న ఉదయం 9.13 గంటలకు ముగుస్తుంది.
ఈ శుక్ర-కుజ సంయోగం దాదాపు నాలుగు రోజులపాటు ఉంటుంది. గ్రహాలు యుద్ధ వాతావరణంలో ఉన్నప్పుడు.. వాటి ప్రభావం ఇవి పాలించే రాశులపై ఎక్కువగా పడుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. అందుకే శుక్ర-కుజ సంఘర్షణ కాలంలో ముఖ్యంగా ఈ నాలుగు రాశులవారు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.
మేష రాశి
మేష రాశి వారికి అంగారకుడు అధిపతి. అందుకే ఈ శుక్ర-కుజ సంయోగం ఈ రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మేష రాశి వారు సులభంగా కోపానికి గురవుతుంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత సంబంధాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారికి అలసట, అశాంతికి గురవుతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి. శుక్ర-కుజ సంయోగం ప్రభావంతో ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి కోపం, చిరాకు పెరిగే అవకాశం ఉంది. పనిలో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. వైవాహిక జీవితం ఒత్తిడికి గురికావచ్చు. ఆశించిన ఫలితాలను సాధించడంలో వైఫల్యం నిరాశకు దారితీస్తుంది.
వృషభం
వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి. ఈ శుక్ర-కుజుడుల సంయోగం వృషభ రాశి వారి ప్రేమ జీవితంలో, కుటుంబ సంబంధాల్లో ఉద్రిక్తతను సృష్టించే అవకాశం ఉంది. చిన్న చిన్న విషయాలకే విభేదాలు తలెత్తవచ్చు. ఖర్చులు అకస్మాత్తుగా పెరగవచ్చు.
తులా రాశి
శుక్రుడు తులా రాశి వారికి అధిపతి. అందుకే ఈ సమయంలో తులా రాశి వారు మానసిక గందరగోళాన్ని అనుభవించవచ్చు. సంబంధాలలో అపార్థం తలెత్తవచ్చు. మనస్సు అశాంతికి గురికావచ్చు. పనిలో వాదనలు లేదా సంఘర్షణలు నివారిస్తే వీరికే మంచిది.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలు, జ్యోతిషశాస్త్రం ఆధారంగా అందించడం జరిగింది. TV9 తెలుగు దీనిని ధృవీకరించదు.