
రోజంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. తోబుట్టు వుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కొందరు ప్రము ఖుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభి స్తాయి. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. నిరుద్యోగులకు అనుకోని ఆఫర్లు అందుతాయి.
ఆదాయానికి లోటుండకపోవచ్చు. షేర్లు బాగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాల్లో బంధు వుల్ని తలదూర్చనివ్వవద్దు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం అనుకూ లంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధువుల్లో పెళ్లి సంబంధానికి ప్రయత్నించడం మంచిది.
ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ధన కారకుడైన గురువు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి అంచనాలకు మించి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగిపోతాయి. రాజకీయంగా ముఖ్యమైన వ్యక్తులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి.
ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు అంది వస్తాయి. ఆదా యానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనలు సత్ఫలితా లనిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి చేయూత లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది.
రాశ్యధిపతి రవి అనుకూలత వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా పెరిగే అవకాశం ఉంది. కొద్దిపాటి ఆటంకాలు, ఇబ్బందులున్నా ఆస్తి సంబంధ మైన ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో దూసుకుపోతారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలు, అడ్డంకులు ఏర్పడతాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి.
ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. పదోన్నతికి అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు లాభిస్తాయి. నిరుద్యోగుల ప్రయ త్నాలు సఫలమవుతాయి. సాధారణంగా ఎలాంటి ప్రయత్నం చేపట్టినా విజయం సాధిస్తారు.వృత్తి, వ్యాపారాల్లో ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యానికి లోటుండదు. ప్రేమ వ్యవ హారాలు హ్యాపీగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు.
అంచనాలకు మించి వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు, అదనపు రాబడి పెరుగుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారంలో ఘన విజయాలు సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో విందులో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఊహిం చని కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. కొత్త ఆలోచనలకు, కొత్త ప్రయత్నాలకు ఇది అను కూల సమయం. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.
ఆదాయానికి లోటుండదు కానీ, ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ఇంటా బయటా మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు కొత్త బాధ్యతల్ని అప్పజెప్పే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రయాణాల్లో ఇబ్బంది పడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.
వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి తీరిక ఉండకపోవచ్చు. ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి. ఉద్యో గంలో మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు బాగా జోరందుకుంటాయి. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోవడం గానీ, మోసపోవడం గానీ జరుగుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. తలపెట్టిన పనులు చురుకుగా పూర్తవుతాయి. సొంత విషయాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపో తాయి.
పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారా లను పట్టుదలగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. కొందరు చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. వ్యాపారాల్లో లాభాలకు ఏమాత్రం లోటుండదు. ఆదాయం పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవ హారాల్లో ఆశించిన అనుకూలత ఉంటుంది. రావలసిన సొమ్ము, కొన్ని బాకీలు వసూలవుతాయి.
గురు బలం కారణంగా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థికంగా మంచి అదృష్టం పడుతుంది. ప్రతిష్ఠాత్మక కంపెనీల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో అంచనా లకు మించి రాబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరి స్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం, వాగ్దానాలు చేయకపోవడం మంచిది.
ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెడ తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో బరువు బాద్యతలు పెరిగే సూచనలున్నాయి. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం అను కూలంగా ఉంటుంది. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది.