
దిన ఫలాలు (మార్చి 19, 2026): మేష రాశి వారికి ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోయే అవకాశముంది. వృషభ రాశి వారు ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతికి, అధికారానికి మార్గం సుగమం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
ఉద్యోగ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగం మారడా నికి ఇది అనుకూల సమయం. శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ముఖ్యమైన వ్యవహారాల్ని సకాలంలో, సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యంలో పాల్గొంటారు.
వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలను సంతృప్తికరంగా చక్కబెడతారు. పిల్లల నుంచి ఆశించిన శుభ వార్తలు వింటారు. మిత్రులలో కొందరికి ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. అనవసర పరిచయాలకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఉద్యోగంలో ఊహించని పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతికి, అధికారానికి మార్గం సుగమం అవుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొందరు బంధువులు మిమ్మల్ని స్వప్రయోజనాలకు వాడుకునే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో బరువు బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. ఆస్తి సంబంధమైన వ్యవహారాలు కొద్దిగా చికాకు పెడతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి సంపాదన పెరుగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల ఒడిదుడుకుల నుంచి చాలావరకు బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామి సమర్థతకు గుర్తింపు లభి స్తుంది.
ఉద్యోగులకు అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. స్థానచలన సూచనలున్నాయి. వృత్తి, వ్యాపా రాలు నిలకడగా సాగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక ఒత్తిడి ఉంటుంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.
ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో సహచరులు, భాగస్వాములు కలిసి వస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. తోబుట్టువులతో మాటపట్టింపులు రాకుండా జాగ్రత్త పడండి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో సఫలమవుతాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పరవాలేదు.
వృత్తి, ఉద్యోగాల్లో అంచనాలకు మించిన పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉన్నతావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు కూడా తీసుకోవడం మంచిది. విలాస జీవితం అనుభవించడం, విలాస వస్తువుల మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీల వల్ల లాభంఉంటుంది.
ఉద్యోగంలో మీ కృషికి అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. అవసరానికి బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. ఆదాయ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ప్రయాణాల్లో, ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. సన్నిహితులతో సంప్రదించకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు.
ఉద్యోగులకు ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలు బాగా తగ్గుతాయి. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యం పరవాలేదు కానీ, శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి.
ముఖ్యమైన పనుల మీద వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపో తుంది. వృత్తి, వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. అనుకోకుండా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఇతరుల ముందు మీ రహస్యాలు బయటపెట్టకపోవడం శ్రేయస్కరం. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు.
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ, చివరికంతా సానుకూలంగా జరిగిపోతుంది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. సొంత విషయాల మీద వీలైనంతగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల బాధ్యతలను పంచుకునే ప్రయత్నం చేయ వద్దు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా, ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.
ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఉన్నప్పటికీ సరైన ప్రతి ఫలం పొందుతారు. ఆదాయ వృద్ధికి సంబంధించి ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమవుతుంది. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దిగవద్దు. నిరుద్యోగులు తమ ప్రయత్నాలను మరింతగా పెంచాల్సి ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నప్పటికీ, ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్ని విజయవంతంగా చక్కబెడతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.