Horoscope Today: వీరికి అనవసర ఖర్చులు పెరుగుతాయి.. సోమవారం రాశి ఫలాలు..

|

May 09, 2022 | 6:42 AM

ఈరోజు వీరు దూర బంధువులను కలుసుకుంటారు. కుటుంబంలో విరోధాలు తగ్గుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. చేపట్టిన అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

Horoscope Today: వీరికి అనవసర ఖర్చులు పెరుగుతాయి.. సోమవారం రాశి ఫలాలు..
Follow us on

మేష రాశి..
ఈరోజు వీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగ రీత్యా స్థానచలన సూచనలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యల పట్ల జాగ్రత్తలు అవసరం.

వృషభ రాశి..
ఈరోజు వీరు దూర బంధువులను కలుసుకుంటారు. కుటుంబంలో విరోధాలు తగ్గుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. చేపట్టిన అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. అన్ని పనులలో విజయాన్ని సాధిస్తారు.

మిథున రాశి..
వీరు కొత్త పనులను ప్రారంభిస్తారు. ప్రతి విషయంలోనూ వ్యయ, ప్రయాసలు తప్పవు.. ఆకస్మికంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.

కర్కాటక రాశి..
ఈరోజు వీరు వాయిదా పడిన పనులను పూర్తి చేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబసభ్యుల మద్దతు లభిస్తుంది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహ రాశి..
ఈరోజు వీరు అశుభవార్తాలు వినాల్సి వస్తుంది. అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆకస్మిక ధననష్టం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.

కన్య రాశి..
ఈరోజు వీరు బంధుమిత్రులను కలుస్తారు. నూతన గృహ ప్రవేశం చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కుటుంబంలోని విభేధాలు తగ్గుతాయి. రుణ బాధలు తొలగిపోతాయి. స్నేహితులను కలుసుకుంటారు. ే

తుల రాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులన్నింటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో విభేధాలు తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలు ఉండవు. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి.

వృశ్చిక రాశి..
వీరు చేపట్టిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు.

ధనుస్సు రాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులను వాయిదా వేస్తారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. చేపట్టిన పనులను వాయిదా వేస్తారు. కుటుంబసభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితులలో మార్పులు ఉండవు.

మకర రాశి..
ఈరోజు వీరు బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది.

కుంభరాశి..
ఈరోజు వీరు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. చేపట్టిన పనులను వాయిదా వేస్తారు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

మీన రాశి..
ఈరోజు వీరు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. చేపట్టిన పనులను వాయిదా వేసుకోక తప్పదు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధననష్టం ఏర్పడుతుంది.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read:  Mothers Day 2022: అమ్మ ఒడిలో అమాయకంగా చూస్తోన్న ఈ చిన్నారి ఇప్పుడు సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌.. ఎవరో గుర్తుపట్టారా?

Sarkaru Vaari Paata: ఆ నవ్వే ఇక్కడి వరకూ తీసుకొచ్చింది.. దర్శకుడు పరశురామ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Macherla Niyojakavargam: రిలీజ్ డేట్ మార్చుకున్న యంగ్ హీరో.. నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’లో అడుగు పెట్టేది అప్పుడే.