Horoscope Today (06-06-2022): రోజులో ఏ పనులు ప్రారంభించాలన్నా.. ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాలు ( Daily Horoscope)ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు (జూన్ 6వ తేదీ ) సోమవారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..!
మేష రాశి: ఈరోజు ఈ రాశివారు మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ఆత్మీయుల సహాయసహకారాలు అందుతాయి. బంధువుల, స్నేహితులు మేలు చేస్తారు. శుభఫలితాలు పొందుతారు.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు కీలక వ్యవహారాలతో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒత్తడి పెరగకుండా చేపట్టిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దైవ దర్శనం చేసుకుంటారు.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. చేపట్టిన పనుల వలన ఒత్తిడి పడాల్సి ఉంటుంది. ఇతరుల సహకారంతో పనులు చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి: ఈ రాశివారు మానసిక ధైర్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులతో కలిసి సుఖ సంతోషాలతో గడుపుతారు. ప్రణాళికతో ముందగువేస్తే.. లాభాలను ఆర్జిస్తారు.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను ఉత్సాహంతో పూర్తి చేసి.. శుభఫలితాలను అందుకుంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఒక ముఖ్యమైన పనిని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు. శుభఫలితాలు పొందుతారు. బంధుమిత్రులతో సుఖసంతోషాలతో గడుపుతారు.
తుల రాశి: ఈ రోజు ఈ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. బంధుమిత్రుల సహకారంతో ముందడుగు వేస్తారు. ప్రణాళిక బద్ధంగా కొన్నిపనులు చేయగలుగుతారు.
వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశివారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. అందరిని కలుపుకుని వెళ్లడంవలన సమస్యలు తగ్గుతాయి. అధిక శ్రమ చేయాల్సి ఉంటుంది. ఆవేశంలో నిర్ణయాలను తీసుకోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో పనులను పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. శుభ వార్త వింటారు. మీ ప్రతిభకు తగిన ప్రశంసలను పొందుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు అడుగు వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటారు. కలహాలకు దూరంగా ఉండడం వలన మేలు చేస్తుంది.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వృత్తి, బంధు, మిత్రులతో సందర్భాను సారంగా జాగ్రత్తగా ముందుకు సాగడం వలన శుభఫలితాలను పొందుతారు. అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్ధికంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు కాలానుగుణంగా తగిన నిర్ణయాలను తీసుకుంటే.. రంగాల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా లాభపడతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)