
దిన ఫలాలు (జూన్ 1, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. మిథున రాశి వారికి కొత్త ఉద్యోగావకాశాలు ముందుకు వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
రోజంతా చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యులతో వెళ్లి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభ వార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి.
తలపెట్టిన వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురైనా పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు. ఉద్యోగంలో సహోద్యోగులు, కుటుంబంలో తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన ఉంటుంది. ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ జీవితం బాగా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
వృత్తి, ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు ముందుకు వస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. లాభదాయకమైన పరిచయాలు ఏర్పడతాయి. పిల్లల చదువుల విషయాల్లో ఆశించిన సమాచారం అందుకుంటారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు.
ఉద్యోగంలో అదనపు పని భారం తప్పకపోవచ్చు. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలను పూర్తి చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సమస్యలు, తోబుట్టువులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయం అందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు ఒక మోస్తరుగా ముందుకు సాగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సకాలంలో ముఖ్యమైన పనులుపూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నమ్మకాన్ని చూరగొంటారు. కొందరు మిత్రుల సాయంతో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటుతో వ్యవహరించవద్దు. ఆచితూచి అడుగువేయడం మంచిది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు.
ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు, వివాదాల నుంచి బయటపడతారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి, ఇతరత్రా భూముల క్రయవిక్రయాల్లో ఉన్నవారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. గృహ, వాహన సౌఖ్యాల మీద దృష్టి సారిస్తారు. పిల్లలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. ముఖ్యమైన పనుల్ని ఆలస్యంగానే అయినా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు బాగా లాభిస్తాయి.
ఆర్థికంగా, ఆరోగ్యపరంగా రోజంతా అనుకూలంగా గడిచిపోతుంది. ఇతరులకు ఆర్థికంగా వీలైనంతగా సహాయం చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు చేపట్టాల్సి వస్తుంది. హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. వ్యాపారాలు చాలావరకు కలిసి వస్తాయి అనేక కార్యాలను ఒకేసారి చక్కబెట్టే ప్రయత్నం చేసి, మానసిక విశ్రాంతికి దూరం అవుతారు. కుటుంబ బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయి. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగుల పని భారాన్ని కూడా పంచుకోవాల్సి వస్తుంది. మిత్రులతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి పెరుగుతుంది. ప్రయాణాల్లో, ముఖ్యంగా సొంత డ్రైవింగ్ లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు.
ఉద్యోగంలో మీ వల్ల అధికారులు ప్రయోజనాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. దగ్గర బంధువుల నుంచి శుభ కార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఇంటా బయటా మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నూతనోత్సాహంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రయత్నాలు బాగా సఫలం అవుతాయి. కొందరు స్నేహితుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి.
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రధానమైన వ్యక్తి గత సమస్య ఒకటి అప్రయత్నంగా పరిష్కారం అవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో కొన్ని నిర్ణయాలను మార్చుకోవాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.
ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి జీవితం బిజీ అయిపోతుంది. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ఆదాయం, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొన్ని ఖర్చుల విషయంలోనే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ జీవితంలో ప్రశాంతత లోపిస్తుంది. కోపతాపాలను తగ్గించుకోవడం మంచిది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామితో సంప్రదించాల్సి ఉంటుంది.
ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో పని భారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కుటుంబ సమస్యల పరిష్కారం మీద జీవిత భాగస్వామితో కలిసి దృష్టి పెడతారు. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పెళ్లికి సంబంధించి బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలు లాభి స్తాయి.