Horoscope Today: శుక్రవారం రాశి ఫలాలు.. వీరికి శుభకాలం.. వ్యాపారంలో లాభాలు.. ఆర్థికంగానూ అనుకూలం

|

Oct 07, 2022 | 5:08 AM

ఈరాశివారికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. స్థిరమైన ఆలోచనలతో సానుకూల ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు పొందుతారు.శివారాధన చేయడం వల్ల మరిన్ని సానుకూల ఫలితాలు పొందుతారు.

Horoscope Today: శుక్రవారం రాశి ఫలాలు.. వీరికి శుభకాలం.. వ్యాపారంలో లాభాలు.. ఆర్థికంగానూ అనుకూలం
Horoscope Today
Follow us on

మేషం

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవాలి. ఇష్టదైవ ప్రార్థన వల్ల మంచి జరుగుతుంది.

వృషభం

ఈరాశివారు మానసికంగా ధృడంగా ఉంటారు. బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కీలక విషయాలు, వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఇష్టదైవ నామస్మరణ మాత్రం మరవద్దు.

మిథునం

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ పెరగవచ్చు. బంధువులతో కలహా సూచనలకు ఆస్కారముంది. అనవసర ధనవ్యయంతో ఇబ్బందులు పడతారు. ఇష్ట దైవారాధనతో సానుకూల ఫలితాలు పొందుతారు.

ఇవి కూడా చదవండి

కర్కాటకం

కీలకమైన పనులకు శ్రీకారం చుడతారు. కొన్ని విషయాల్లో మొహమాటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడతారు. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే శుభం కలుగుతుంది.

సింహం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార తదితర రంగాల్లో సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక పరమైన విషయాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ఇష్టదైవారాధన మాత్రం మానవద్దు.

కన్య

కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తనతో ఇబ్బందులు పడతారు. మానసికంగా మరింత ధృఢంగా ఉండాలి. సంకటహర గణపతి స్తోత్రం పఠించడం వల్ల మేలు చేకూరుతుంది..

తుల

కొన్ని వ్యవహారాల్లో చిన్నపాటి సమస్యలు ఎదురువుతాయి. అయినా ఆత్మవిశ్వాసంతో పూర్తిచేయగలుగుతారు. అలసట, ఖర్చులు పెరుగుతాయి. ప్రతికూల పరిస్థితులు నిరుత్సాహపరుస్తాయి.ఇష్టదేవతా నామస్మరణ మంచిది.

వృశ్చికం

ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠిస్తే శుభం కలుగుతుంది.

ధనస్సు

సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కీలక విషయాలు, వ్యవహారాల్లో బంధు, మిత్రుల సహకారం లాభిస్తుంది. ఉద్యోగ విషయాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు.

మకరం

కీలక విషయాలు, వ్యవహారాల్లో కుటుంబీకులు, పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. వినోదాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. అనవసర ధనవ్యయంతో ఇబ్బందులు తప్పవు. ఇష్టదేవతలను పూజిస్తే మంచిది.

కుంభం

కుటుంబీకులు, బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. కొన్ని పనుల్లో అలసత్వం వల్ల ఇబ్బందులు పడతారు. ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలి. ఆదిత్యహృదయం పఠిస్తే ఉత్తమం

మీనం

ఈరాశివారికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. స్థిరమైన ఆలోచనలతో సానుకూల ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు పొందుతారు.శివారాధన చేయడం వల్ల మరిన్ని సానుకూల ఫలితాలు పొందుతారు.

NOTE: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.