
దిన ఫలాలు (జనవరి 30, 2026): మేష రాశి వారికి కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. వృషభ రాశి రాశి వారికి వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోయే సూచనలున్నాయి. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారపరంగా రాబడి బాగా పెరుగుతుంది. కుటుంబంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొందరు మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. రుణాల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. పిల్లల విద్యా విషయాల మీద శ్రద్ధ పెడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.
వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. ఆశించిన స్థాయిలో రాబడి కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి శుభవార్తలు వింటారు. రావలసిన బాకీలు, బకాయిలు వసూలవుతాయి. నిరుద్యోగులు తమకు అందివచ్చిన ఉద్యోగావకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం శ్రేయస్కరం. ప్రయాణాల్లో డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.
వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయంలో అంచనాలకు మించిన పెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యల్ని వీలైనంతగా తగ్గించుకుంటారు. దూర ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పిల్లలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. కుటుంబ వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా నడుస్తాయి. ఇంటా బయటా పని భారం కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఒకటి రెండు శుభవార్తలు వార్తలు వినడం జరుగుతుంది. ఎక్కడా తొందరపాటుతో వ్యవహరించవద్దు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా, ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న సమయానికి ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ఇక కుటుంబ పెద్దల నుంచి కొద్దిగా సంపద కలిసి వస్తుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది.
వృత్తి, ఉద్యోగాల్లో అటు అధికారులను, ఇటు సహోద్యోగుల్ని మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. ఇష్టమైన ఆలయాల్ని సందర్శిస్తారు. రోజంతా మీకు అనుకూలంగా సాగిపోతుంది. ఇష్టమైన మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగిపోతుంది.
ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడతారు. వృత్తి, వ్యాపారాలు బిజీ అయిపోతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. బంధుమిత్రుల రాకపోకలుంటాయి. ఇష్టమైన వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది.
ఉద్యోగంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది. కొన్ని వ్యక్తిగత సమస్యల్ని తగ్గించుకుంటారు. కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో కార్యకలాపాలన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. కొందరు స్నేహితుల వల్ల బాగా లాభపడే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా పెరుగుతుంది. వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఇంటా బయటా బాధ్యతలు పెరిగి తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యయ ప్రయాసలు, ఆలస్యాలు, ఒత్తిడి వంటివి తప్పకపోవచ్చు. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. జీవిత భాగ స్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. కొందరు మిత్రులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది.
వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, పోత్సాహం లభిస్తాయి. కొత్త వ్యాపారాలను ప్రారంభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు వృద్ది చెందుతాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఒకటి రెండు ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఒకటి రెండు ఆశించిన శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు.
వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు నిలకడగా సాగి పోతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఇంటా బయటా పలుకుబడి పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన పనులు నిదానం సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.
వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకర పరిస్థితులుంటాయి. ఆర్థిక విషయాల్లో రోజంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తవుతాయి. మానసికంగా ఊరట లభిస్తుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏలిన్నాటి శని ప్రభావం వల్ల చిన్నాచితకా సమస్యలున్నా వాటిని తేలికగా అధిగమిస్తారు. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకోవడం జరుగుతుంది.
వృత్తి, ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభించడంతో పాటు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఒకటి రెండు ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. అన్యోన్యత పెరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.