Horoscope Today: ఈరాశుల వారు అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.. ఈరోజు రాశి ఫలాలు..

|

Oct 17, 2021 | 7:50 AM

నేటి ఆధునిక కాలంలోనూ రాశి ఫలాలను విశ్వసించే వారు అధిక సంఖ్యలో ఉన్నారు.. రోజులో తమ భవిష్యత్తులో ఏం జరగబోతుందనేది

Horoscope Today: ఈరాశుల వారు అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి.. ఈరోజు రాశి ఫలాలు..
Horoscope
Follow us on

నేటి ఆధునిక కాలంలోనూ రాశి ఫలాలను విశ్వసించే వారు అధిక సంఖ్యలో ఉన్నారు.. రోజులో తమ భవిష్యత్తులో ఏం జరగబోతుందనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాలు.. ఘడియాలపై పూర్తి విశ్వాసంతో భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి ఆలోచిస్తుంటారు. ఇక ఈరోజు అక్టోబర్ 17న చంద్రుడు రోజంతా మకర రాశిలో ఉంటాడు.. అలాగే ద్వాదశ తిథి.. శతభిష నక్షత్రం ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. మరి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా..

మేషరాశి..
ఈరాశి వారు ఈరోజు కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు.. అలాగే సంఘంలో గౌరవం పెరుగుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు.. బంధుమిత్రులను కలుసుకుంటారు…
వృషభ రాశి..
ఈరోజు వీరు… ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం.. అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది.. అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి.. కోపాన్ని తగ్గించుకుంటే.. మానసిక స్థితి మెరుగుపడుతుంది… చేపట్టిన పనులు అర్ధాంతరంగా మారిపోతాయి..
మిథున రాశి..
ఈరోజు వీరు ప్రయత్నాలకు ఆటంకాలు కలుగుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి… అధిక ఖర్చులు జరుగతాయి.. కుటుంబంలో సఖ్యత అవసరం..
కర్కాటక రాశి…
ఈరోజు వీరికి ఆర్థికి సమస్యలు పెరుగుతాయి.. ఆకస్మిక ప్రయణాలు చేస్తారు.. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి… తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది.. జాగ్రత్తగా ఉండాలి..
సింహ రాశి..
ఈరోజు వీరికి కొత్తవారితో పరిచయాలు ఏర్పడతాయి… బంధుమిత్రులు.. కుటుంబసభ్యులు గౌరవిస్తారు.. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.
కన్యరాశి..
ఈరోజు వీరు రుణాలు పొందుతారు.. కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి.. స్త్రీలకు అనారోగ్య సమస్యలు కలుగుతాయి..ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి..
తుల రాశి.
ఈరోజు వీరికి స్థాన చలనం కలిగే అవకాశాలు ఉంటాయి. ఇతరులతో వివాదాలు ఏర్పడతాయి.. ఖర్చులు పెరుగుతాయి… సరైన నిర్ణయాలు తీసుకోవాలి.
వృశ్చిక రాశి..
ఈరోజు వీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గోంటారు.. అలాగే ఆకస్మీక ప్రయాణాలు చేస్తారు.. కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. ఖర్చులు ఎక్కువవుతాయి.
ధనుస్సు రాశి..
ఈరోజూ వీరికి సంఘంలో గౌరవం పెరుగుతుంది. సరైన నిర్ణయాలు తీసుకుంటారు.. చేపట్టిన పనులకు ఆటంకాలు కలుగుతాయ. ఉద్యోగంలో ముందు జాగ్రత్తలు అవసరం.. ఇతరులతో కలహాలు ఏర్పడతాయి.
మకర రాశి..
ఈరోజు వీరికి పిల్లలతో ఇబ్బందులు కలుగుతాయి. పట్టుదలతో చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి గట్టేక్కుతారు. కొత్తవారితో పరిచయం కలుగుతుంది.
మీన రాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో కలహాలు దూరమవుతాయి.. సంఘంలో పేరు ప్రఖ్యాతలు పొందుతారు.. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

Also Read: Bigg Boss 5 Telugu: లోబో ఎలిమినేట్.. గుక్కపెట్టి ఏడ్చిన విశ్వ.. అందరి గురించి తెలుసుకోమంటూ లక్కీ

ఛాన్స్..

Bigg Boss 5 Telugu: మరోసారి అడ్డంగా దొరికిపోయిన రవి.. నిజంగానే గుంటనక్క అనేసిన నాగార్జున..